సాక్షి, కరీంనగర్: జీతాలు రాకపోవడంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చే అరకొర జీతాలు కూడా ప్రభుత్వం సక్రమంగా ఇవ్వడంలేదని వాపోతున్నారు. అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ‘రెండు నెలలు బ్లీచింగ్ పౌడర్ కొట్టించారు.. జీతం అడిగితే తొలగించారు’’ అంటూ సోషల్ మీడియాలో కరీంనగర్ నగరపాలక సంస్థ పొరుగు సేవల ఉద్యోగి పోస్ట్ వైరల్‌గా మారింది. దళితుడినయినా తనకు న్యాయం చేకూర్చాలంటూ కరీంనగర్‌కు చెందిన పొరుగు సేవల ఉద్యోగి కొండ్ర సుధాకర్ కొండ్ర విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ వల్ల ఆరోగ్యం దెబ్బ తిందని ఆవేదన చేస్తున్న సుధాకర్.. తనకు అన్యాయం జరిగిందని ఉద్యోగం ఇవ్వాలంటూ మొర పెట్టుకున్నారు.
Bleeching powder valla health sick 3days live 4days job join ayyan 2month work chesaka salary adegithe job nuddi tholigichnaru kindla sir please any section gave the job sir I am sc B KNR thank you sir pic.twitter.com/KlE1BbfZRp
— Sudhakar Kondra (@KondraSudh67685) May 19, 2023
Comments
Please login to add a commentAdd a comment