
శ్రీముఖి.. తెలుగులో టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది.

అడపాదడపా సినిమాలు కూడా చేసింది. అటు బిగ్‌బాస్ మూడో సీజన్‌లోనూ పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.

మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. తన తల్లి లతాశ్రీతో కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తనను బాడీ షేమింగ్ చేసినప్పుడు తల్లే అండగా ఉందని చెప్పుకొచ్చింది.

తనలో స్ఫూర్తి నింపిన వ్యక్తి అమ్మేనని పేర్కొంది. తనకు ఇష్టమైన బ్యూటీపార్లర్ నేర్చుకోవడేమ కాకుండా నలుగురికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగిందని గర్వంగా చెప్పుకొచ్చింది.

తల్లితో శ్రీముఖి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.




