![Sensational Created WhatsApp Post In Tamilnadu - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/19/Gunny-bag.jpg.webp?itok=bLtv5d81)
ప్రతీకాత్మక చిత్రం
టీ.నగర్: నాగర్‌కోవిల్ టౌన్ రైల్వేస్టేషన్‌లో గోనెసంచిలో దూరి నిద్రిస్తున్న యువకుడు హత్యకు గురైనట్లు వాట్సాప్‌లో వ్యాపించిన సమాచారం సంచలనం రేపింది. మొదటి ప్లాట్‌ఫాంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. రెండో ప్లాట్‌ఫాంలో మాత్రమే రైళ్లు వచ్చి వెళతాయి. ఉదయాన్నే అనేక మంది ఇక్కడికి వాకింగ్‌కు వస్తుంటారు. శనివారం ఉదయం వాకింగ్‌కు రాగా కొంతమంది ఒకటో ప్లాట్‌ఫాం సమీపంలో పసుపురంగు గోనెసంచిలో శరీరమంతా మూసుకుని ఒకరు కనిపించారు.
ఉదయం ఎనిమిది గంటలకు అలాగే పడివుండడంతో గోనెసంచిలో యువకుడి శవం అంటూ వాట్సాప్‌లో పలువురు షేర్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, పత్రికా విలేకరులు అక్కడికి చేరుకున్నారు. హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచిన యువకుడు పక్కనున్న పాదరక్షలు వేసుకుని నడిచివెళ్లాడు. దీంతో అక్కడికి వచ్చిన వారు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని నవ్వుకుంటూ వెళ్లారు. వాట్సాప్ సమాచారం ఎంతపని చేస్తాయనుకుంటూ పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
చదవండి:
మితిమీరిన కారు వేగం.. తెగిపడిన యువకుడి తల
ఇండియా బుక్‌లోకి ‘ఎన్నికల వీరుడు’
Comments
Please login to add a commentAdd a comment