ఇలా మారడం అంతా సులభం కాదు: రియా చక్రవర్తి | Rhea Chakrabortys Post Its Not Been Easy To Get Here About 2021 Year | Sakshi
Sakshi News home page

Rhea Chakraborty: ఇలా మారడం అంతా సులభం కాదు: రియా చక్రవర్తి

Published Fri, Dec 31 2021 5:18 PM | Last Updated on Fri, Dec 31 2021 5:18 PM

Rhea Chakrabortys Post Its Not Been Easy To Get Here About 2021 Year - Sakshi

Rhea Chakraborty's Post Its Not Been Easy To Get Here About 2021 Year: 2021 సంవత్సరానికి బై బై చెబుతూ 2022 న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతూ అనేక మంది సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వారికి ఈ ఏడాది ఎలా గడిచిందో అభిమానులతో పంచుకుంటున్నారు. కష్టం నుంచి చిరునవ్వు వరకు అంటూ ఎమోషనల్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. బాలీవుడ్‌ దివంగత హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రియురాలు హీరోయిన్‌ రియా చక్రవర్తి 2021 ఇయర్‌ తనకు ఎలా గడిచిందో చెప్పుకొచ్చింది. ఈ ఏడాదిని బాధ, దాన్ని నయం చేసిన సంవత్సరంగా తెలుపుతూ అందమైన పోస్ట్‌ పెట్టింది. 

ఈ పోస్ట్‌లో 'నేను నవ్వడం నువ్‌ చూశావ్‌. కానీ ఇక్కడికి రావడం (ఇలా మారడం) అంత సులభం కాదు. బాధ, బాధను నయం చేసుకునేందుకు ఈ ఏడాది మొత్తం గడిచింది. కానీ ఇప్పుడు నేను నిన్ను (2021) నవ్వుతూ చూస్తున్నాను. ఎందుకంటే నిన్ను కష్టపెట్టనిది ఏది నిన్నుస్ట్రాంగ్‌గా మార్చలేదు. మీ ప్రియమైన వారితో ఈ 2022 సంవత్సరాన్ని జరుపుకోండి. 2022 మనందరిపై దయ, ప్రేమతో ఉండాలి.' అని రియా పేర్కొంది. 2020లో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్యకు రియా ప్రేరేపించిందన్న ఆరోపణలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 
 


ఇదీ చదవండి: చావు అంచుల వరకు వెళ్లొచ్చా.. నటి ఎమోషనల్‌ పోస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement