Upasana Konidela Shares Emotional Post On Her Wedding Photo- Sakshi
Sakshi News home page

Upasana And Samantha: ఉపాసన ఎమోషనల్‌ పోస్ట్‌.. సమంత రియాక్షన్‌

Published Tue, Dec 7 2021 9:27 AM | Last Updated on Tue, Dec 7 2021 1:10 PM

Upasana Konidela Shares Emotional Post On Her Wedding Photo - Sakshi

Upasana Konidela Shares Emotional Post On Her Wedding Photo: మెగా కోడలు ఉపాసన కొణిదెల సోదరి అనుష్పల కామినేని వివాహ వేడుకలు దోమకొండ గడికోటలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల‍్లో భాగంగా కామినేని వారి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పోచమ‍్మ పండుగను నిర్వహించారు. ఈ కార్యక‍్రమానికి మెగాస్టార్‌ కుటుంబం కూడా హాజరైంది. ఈ సెలబ్రేషన్స్‌లో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన సందడి చేసిన ఫొటోలు, వీడియోలను ఉపాసన ఇప్పటికే షేర్‌ చేసింది. అయితే తాజాగా ఉపాసన తన సోదరి పెళ్లి వేడుకలలో తన వివాహ విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోచమ్మ గుడికి వెళ్లినప్పుడు ధరించిన దుస్తుల గురించి చెప‍్పుకొచ్చారు. తొమ్మిదేళ్ల క్రితం తన పెళ్లి వేడుకల‍్లో భాగంగా పోచమ్మ పండుగ సెలబ్రేష‍న్స్‌లో వేసుకున్న దుస్తులను రీక్రియేట్‌ చేసి ఇప్పుడు తన సోదరి వివాహ వేడుక సందర్భంగా వేసుకున్నట్లుగా ఉపాసన పేర్కొన్నారు.

ఉపాసన తన ఇన్‌స్టా గ్రామ్‌ అకౌంట్‌లో 'దుస్తులను వేసుకోవడం, వాటిని జాగ్రత్తగా భద్రపరచడం నాకు ఎంతో ఇష్టం. అంది నాకు గర్వంగా ఉంటుంది. నాణ్యత ఉన్న వస్త్రాలను షాపింగ్‌ చేయడం నాకు ఇష్టం. దుస్తులతో వెలకట్టలేని ఎమోషన్స్ ఉంటాయి. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత దోమకొండలో నా పెళ్లికి సంబంధించిన పోచమ్మ పండుగ సెలబ్రేషన్స్‌ దుస్తులను రీక్రియేట్‌ చేసినందుకు అనామిక ఖన్నాకు థ్యాంక్స్‌' అని తెలిపారు. అలాగే ప్రస్తుత ఫొటోలతోపాటు తన వివాహ ఫొటోలను షేర్‌ చేసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ పోస్ట్‌కు పలువురు స్పందించగా, స్టార్‌ హీరోయిన్‌ సమంత 'బ్యూటిఫుల్‌' అంటూ రియాక్షన్ ఇచ్చింది. 

ఇదీ చదవండి:  అనుష్పల పెళ్లి వేడుకలో పోచమ్మ పండుగ, రామ్‌చరణ్‌, ఉపాసన సందడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement