domakonda mandal
-
కూతురి కోసం పంటనే పండించింది
తల్లిగుణం అందరి మేలు కోరుతుంది. కూతురి అనారోగ్య సమయంలో డ్రాగన్ ఫ్రూట్ తినిపించాలని వెతికితే దాని ఖరీదు సామాన్యులకు అందుబాటులో లేదనిపించిందామెకు. తన కూతురు లాంటి వాళ్లు ఎందరో ఈ పండుకు దూరం కావలసిందేనా అని బాధ పడింది. పట్టుదలతో ఏకంగా పంటే పండించింది. డ్రాగన్ ఫ్రూట్ రైతు రేణుక కథ ఇది.‘మీ అమ్మాయికి ప్లేట్లెట్స్ బాగా పడిపోయాయి. ప్లేట్లెట్స్ పెరగడానికి డ్రాగన్ ఫ్రూట్ తినిపించమ్మా’ అని డాక్టర్ చెప్పిన మాట ఆ తల్లిని డ్రాగన్ పంట స్వయంగా సాగు చేసే వరకు తీసుకువెళ్లింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన రేణుక, పరశురాములు దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. ఇంటర్ చదువుతున్న కూతురు విజయకు కరోనా కాలంలో సుస్తీ చేసింది. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్లేట్లెట్స్ తగ్గిపోయాయని గుర్తించిన వైద్యులు ప్లేట్లెట్స్ పెర గడానికి డ్రాగన్ ఫ్రూట్ తినిపించమని చె΄్పారు. దాంతో తల్లి రేణుక కామారెడ్డి పట్టణంలో పండ్ల దుకాణాలన్నింటా డ్రాగన్ ఫ్రూట్ కోసం తిరిగితే ఎక్కడా దొరకలేదు. ఆఖరుకు ఒక సూపర్ మార్కెట్లో దొరికాయి. ఒక్కో పండు రూ.180 చె΄్పారు. అంత ఖరీదా అని ఆశ్చర్యపోయింది రేణుక. అంత రేటు పెట్టాల్సి వచ్చినందుకు చిన్నబుచ్చుకుంది. అయినా సరే కొనుగోలు చేసి తీసుకువెళ్లి కూతురికి తినిపించింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తరువాత ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు.మనం ఎందుకు పండించకూడదు?రేణుకకు చదువు లేదు. కానీ వ్యవసాయం మీద మంచి పట్టు ఉంది. రేణుక భర్త పరశురాములు కూడా చదువుకోకున్నా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలన్న ఆశ ఉంది. అంతవరకూ సంప్రదాయ సేద్యం చేస్తున్న ఆ ఇద్దరూ కూర్చుని ‘డ్రాగన్ ఫ్రూట్’ గురించి చర్చించుకున్నారు. ‘మనం పండించి తక్కువకు అమ్ముదాం’ అంది రేణుక. ఆ తర్వాత భర్తతో కలిసి డ్రాగన్ ఫ్రూట్ సాగు పద్ధతుల గురించి పిల్లలతో కలిసి యూ ట్యూబ్‌లో చూసింది. ఆ పంట పండించాలన్న నిర్ణయానికి వచ్చిన రేణుక, పరశురాములు జగిత్యాల జిల్లాలోని అంతర్గాంలో డ్రాగన్ ఫ్రూట్ కు సంబంధించిన మొలకలు దొరుకుతాయని తెలుసుకున్నారు. ఓ రోజు అక్కడికి వెళ్లి పంట సాగు గురించి వారితో మాట్లాడారు. ఎకరంలో సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని మొక్కలు అవసరమవుతాయో అడిగి తెలుసుకున్నారు. వాళ్లిచ్చిన సూచనల మేరకు ఇంటికి చేరుకున్న తరువాత ఎకరం పొలం దుక్కి దున్నారు. చుట్టూరా ఇనుపజాలీతో కంచె ఏర్పాటు చేశారు. మొక్కల కోసం స్తంభాలు, కర్రలను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే డ్రిప్ సౌకర్యం కల్పించుకున్నారు. పొలం తనఖా పెట్టి రూ.3 లక్షలు, అలాగే డ్వాక్రా సంఘం నుంచి రూ. 2 లక్షలు అప్పు తీసుకుని పంట సాగు మొదలుపెట్టారు.43 పండ్లు దక్కాయిపంట సాగు చేసిన తొలి ఏడాది నలబై మూడు పండ్లు మాత్రమే చేతికందాయి. దాంతో మరిన్ని మెళకువలు తెలుసుకుని మరింత కష్టపడి సాగు చే యడంతో రెండో ఏడాదికి వచ్చేసరికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దళారులకు అమ్మితే గిట్టుబాటు కాదని భార్య, భర్త ఇద్దరూ గంపల్లో పండ్లను పెట్టుకుని సిద్దిపేట, మెదక్, కామారెడ్డి తదితర పట్టణాలకు తీసుకు వెళ్లి ఒక్కో పండు. వంద నుంచి రూ.150 వరకు అమ్ముకుంటే రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి రూ.4 లక్షలు ఆదాయం సమకూరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. పది పదిహేనేళ్లపాటు పంట వస్తుందని, తాము అనుకున్నదానికన్నా ఎక్కువే సంపాదిస్తామన్న ధీమాతో ఉన్నారు.– ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
ఉపాసన ఎమోషనల్ పోస్ట్.. సమంత రియాక్షన్
Upasana Konidela Shares Emotional Post On Her Wedding Photo: మెగా కోడలు ఉపాసన కొణిదెల సోదరి అనుష్పల కామినేని వివాహ వేడుకలు దోమకొండ గడికోటలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా కామినేని వారి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పోచమ్మ పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ కుటుంబం కూడా హాజరైంది. ఈ సెలబ్రేషన్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన సందడి చేసిన ఫొటోలు, వీడియోలను ఉపాసన ఇప్పటికే షేర్ చేసింది. అయితే తాజాగా ఉపాసన తన సోదరి పెళ్లి వేడుకలలో తన వివాహ విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోచమ్మ గుడికి వెళ్లినప్పుడు ధరించిన దుస్తుల గురించి చెప్పుకొచ్చారు. తొమ్మిదేళ్ల క్రితం తన పెళ్లి వేడుకల్లో భాగంగా పోచమ్మ పండుగ సెలబ్రేషన్స్‌లో వేసుకున్న దుస్తులను రీక్రియేట్ చేసి ఇప్పుడు తన సోదరి వివాహ వేడుక సందర్భంగా వేసుకున్నట్లుగా ఉపాసన పేర్కొన్నారు. ఉపాసన తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లో 'దుస్తులను వేసుకోవడం, వాటిని జాగ్రత్తగా భద్రపరచడం నాకు ఎంతో ఇష్టం. అంది నాకు గర్వంగా ఉంటుంది. నాణ్యత ఉన్న వస్త్రాలను షాపింగ్ చేయడం నాకు ఇష్టం. దుస్తులతో వెలకట్టలేని ఎమోషన్స్ ఉంటాయి. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత దోమకొండలో నా పెళ్లికి సంబంధించిన పోచమ్మ పండుగ సెలబ్రేషన్స్ దుస్తులను రీక్రియేట్ చేసినందుకు అనామిక ఖన్నాకు థ్యాంక్స్' అని తెలిపారు. అలాగే ప్రస్తుత ఫొటోలతోపాటు తన వివాహ ఫొటోలను షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌కు పలువురు స్పందించగా, స్టార్ హీరోయిన్ సమంత 'బ్యూటిఫుల్' అంటూ రియాక్షన్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) ఇదీ చదవండి: అనుష్పల పెళ్లి వేడుకలో పోచమ్మ పండుగ, రామ్‌చరణ్, ఉపాసన సందడి -
దోమకొండ గడికోటలో ఘనంగా ఉపాసన సోదరి పెళ్లి వేడుకలు, మెగా ఫ్యామిలీ సందడి
మెగా కోడలు ఉపాసన కొణిదెల సోదరి అనుష్పల కామినేని వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడులో భాగంగా కామినేని వారి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పోచమ్మ పండుగను నిర్వహించారు. ఈ వేడుకలకు కామినేని కుటుంబ సభ్యులతో పాటు ఇటూ మెగా ఫ్యామిలీ హజరయ్యారు. కాగా ఉపాసాన, అనుష్పలు దోమకొండ గడికోట వారసులైన కామినేని అనిల్ కుమార్ శోభనల దంపతుల సంతానం. దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో నిర్వహించిన ఈ పోచమ్మ పండుగ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆయన సతీమణి ఉపాసన కొణిదెల సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: బయటకు వచ్చిన పింకీ తొలి ఇంటర్య్వూ.. మానస్ గురించి ఏం చెప్పిందంటే కోట ప్రాంతం పూర్తిగా పెళ్లి భాజభజంత్రీలతో మార్మోగింది. గడికోట ముఖ ద్వారం నుంచి గడికోటలోని పోచమ్మ దేవాలయం వరకు బోనం ఎత్తుకొని పెళ్లి కుమార్తె అనుష్ప అందరిని ఆకర్షించింది. కుటుంబ సాంప్రదాయమైన ఇంట్లో ఏదైనా శుభకార్యానికి ముందు ఈ విధంగా పండుగను నిర్వహిస్తున్నట్లు గడికోట వారసులు తెలిపారు. ఈ పోచమ్మ పండుగ కార్యక్రమంలో రామ్‌చరణ్, ఉపాసన, మెగా ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీతో పాటు అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, అపోలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: తన ఫ్రెండ్ ట్రాన్స్‌జెండర్‌తో ఉపాసన, సోదరి పెళ్లి వేడుకలకు ఆహ్వానం -
అగ్నిప్రమాదంలో వృద్దురాలి సజీవ దహనం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వరనగర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదంలో సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో లచ్చవ్వ(62) అనే వృద్దురాలు సజీవ దహనమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని గుడిసెలు దగ్ధమయ్యాయని స్థానికులు వెల్లడించారు. గాఢ నిద్రలో ఉన్న వారు మంటలను చూసి బయటికి పరుగుతీశారు. అయితే వృద్ధాప్యం కారణంగా లచ్చవ్వ బటికి రాలేకపోయి అగ్నికీలల్లో చిక్కుకుని మృతి చెందింది.