నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వరనగర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదంలో సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో లచ్చవ్వ(62) అనే వృద్దురాలు సజీవ దహనమైంది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని గుడిసెలు దగ్ధమయ్యాయని స్థానికులు వెల్లడించారు. గాఢ నిద్రలో ఉన్న వారు మంటలను చూసి బయటికి పరుగుతీశారు. అయితే వృద్ధాప్యం కారణంగా లచ్చవ్వ బటికి రాలేకపోయి అగ్నికీలల్లో చిక్కుకుని మృతి చెందింది.