![Ram Charan And Mega Family Attends Upasana Sister Marriage Celebration At Gandikota - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/6/upasana-1.jpg.webp?itok=mAwG6GKm)
మెగా కోడలు ఉపాసన కొణిదెల సోదరి అనుష్పల కామినేని వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడులో భాగంగా కామినేని వారి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పోచమ్మ పండుగను నిర్వహించారు. ఈ వేడుకలకు కామినేని కుటుంబ సభ్యులతో పాటు ఇటూ మెగా ఫ్యామిలీ హజరయ్యారు. కాగా ఉపాసాన, అనుష్పలు దోమకొండ గడికోట వారసులైన కామినేని అనిల్ కుమార్ శోభనల దంపతుల సంతానం. దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో నిర్వహించిన ఈ పోచమ్మ పండుగ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆయన సతీమణి ఉపాసన కొణిదెల సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
చదవండి: బయటకు వచ్చిన పింకీ తొలి ఇంటర్య్వూ.. మానస్ గురించి ఏం చెప్పిందంటే
కోట ప్రాంతం పూర్తిగా పెళ్లి భాజభజంత్రీలతో మార్మోగింది. గడికోట ముఖ ద్వారం నుంచి గడికోటలోని పోచమ్మ దేవాలయం వరకు బోనం ఎత్తుకొని పెళ్లి కుమార్తె అనుష్ప అందరిని ఆకర్షించింది. కుటుంబ సాంప్రదాయమైన ఇంట్లో ఏదైనా శుభకార్యానికి ముందు ఈ విధంగా పండుగను నిర్వహిస్తున్నట్లు గడికోట వారసులు తెలిపారు. ఈ పోచమ్మ పండుగ కార్యక్రమంలో రామ్‌చరణ్, ఉపాసన, మెగా ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీతో పాటు అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, అపోలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: తన ఫ్రెండ్ ట్రాన్స్‌జెండర్‌తో ఉపాసన, సోదరి పెళ్లి వేడుకలకు ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment