Gandikota
-
ఘన చరితకు సాక్ష్యం గండికోట
తెలుగువారి శౌర్యప్రతాపాలకు నిలువెత్తు సాక్ష్యం. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలిచి, దండయాత్రకు వచ్చిన శత్రువులను చీల్చిచెండాడి విజయభేరి మోగించిన శత్రుదుర్భేద్యమైన దుర్గం. చుట్టూ ఎత్తయిన ఎర్రని కొండలు, మధ్యలో నిలువులోతున హొయలుపోతూ వడివడిగా ప్రవహించే పెన్నమ్మ, నలుచెరగులా పచ్చదనాన్ని కప్పుకున్న ప్రకృతికాంత అందాలు. కొండపైన నిలువెత్తు బురుజులతో అబ్బురపరచే గండికోటను చరిత్రకారులు అమెరికాలోని గ్రాండ్‌క్యానియన్‌తో పోలుస్తారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గండికోట అందాలు పర్యాటకుల్ని అలరిస్తున్నాయి.సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట గిరి, జల, వన దుర్గంగా పేరుపొందింది. ఈ కోటను శత్రుదుర్భేద్యమైనదిగా చెబుతారు. పెన్నానది ఇక్కడ రెండు కొండలను ఐదు కిలోమీటర్ల పొడవునా గండికొట్టి వెళ్తుంది కనుక ఆ ప్రాంతంలో కట్టిన ఈ కోటకు గండికోటగా పేరొచ్చింది. 11వ శతాబ్దం నుంచి దాదాపు 800 సంవత్సరాలపాటు ఈ కోట పలు వంశాల రాజుల పాలనలో ఉంది. కైఫీయత్ ప్రకారం 1123లో కాకరాజు ఈ కోటను నిరి్మంచాడు. ఈ ప్రాంతాన్ని అంతకుముందు రేనాడుగా వ్యవహరించే వారు. చాళుక్య ప్రభువు త్రైలోక మల్లుడి ప్రతినిధిగా ములికినాడు సీమ పాలకుడు కాకరాజుకు ఈ కోటతో విశేషమైన గుర్తింపు లభించింది. కల్యాణి చాళుక్యుల ఆ«దీనం నుంచి ఆ తర్వాత ఈ కోట కాకతీయుల పరమైంది. » కాకతీయ ప్రభువు గణపతిదేవ చక్రవర్తి కాయస్థ వంశీకుడు గంగయ సాహిణిని ఈ కోట పాలకుడిగా నియమించారు. అనంతరం జమ్మిగ దేవుడు, త్రిపురారి దేవుడు, అంబదేవుడు, రెండవ త్రిపురారి దేవుడు కాకతీయుల ప్రతినిధిగా కోటను పాలించారు. మొత్తంపై వంద సంవత్సరాలకు పైబడి 1304 దాక ఈ కోట కాయస్థ వంశీకుల ఆధీనంలో ఉంది. » కాయస్థ వంశీకుల తర్వాత ఈ కోట సుల్తానుల పరమైంది. కిల్జీ వంశీయులు దీన్ని పాలించారు. తర్వాత మూడు శతాబ్దాలపాటు శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయులు, సదాశివ రాయుల ప్రతినిధులు గండికోటను పాలించారు. తర్వాత కొద్దికాలం మహమ్మద్ కులీకుతుబ్‌షా ఆజ్ఞ మేరకు మీర్‌జుమ్లా ఈ కోటను పాలించాడు. » 1687లో ఔరంగజేబు గోల్కొండను జయించాక ఈ కోట మొగళుల పరమైంది. 1717 నుంచి 1779 వరకు మొగల్ సుబేదారులు, కొన్నాళ్లు కడప నవాబులు ఈ కోటను పాలించారు. 1799 వరకు గండికోట మైసూర్ సుల్తానుల పాలనలో ఉంది. హైదరాబాదు నిజాం పాలనా కాలంలో ఆంగ్లేయులు బలపడుతున్న సమయంలో నిజాం నవాబు గండికోటతోసహా బళ్లారి, అనంతపురం, కర్నూలు, కడపజిల్లాలను ఆంగ్లేయులకు దారాదత్తం చేశారు. వీటిని దత్త మండలాలు అనే వారు.కోటలో చూడదగ్గ ప్రాంతాలు » కోటలో చూడదగ్గ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కోటలో అడుగు పెట్టగానే మూడంతస్తుల కావలి మండపం కనిపిస్తుంది. ఈ మండపం పై అంతస్తులో సైనికులు కాపలాకాస్తూ బయటి నుంచి వచ్చే శత్రువులను గమనించేవారు. » గండికోటలో మరో ఆకర్షణీయ కట్టడం జామియా మసీదు. మూడు ప్రవేశ ద్వారాలతో ఇస్లామిక్ భారతీయ శిల్పకళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించిన ఈ మసీదులో ఒకేసారి 300 మంది ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. మసీదు ఎదుట వజూ ఖానా కూడా ఉంది. కోట ఎదుటగల ఎర్ర కోనేరు నుంచి దీనికి భూగర్బ గొట్టాల ద్వారా నీరు వచ్చేదని చరిత్రలో పేర్కొన్నారు. మసీదు లోపల 64, వెలుపల 32 గదులు ఉన్నాయి. బయట గుర్రాలను కట్టేసేవారని, లోపల యాత్రికులు విశ్రాంతి తీసుకునే వారని తెలుస్తోంది. » కోటలో జామియా మసీదు ప్రక్కనే ఎత్తయిన ధాన్యాగారం కనిపిస్తుంది. కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ఇందులో ధాన్యాన్ని నిల్వ చేసే వారని సమాచారం. దీనిలో పైకి వచ్చేందుకు మెట్ల సౌకర్యం కూడా ఉంది. » జామియా మసీదు ఎదుట విశాలమైన కోనేరు ఉంది. దీన్ని ఎర్ర కోనేరు అని, కత్తుల కోనేరు అని కూడా పిలుస్తారు. సైనికులు యుద్దం అనంతరం కత్తులను ఇందులో కడిగేవారని, అందుకే నీరు ఎర్రబారిందని ప్రచారంలో ఉంది. » దాన్యాగారం పక్కనే శిథిలస్థితిలో ఉన్న శ్రీ రఘునాథస్వామి ఆలయం ఉంది. అద్బుతమైన శిల్పకళకు ఆలవాలంగా నిలిచి ఉన్న ఈ ఆలయంలో ప్రాకారాలపై రేఖా చిత్రాలు అందరినీ ఆకర్షిస్తాయి. ఈ ఆలయానికి కొద్దిదూరంలోనే పెన్నా లోయ ప్రవాహం ఉంటుంది.గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా గండికోటలోని పెన్నా ప్రవాహంగల లోయకు గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని పేరు. ప్రపంచంలోని 40 ప్రసిద్ద భౌగోళిక విశేషాల్లో గండికోట ఒకటిగా పేరు గాంచింది. పెన్నా నది ఎర్రమల కొండను రెండుగా చీల్చుతూ కోట వెనుక వైపు నుంచి తూర్పు దిశగా వెళ్లి మైలవరం డ్యాంలో కలుస్తుంది. రెండు కొండల మధ్య దాదాపు 300 మీటర్లకు పైగా వెడల్పు ఉంది. అందులో నీరు పారుతూ ఉన్న దృశ్యాన్ని పైనుంచి చూడడం గొప్ప అనుభూతి ఇస్తుంది. సుప్రసిద్ద పర్యాటక ప్రాంతంగా చారిత్రకంగా దేశంలోనే రెండవ స్థానాన్ని ఆక్రమించిన పెన్నాలోయ అందం చూసి తీరాల్సిందే. ఇక్కడి చారిత్రక నిర్మాణాలు, సహజ సిద్దమైన అందాల కారణంగా పలు సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి.గండికోట లోయ సాహస కృత్యాలకు అనువుగా ఉండటంతో 2000 సంవత్సరంలో ఇక్కడ అడ్వెంచర్స్ స్పోర్ట్స్ క్లబ్‌ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్–2లో భాగంగా గండికోట అభివృద్దికి రూ.78 కోట్లు కేటాయించింది. కోట విశిష్టత... పెన్నానది ఐదు కిలోమీటర్లు కొండను గండికొట్టి ప్రవహిస్తుండడంతో దీని గట్టుపై కట్టిన కోటను గండికోట అని వ్యవహారిస్తున్నారు. కోట చుట్టూ మూడు రాతి ప్రాకారాలు ఉన్నాయి. కోట గోడలను ఒక్కొక్కటి టన్ను బరువు ఉండే ఎర్రటి శానపురాళ్లతో నిర్మించారు. పునాదులు లేకుండా కేవలం కొండ బండలపై కోటను నిర్మించడం కష్టం. కోట తూర్పు నుంచి పడమరకు 1200 మీటర్ల పొడవు, వెడల్పు 800 మీటర్లుగా ఉంది. కోట చుట్టూ 101 బరుజులు ఉన్నాయి. కోట తూర్పు ప్రధాన ప్రవేశ ద్వారం 20 అడుగుల ఎత్తు ఉంది. ద్వారం తలుపులకు సూది మొన గల ఇనుప గుబ్బలు బిగించారు. వీటిని మూసి తెరిచేందుకు ఎనుగులను ఉపయోగించే వారని తెలుస్తోంది. కోట చుట్టూ సైనికులు గస్తీ తిరిగేందుకు ఐదు మీటర్ల వెడల్పుగల బాటను నిర్మించారు. శత్రువుల రాకను గమనించేందుకు, కోట గోడలపైనుంచి ఫిరంగులు ఉపయోగించేందుకు ప్రత్యేకంగా రంద్రాలు ఉన్నాయి. పలుచోట్ల భారీ కొండరాళ్లే కోట గోడలుగా కనిపిస్తాయి. ఇంకొన్ని చోట్ల భారీ బండలపైనే కోట గోడల నిర్మాణం సాగింది. -
పర్యాటకంలో ‘పీపీపీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అపార పర్యాటక వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం పీపీపీ విధానానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా పర్యాటక సామర్థ్యం ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా సర్వే చేసింది. వీటిల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా అంతర్జాతీయ స్థాయి పర్యాటక సేవలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. తొలుత అడ్వెంచర్‌తో పాటు ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాల్లో పర్యాటక అనుభూతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రఖ్యాత హోటల్ రంగ సంస్థలు, కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నది. ‘అడ్వెంచర్’కు కేరాఫ్ గండికోట వైఎస్సార్ జిల్లాలోని గండికోట ప్రాంతాన్ని ఎకో, అడ్వెంచర్ టూరిజానికి చిరునామాగా మార్చేందుకు ఏపీటీడీసీ ప్రణాళికలు రూపొందించింది. గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోటలో ఇప్పటికే అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎర్రమల కొండలను చీలుస్తూ వేగంగా ప్రవహించే పెన్నానదిలో బోటింగ్ సౌకర్యాలను మెరుగుపర్చనుంది. వీటితో పాటు అంతర్జాతీయ హోటల్ రంగ సంస్థ ఒబెరాయ్ త్వరలో ఏడు నక్షత్రాల హోటల్ నిర్మాణాన్ని ప్రారంభించనుంది. కృష్ణానదిపై ‘రోప్ వే’ విజయవాడలోని భవానీ ద్వీపం అభివృద్ధిలో భాగంగా రోప్‌వే ప్రాజెక్టును ప్రతిపాదించింది. విజయవాడలోని బెరంపార్కు నుంచి భవానీద్విపంలోకి కృష్ణా నదిపై 1.2 కిలోమీటర్ల ఏరియల్ పాసింజర్ రోప్‌వేను నిర్మించనుంది. దీంతో రాష్ట్రంలో ఆరుచోట్ల పాటు సీప్లేన్, మరో ఫైవ్‌స్టార్‌హోటల్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తున్నది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కన్వెక్షన్ సెంటర్‌తో కూడిన హోటల్ నిర్మాణం, తిరుపతి జిల్లాలోని తుపిలిపాలెం బీచ్‌లో హోటల్ సౌకర్యంతో కూడిన బీచ్ రిసార్టు, నంద్యాల జిల్లాలో వెల్నెస్ టూరిజం, వేసైడ్ ఎమినిటీస్ కల్పనకు టెండర్లు ఆహ్వానించింది. -
గండికోటలో సీఎం జగన్.. ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన (ఫోటోలు)
-
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం గండికోట
-
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేస్తున్నారు :మంత్రి రోజా
-
జగనన్న ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు !
-
గండికోటలో పలు అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం
-
గండికోటకు మహర్దశ
-
గండికోట, పులివెందులలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
-
గండికోటకు ప్రపంచ స్థాయి పర్యాటక శోభ!
సాక్షి ప్రతినిధి, కడప: చరిత్రాత్మక నిర్మాణమైన గండికోట, స్వదేశీ దర్శన్– 2.0 కింద ఎంపిక కావడంతో ప్రపంచస్థాయి పర్యాటక శోభ దక్కనుంది. వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న గండికోటను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. అబ్బురపరిచే నిర్మాణాలు, కోట, ప్రాకారాలు, ఆలయాలు, గుర్రపుశాలలు, జైలు, ధాన్యాగారాలు, కోనేరు ఇలా ఎన్నో నిర్మాణాలను చేపట్టనున్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఉన్న గండికోటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు గండికోటలో 7 స్టార్ హోటల్ నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆ మేరకు స్థల పరిశీలన చేపట్టారు. 3 ప్రాంతాల్లో పర్యటించి తుదకు కోట సమీపంలో నిర్మించేందుకు ప్రతినిధి బృందం అంగీకారం తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటక సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గండికోట వద్ద 1110 ఎకరాలు భూమిని టూరిజం అభివృద్ధి కోసం కేటాయించింది. రూ.150 కోట్లతో వసతుల కల్పన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్వదేశీ దర్శన్ ద్వారా రూ.150 కోట్లతో గండికోటలో పర్యాటక మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇటీవల స్వదేశీ దర్శన్–2.0 పథకం క్రింద 36 పర్యాటక ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలో ప్రధానంగా అరకు, లంబసింగి సర్క్యూట్, గండికోట, హార్సిలీహిల్స్, తిరుపతి తదితర ప్రాంతాలకు చోటు కల్పించింది. ఆయా ప్రాంతాలల్లో అభివృద్ధి చేపట్టేందుకు కేంద్ర పర్యాటకశాఖ ప్రాజెక్టు డెవలప్మెంట్ కన్సల్టెంట్లను ఆహ్వానించింది. రాష్ట్ర పర్యాటకశాఖ ప్రాజెక్టు అమలు బాధ్యతలను అప్పగించి పూర్తి చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. సాంస్కృతిక, పౌర సమాజ స్థితిగతులు మెరుగుపర్చేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. 120 విల్లాల నిర్మాణానికి సన్నాహాలు ఒబెరాయ్ సంస్థ గండికోటలో రూ.250 కోట్లతో 120 విల్లాలు నిర్మించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తోన్నట్లు యంత్రాంగం వివరిస్తోంది. మరోవైపు స్వదేశీ దర్శన్ ద్వారా పర్యాటల కోసం వాచ్టవర్లు, రిసార్ట్స్, వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్లు, అడ్వెంచర్ క్రీడలు, గోల్ఫ్ కోర్టులు, యాంపీ థియేటర్లు, సాంస్కృతిక భవనాలు, సౌండ్లైట్ షోలు, అందుబాటులోకి రానున్నాయి. కళాకారులు, చేతివృత్తి కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా వారి కోసం ప్రత్యేక దుకాణ సముదాయాలను నిర్మించనున్నారు. -
Vemana: వేమనకు కొండంత వెలుగు
వేమన పద్యం ఒకటైనా రాని తెలుగువారు ఉండరు. తెలుగు జాతి ఉన్నంతకాలం వేమన పద్యాలు ప్రజల నాలుకలపై నిలిచే ఉంటాయి. తెలుగు నేలపై నడయాడిన వేమన తెలుగు సాహిత్యానికి ఒక కొండగుర్తుగా నిలుస్తారు. భాషలో, భావంలో ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన ఘనత వేమనది. సమాజంలోని అన్ని అసమానతలు పోయి మనుషులు మానవీయంగా ఎదగాలని వేమన కోరు కున్నారు. ఉన్న స్థితి నుండి సమాజం మరో అడుగు ముందుకు సాగాలని తపించారు. ఆటవెలదులనే ఈటెలతో సమాజ సంస్కరణకు పూనుకొన్నారు. ఆ తర్వాత అనేక తరాల కవులకు మార్గ దర్శకంగా నిలిచారు. దేశ విదేశాల పండితులను సైతం వేమన పద్యాలు ఆకర్షించాయి. పాశ్చాత్య భాషలలోనూ అనువాదమయ్యాయి. తెలుగు సమాజానికి వెలుగులు నింపిన వేమనకు కొండంత వెలుగును ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19న వేమన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయించింది. డిసెంబర్ 30న ఈ విషయమై జీఓ 164ను విడుదల చేసింది. కర్ణాటక ప్రాంతంలో తెలుగువారు స్వచ్ఛందంగా వేమన జయంతిని జరుపుకొనే సంప్రదాయం ఉంది. వందేళ్ళ నాడే కట్టమంచి రామలింగారెడ్డి తదితరుల ప్రోత్సాహం కూడా అందులో ఉంది. ప్రజల ఆకాంక్ష లను గుర్తించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2017 డిసెంబర్ 22న వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తాలుకా స్థాయిలో రూ. 25,000, జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో రూ.10 లక్షలు... మొత్తం అరవై తొమ్మిదిలక్షల రూపాయలు ప్రతి ఏడాదీ కేటాయిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ధార్వాడ విశ్వ విద్యాలయంలో 1980లలోనే ‘వేమన పీఠం’ ఏర్పాటు చేసిన విషయం కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లోనూ సాంస్కృతిక శాఖ వేమన జయంతిని కర్ణాటక రాష్ట్రంలో లాగా నిర్వహించాలని 2018 లోనే వేమన సంఘాలు, అభిమానులు కోరడమైంది. అప్పటి మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడమయింది. వేమన సమాధి ప్రాంతమైన కటారుపల్లి గ్రామం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉంది. స్థానికుల ఒత్తిడితో అప్పటి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష వేమన జయంతి విషయమై 10 సెప్టెంబరు 2019న అసెంబ్లీలో ప్రశ్నించారు. కనీస చర్చ కూడా జరగడానికి సభాపతి అవకాశం ఇవ్వలేదు. సాంస్కృతిక శాఖ కోట్లకు కోట్లు వేరు వేరు సాహిత్య, సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు ఆ రోజులలో చేసింది. అనేకమంది కవుల కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించింది. వేమనపై కనీసం ఒక సదస్సు నిర్వహించమని కోరినా పట్టించుకోలేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సాంస్కృతిక శాఖ పక్షాన వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని వేమన సంఘాలు కోరుతూ వచ్చాయి. 2019 నుండి ఈ ప్రక్రియ మొదలై నేడు అది సాకార మైంది. వేమన రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించబోతున్న ఈ సందర్భంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలోని కటారుపల్లి గ్రామంలోని వేమన సమాధి ప్రాంతంలో ప్రారంభ రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలి. రాష్ట్రంలోని వివిధ జోన్లలో ఒకో సంవత్సరం ఒకోచోట కార్యక్రమం ఉండేలా చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల, గ్రామ స్థాయి వరకూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 19న కార్యక్రమాలు చేయాలి. విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా వేమన పద్యపోటీలు, సదస్సులు నిర్వహించాలి. మాజీ డీజీపీ పర్యాటకశాఖ సంస్థ ఛైర్మన్ చెన్నూరు అంజనేయరెడ్డి 2003లో ప్రత్యేక శ్రద్ధతో కటారుపల్లిలో వేమన సమాధిప్రాంతం, పరిసరాలలో అభివృద్ధి కోసం 3 కోట్లు కేటాయించారు. కోటిన్నర రూపాయల దాకా ఖర్చు జరిగింది. మిగతా నిధులు పూర్తి స్థాయిలో వినియోగించలేదు. తక్షణం నిధులు కేటాయించి పూర్తి స్థాయి పనులు చేపట్టాలి. వేమన సాహిత్యంపై అధ్యయనానికీ, విస్తరణకూ ఒక ప్రత్యేక పరిశోధనా సంస్థనూ, గ్రంథాలయాన్నీ నెలకొల్పాలి. ఆధునిక తరానికి వేమన గురించి తెలిసేలా ప్రత్యేక వెబ్సైట్ నడపాలి. ప్రామాణిక వేమన పద్యప్రతిని రూపొందించడానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాలలో వేమన పద్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేమనతో ముడిపడిన కొండవీడు, గండికోట, నల్లచెరువు, పామూరు తదితర స్థలాలకు గుర్తింపు తీసుకురావాలి. జాతీయకవిగా వేమన గుర్తింపునకై కృషి జరగాలి. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..) - డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి కార్యదర్శి; వేమన ఫౌండేషన్, అనంతపురం -
పర్యాటకానికి కొత్త కళ
జమ్మలమడుగు: పర్యాటక ప్రాంతమైన గండికోట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపడుతోంది. గండికోట పరిసర ప్రాంతాలలో ఉన్న 1100 ఎకరాల రెవెన్యూ భూమిని పర్యాటకశాఖకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే స్థానిక రెవెన్యూ అధికారులు దానికి సంబంధించిన రికార్డులను పరిశీలించడంతోపాటు సర్వేలను పూర్తిచేశారు. మొత్తం 1100 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను తహసీల్దార్ కార్యాలయం నుంచి అధికారులు విజయవాడకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. మూడు నెలల్లో అందుబాటులోకి రోప్‌వే పెన్నానదిలోయ అందాలను వీక్షించడం కోసం ఏర్పాటు చేస్తున్న రోప్‌వే మరో మూడు నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. మరో రెండు మూడు వారాల్లో పూర్తిస్థాయిలో రోప్‌వే సామగ్రి రానుంది. పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి రోప్‌వేను పర్యాటకులకు అందుబాటులోనికి తీసుకుని వస్తామని అధికారులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య ప్రపంచంలో గ్రాండ్ కెన్యాన్‌గా పేరుపొందిన పెన్నా నది లోయ అందాలతోపాటు, జుమ్మామసీదు, మాధవరాయస్వామి ఆలయం తదితర ప్రాంతాలను తిలకించేందుకు ఇటీవల పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో పర్యాటకులకు కావలసిన వసతుల కల్పన కోసం స్థానికంగా హరితా హోటల్‌తోపాటు, చాలా మంది ప్రత్యేకంగా లాడ్జిలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. మరి కొంత మంది హోటల్, కూల్డ్రింక్స్షాపులను పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఉన్నత స్థాయిలో విడిది ఏర్పాటు చేయడం కోసం గతంలో ఒబెరాయ్ హోటల్ యాజమాన్యం దాదాపు 30 నుంచి 40 ఎకరాలలో హోటల్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే ప్రైవేట్ భాగస్వామ్యంతో సైతం గండికోటకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకు రావడం కోసం పర్యాటక శాఖ ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా సాహసకృత్యాలు, స్పోర్ట్స్లతోపాటు వివిధ రకాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. బోటు షికారు అనుమతుల కోసం నిరీక్షణ గండికోటకు సమీపంలోని మైలవరం జలాశయంలో పర్యాటకుల కోసం బోటు షికారును ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం గోదావరి నదిలో బోటు మునిగి చాలా మంది మరణించడంతో ఇక్కడ బోటు షికారును నిలిపివేశారు. కాగా నెలన్నర క్రితం బోటు షికారును తిరిగి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. జలాశయంలో నీరు తక్కువగా ఉండటంతో తాత్కాలికంగా బోటు షికారును నిలిపివేశారు. 1100 ఎకరాల భూమిని అప్పగించాం పర్యాటక కేంద్రమైన గండికోటను అభివృద్ధి చేసేందుకు 1100 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను ప్రభుత్వానికి అందజేశాము. ప్రభుత్వం ఆ భూమిని పర్యాటక శాఖకు అప్పగిస్తే వారు పర్యాటక అభివృద్ధికోసం వినియోగించనున్నారు. –జి.శ్రీనివాసులు,ఆర్డీఓ,జమ్మలమడుగు అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో గండికోట అభివృద్ధి గండికోట ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో పర్యాటకంగా తీర్చిదిద్దడం కోసం ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటకశాఖకు ఆదేశాలు జారీచేసి ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటకులకు అన్ని వసతులు సమకూర్చుతాం. మూడు నెలల్లో రోప్‌వే పనులు పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకుని వస్తాం. –ఈశ్వరయ్య, పర్యాటకశాఖ ఈఈ, కడప -
దోమకొండ గడికోటలో ఘనంగా ఉపాసన సోదరి పెళ్లి వేడుకలు, మెగా ఫ్యామిలీ సందడి
మెగా కోడలు ఉపాసన కొణిదెల సోదరి అనుష్పల కామినేని వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడులో భాగంగా కామినేని వారి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పోచమ్మ పండుగను నిర్వహించారు. ఈ వేడుకలకు కామినేని కుటుంబ సభ్యులతో పాటు ఇటూ మెగా ఫ్యామిలీ హజరయ్యారు. కాగా ఉపాసాన, అనుష్పలు దోమకొండ గడికోట వారసులైన కామినేని అనిల్ కుమార్ శోభనల దంపతుల సంతానం. దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో నిర్వహించిన ఈ పోచమ్మ పండుగ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆయన సతీమణి ఉపాసన కొణిదెల సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: బయటకు వచ్చిన పింకీ తొలి ఇంటర్య్వూ.. మానస్ గురించి ఏం చెప్పిందంటే కోట ప్రాంతం పూర్తిగా పెళ్లి భాజభజంత్రీలతో మార్మోగింది. గడికోట ముఖ ద్వారం నుంచి గడికోటలోని పోచమ్మ దేవాలయం వరకు బోనం ఎత్తుకొని పెళ్లి కుమార్తె అనుష్ప అందరిని ఆకర్షించింది. కుటుంబ సాంప్రదాయమైన ఇంట్లో ఏదైనా శుభకార్యానికి ముందు ఈ విధంగా పండుగను నిర్వహిస్తున్నట్లు గడికోట వారసులు తెలిపారు. ఈ పోచమ్మ పండుగ కార్యక్రమంలో రామ్‌చరణ్, ఉపాసన, మెగా ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీతో పాటు అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, అపోలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: తన ఫ్రెండ్ ట్రాన్స్‌జెండర్‌తో ఉపాసన, సోదరి పెళ్లి వేడుకలకు ఆహ్వానం -
Gandikota: ప్రకృతి సోయగాల కోట.. గండికోట
వైఎస్సార్ జిల్లా (జమ్మలమడుగు): ప్రకృతి సోయగాల కోట.. గండికోట. 11వ శతాబ్దం నాటి చారిత్రక చరిత్ర కలిగిన గండికోటలో నేడు పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. నాటి వైభవానికి ప్రతీకగా నిలిచిన నిర్మాణాలు, కోటలోపల ఎన్నో ఉన్నాయి. దానితో పాటు చారిత్రక వైభవాన్ని గురించి కళాత్మక శిలా సంపద కూడ కనువిందు చేస్తుంది. శత్రు దుర్భేధ్యమైన ఈ కోటకు మూడు వైపుల పెన్నానది లోయ, ఎత్తైన కొండలు వ్యాపించి ఉన్నాయి. శత్రువులు గండికోటకు తూర్పువైపు నుంచి నేరుగా రావల్సి ఉంది. దీంతో శత్రువులను కిలోమీటర్ల దూరం నుంచి పని పట్టేటందుకు కోట చుట్టూ ప్రహారి గోడ నిర్మాణం చేపట్టి ఫిరంగి గుండ్ల ద్వార శత్రువులపై దాడి చేసేందుకు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి నీటి విడుదల చేయడంతో పెన్నానది లోయలో నీటితో కళకళలాడుతుంది. దీంతో లోయ సుందరమైన దృశ్యం కనువిందు చేస్తుంది. సెప్టెబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో విపరీతమైన వర్షాలు పడటంతో స్థానికంగా ఉన్న వంకలు పొంగి పోర్లడంతోపాటు కొండపై నుంచి వాటర్ ఫాల్స్ పడుతుండటంతో పర్యాటకులు విపరీతంగా పెరిగిపోయారు. కరోనా కారణంగా కుదేలైన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడు ఈ ప్రాంతంలో పర్యాటకుకలతో సందడి నెలకొంటుది. అంతేకాకుండ గండికోట అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. -
గండికోట పిలుస్తోంది..
సాక్షి ప్రతినిధి, కడప: గండికోటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని శ్రీకారం చుట్టింది. భారీగా నిధులు వెచ్చించి సొబగులు అద్దనుంది. అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తర్వాత సుందరమైన ప్రాంతంగా దీనికి ప్రాచుర్యం కల్పించాలని భావిస్తోంది. వైఎస్సార్ పర్యాటక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించింది. హైదరాబాద్‌లోని వైఎస్సార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ తరహాలో గండికోటలో కూడా రూపుదిద్దాలని యోచిస్తోంది. ఇందుకోసం సుమారు రూ.100 కోట్లు వ్యయమవుందని అంచనా. దీంతోపాటు రూ.7.50 కోట్లతో ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న రోప్‌వే నిర్మాణాన్ని కూడా పూర్తి చేయనుంది. అత్యాధునిక వసతులతో రిసార్ట్ రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం ప్రభుత్వం 13 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అత్యాధునిక సౌకర్యాలతో హోటల్ నిర్మాణంతోపాటు ప్రకృతి వైద్యశాల, స్విమ్మింగ్‌ఫూల్ తదితర అన్ని వసతులతో ఈ రిసార్ట్స్ ఏర్పాటు కానుంది. సాహసం శ్వాసగా.. ఇప్పటికే సాహసకృత్యాల అకాడమీ (అడ్వంచర్స్)కి రూ.3 కోట్లతో అన్ని వసతులు సమకూర్చుతున్నారు. ఐదెకరాలలో తరగతులతోపాటు హాస్టల్ వసతి కల్పించనున్నారు. హిమాలయ పర్వతాలలో మాత్రమే ఇలాంటి అకాడమీ ఉంది. అది కూడా అక్కడ పర్వతారోహణపై శిక్షణ మాత్రమే ఇస్తారు. గండికోటలో వాయు, జల, పర్వతారోహణలపై శిక్షణ ఇవ్వనున్నారు. కోటలో ఆర్కియాలజీ విభాగం అనుమతులతో దాల్మియా కంపెనీ దెబ్బతిన్న చారిత్రక కట్టడాలను పునరుద్ధరించే పనులను చేపట్టింది. టాయిలెట్ల నిర్మాణంతోపాటు కోట పరిసరాల శుభ్రత పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రూ. 2 కోట్లతో హరిత హోటల్ నిర్మాణం చేట్టారు. మరో 15 వసతి గృహాలు (టెంట్లు) నిర్మించి ఫ్రీకౌట్ కంపెనీకి లీజుకు ఇచ్చింది. రూ.50 లక్షల ఖర్చుతో బోటింగ్ సౌకర్యం కలి్పంచారు. పచ్చదనం కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. కోట ముందు నుంచి టెంట్ల వరకు సిమెంటు రోడ్డు నిర్మించారు. రూ.30 లక్షలతో సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు పడిపోకుండా రూ.5 లక్షలతో కోట వారగా రెయిలింగ్ ఏర్పాటు చేశారు. రూ. 20 కోట్లతో జమ్మలమడుగు క్రాస్ నుంచి గండికోట వరకు డబుల్‌రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. పెట్టుబడికి అనుకూలం.. ప్రభుత్వ ప్రోత్సాహం గండికోట పరిధిలో రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. తగినంతగా నీరుంది. రోడ్డు వసతి ఉంది. 80 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్‌పోర్టు ఉంది. సమీపంలోని జమ్మలమడుగులో రైల్వేస్టేషన్ ఉంది. 35 కిలోమీటర్ల దూరంలో ప్రొద్దుటూరు పట్టణముంది. పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రాంతం. గండికోట పర్యాటకంగా అభివృద్ధి చెందితే చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చదువుకున్న యువత సరైన ప్రతిపాదనలతో ముందుకు వస్తే గండికోటలో వివిధ రకాల అభివృద్ధి పనులలో అవకాశం కల్పించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గండికోటలో పర్యాటకాభివృద్ధి గండికోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. రూ. వందల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. అమెరికాలోని గ్రాండ్ కేనియన్ తర్వాత గండికోట పర్యాటక కేంద్రంగా ఉంటోంది. అత్యాధునిక వసతులు కల్పించి జాతీయ స్థాయిలో మరింత పేరు వచ్చేలా తీర్చిదిద్దుతాం. ఆ దిశగా పనులు వేగవంతం చేశాం. ఇప్పటికే గండికోట ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నాం. –సి.హరి కిరణ్, జిల్లా కలెక్టర్ -
గండికోటలో 8 ఫిరంగి గుండ్లు
సాక్షి, జమ్మలమడుగు : పర్యాటక కేంద్రమైన గండికోటలో 8 ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. గుండ్లు ఒక్కొక్కటి 15 కేజీల నుంచి 18 కేజీలు మరికొన్ని 12 కేజీల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. గండికోటలో కొన్ని రోజుల నుంచి కోనేరు సమీపం ప్రాంతంలో ఉన్న ముళ్ల పొదలను తొలగించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నీటి తొట్టి బయటపడింది. అదే రోజు ఒక ఫిరంగి గుండు దొరికింది. శనివారం కూలీలతో పనులు చేయిస్తుండగా.. పూరాతన కాలం నాటి ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. గుండ్లు దొరికిన ప్రదేశం 400 ఏళ్ల నాటివి: గండికోటలో బయటపడ్డ ఫిరంగి గుండ్లు దాదాపు నాలుగు వందల ఏళ్ల నాటివని స్థానిక ప్రజలు, అధికారులు తెలుపుతున్నారు. గండికోట జూమ్మా మసీదు వెనుక వైపు ఆయుధ కర్మాగారంగా ఉండేది. అందులో రాజులకు సంబంధించిన కత్తులతోపాటు, నాణేల ముద్రణ కోసం టంకశాల కూడా ఉండేదని చరిత్ర చెబుతుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పహారా మహాల్ వద్ద ఫిరంగి ఉండగా మరొకటి దక్షిణ వైపులో ఉంది. ఇటీవల బయల్పడిన నీటి కుంట శత్రువులు రాకుండా అడ్డుకట్ట వేయడం కోసం అప్పట్లో రాజులు కోటకు సంబంధించిన నాలుగు వైపులా బురుజులను ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలలో ఫిరంగులను ఏర్పాటు చేస్తుండే వారు. ఆ ఫిరంగి గుండ్లను ఉక్కుతో తయారు చేసే వారు. గతంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుని భూగర్భంలో కలిసిపోయినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా జుమ్మా మసీదు వెనుక వైపు ఉన్న వ్యాయామశాల (తాళింఖానా), ఆయుధ కర్మాగారాలకు సైతం అధికారులు మరమ్మతు పనులు చేపట్టాలని పర్యాటకులు కోరుకుంటున్నారు. -
వైభవంగా ముగిసిన గండికోడ ఉత్సవాలు
-
ప్రపంచ పటంలో గండికోటకు ప్రత్యేక స్థానం
ప్రపంచ పర్యాటక పటంలో జిల్లాకు గొప్ప పేరు ప్రతిష్టలు సాధించి పెట్టిన అద్భుతమైన చారిత్రక సాక్ష్యం గండికోట. భారతదేశపు గ్రాండ్ క్యానియన్‌గా పేరుగాంచి వేలాది మంది పర్యాటకులను ఆకర్శిస్తున్న మహాదుర్గం. దక్షిణ ప్రాంతంలోని భారీ కోటలలో ఒకటిగా పేరు గాంచిన వారసత్వ కట్టడం. దాదాపు వెయ్యి సంవత్సరాల చారిత్రక వైభవాన్ని నేటికీ చాటుతున్న విశిష్ట నిర్మాణం. జిల్లాకు గర్వకారణంగా దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో పయనిస్తున్న ప్రాంతం. గండికోట వారసత్వ ఉత్సవాల పేరిట నాలుగుసార్లు వేడుకలను నిర్వహించారు. వినూత్నమైన ఉత్సాహంతో అధికారులు ఈనెల 11, 12 తేదీల్లో మరోసారి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా కోటకు సంబంధించిన వివరాలు. – కడప కల్చరల్ కోట నిర్మాణం త్రైలోక్య మల్లరాజు, కల్యాణి చాళుక్యుని ఆదేశంతో పెద్దముడియం పాలకుడిగా ఉన్న చిద్దన చోళ మహారాజు (కాకరాజ) ఈ కోట నిర్మాణానికి నడుం కట్టారు. ఆయన ఈ ప్రాంతం వాడే కావడంతో మొదట కొన్ని ప్రాంతాలను చూసినా కోట నిర్మాణానికి అనువుగా లేవని భావించాడు. తర్వాత గండికోట ప్రాంతంలో అన్వేషిస్తుండగా ఒక పొదరింటి నుంచి శ్వేత వరాహం రాజు వెంబడి ఉన్న వేట కుక్కలను తరిమి తిరిగి పొదలోకి వెళ్లిపోవడం గమనించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని కోట నిర్మాణానికి ఎంపిక చేశారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ఆదివరాహం రూపంలో సక్షాత్కరించి కోట నిర్మాణానికి అనువైన చోటును చూపాడని కాకరాజు విశ్వసించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని చదును చేయించి, వంకలు పూడిపించారు. పొలిమేర కాపు ఓబన్న ఆధ్వర్యంలో పొలిమేరలు నిర్ణయించారు.కోట నిర్మాణం ప్రారంభించారు. మొత్తంపై 1123 జనవరి 9న కోట ప్రారంభమైంది. ఈ చరిత్రను జిల్లాలో లభించిన పలు శాసనాలు «స్పష్టం చేస్తున్నాయి. కోటను నిర్మించిన చిద్దన చోళ మహారాజునే కాకరాజు అని వ్యవహరించేవారు. విశిష్టత: ఈ ప్రాంతంలో పెన్నానది ఐదు కిలోమీటర్ల పాటు కొండను గండికొట్టి ప్రవహిస్తుండడంతో దీని గట్టుపై కట్టిన కోటను గండికోట అని వ్యవహరిస్తున్నారు. కోట చుట్టూ మూడు రాతి ప్రాకారాలు ఉన్నాయి. కోట గోడలను ఒక్కొక్కటి టన్ను బరువు ఉండే ఎర్రటి శానపురాళ్లతో నిర్మించారు. పునాదులు లేకుండా కేవలం కొండ బండలపై కోటను నిర్మించడం కష్టం. కోట తూర్పు నుంచి పడమరకు 1200 మీటర్ల పొడవు, వెడల్పు 800 మీటర్లుగా ఉంది. కోట చుట్టూ 101 బరుజులు ఉన్నాయి. కోట తూర్పు ప్రధాన ప్రవేశ ద్వారం 20 అడుగుల ఎత్తు ఉంది. ద్వారం తలుపులకు సూది మొన గల ఇనుప గుబ్బలు బిగించారు. వీటిని మూసి తెరిచేందుకు ఎనుగులను ఉపయోగించే వారని తెలుస్తోంది. కోట చుట్టూ సైనికులు గస్తీ తిరిగేందుకు ఐదు మీటర్ల వెడల్పుగల బాటను నిర్మించారు. శత్రువుల రాకను గమనించేందుకు కోట గోడలపై ఫిరంగులు ఉపయోగించేందుకు ప్రత్యేకంగా రంద్రాలు ఉన్నాయి. పలుచోట్ల భారీ కొండరాళ్లే కోట గోడలుగా కనిపిస్తాయి. ఇంకొన్ని చోట్ల భారీ బండలపైనే కోట గోడల నిర్మాణం సాగింది. గండికోట రహస్యం గండికోట రహస్యం పేరుతో ఒక సినిమా రావడం తెలిసిందే. అది బాగా విజయవంతమైంది. ఈ సినిమాకు స్ఫూర్తిచ్చింది మన గండికోటలో జరిగిన సంఘటనలే. దానికి రచన సహకారం అందించిన కవి కొసరాజు రాఘవయ్య గండికోట చరిత్రను రాశారు. మీర్ జుమ్లా కుట్రలో ప్రాణాలు పోగొట్టుకున్న తిమ్మానాయుడు ప్రమాదాన్ని శంకించి బంధుమిత్రులను ఎక్కడికైనా వెళ్లిపోమ్మని సూచించాడు. రాణివాసం స్త్రీలు ఎండుమిరపకాయలను అగ్గిలో మండించి అందులో దూకి ఆత్మార్పణ చేసుకున్నారు. అప్పటికీ తిమ్మానాయుని కుమారుడు పసివాడు. చాకలి రమణక్క ఆ పసివాడ్ని రాజభవనం నుంచి తప్పించి రహస్యంగా కొన్నాళ్లపాటు పెంచింది. ఆ తర్వాత రాజబంధువులకు అప్పగించి ఆత్మార్పణ చేసుకుంది. ఆ తర్వాత పసివాడైన తిమ్మానాయుని కుమారుడు ఏమయ్యాడన్నదే రహస్యం. అదే గండికోట రహస్యంగా మారింది. విదేశీయులను సైతం గండికోట విదేశీయులను సైతం ఆకర్శించింది. ఒకప్పుడు ఇక్కడ లభించే వజ్రాల కోసం విదేశీ వ్యాపారులు ఈ ప్రాంతానికి ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు. అలా వచ్చిన విదేశీయులలో ఎంబురే, ఫ్రేజర్లు గండికోట పెన్నాలోయ అందాలకు ముగ్దులై అద్భుతమైన పెయింటింగ్‌లను గీశారు. నేటికీ పలు విదేశీ గ్రంథాలయాల్లో ఈ పెయిటింగ్‌లు ప్రత్యేక విభాగంలో ఉన్నాయి. కోటలో చూడాల్సినవి.. కోటలో అడుగు పెట్టగానే గవి ఆంజనేయుని ఆలయం కనిపిస్తుంది. ఆ తర్వాత మూడో మలుపులో వాచ్ టవర్ (ఢంకా టవర్) ఉంది. ప్రధాన ద్వారం 20 అడుగుల ఎత్తున భారీ తలుపులతో ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామంలోకి అడుగు పెట్టగానే వాచ్ టవర్ నాటి ముస్లింల నిర్మాణ చాతుర్యానికి నిదర్శనంగా నిలిచి ఉంది. దాని పక్కన ఎడమవైపుగా నాటి పద్ధతులకు నిదర్శనంగా కారాగారం విభిన్నశైలిలో కనిపిస్తోంది. ఆ తర్వాత శిథిల స్థితిలో ఉన్నా కూడా నేటికీ అద్భుతమైన శిల్పసంపద అలరారుతున్న శ్రీ మాధవరాయస్వామి ఆలయం ఉంది. కుడివైపున విశాలమైన మైదానంలో జుమ్మామసీదు అందాలు తప్పక చూడాలి. ఆ పక్కనే నాటి శైలికి ప్రతీకగా నిలిచిన ధాన్యాగారం, ఆ పక్కనే శిథిల స్థితివలో ఉన్న శ్రీ రంగనాథస్వామి ఆలయం ఉన్నాయి. కొద్దిదూరంలోనే పెన్నానది లోయ ఎంత సేపు చూసినా తనవితీరని అందాలతో విలసిల్లుతోంది. పర్యాటక కేంద్రంగా.. గండికోటకు పర్యాటక కేంద్రంగా గొప్ప పేరుంది. ఒక దశలో ప్రపంచంలో పర్యాటకంగా ప్రథమస్థానంలో ఉన్న అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ స్థాయిలో ఉందని కూడా పేరు గాంచింది. అందుకే దీన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా కూడా అంటారు.ఇలాంటి అద్భుతమైన చారిత్రక కట్టడం మరెక్కడా లేదని, దక్షిణ ప్రాంత కోటలు అనే విదేశీయులు రాసిన పుస్తకంల కూడా ఉంది. ఈ కట్టడం జిల్లాకు మణిమకుటంలా భాసిస్తోంది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ గొప్ప పర్యాటక ప్రాంతంగా పేరు గాంచింది. జిల్లాలో మరికొన్ని కోటలు ఉన్నా గండికోటదే అగ్రస్థానం. ఈ కోట పర్యాటకంగా అభివృద్ధి అయితే లేదా యునెస్కో గుర్తింపు లభిస్తే జిల్లా ఆర్థిక స్వరూపమే మారిపోయే అవకాశం ఉంది. సినీ షూటింగ్‌లు ఈ ప్రాంతాన్ని ఒకసారి చూసిన వారు మళ్లీమళ్లీ వెళ్లాలనుకుంటారు. మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల సినిమాలు కూడా తరుచూ షూటింగ్‌లు జరుపుకుంటూ ఉన్నాయి. ఎక్కువ శాతం గండికోటలో తీసిన రాజమౌళి ‘మర్యాద రామన్న’సినిమా అందరికీ తెలిసిందే. ఇవిగాక సాహసం, స్పైడర్తోపాటు పలు తమిళ, కన్నడ సినిమాలు గండికోటలో చిత్రీకరించారు. ప్రస్తుతం కూడా ఇక్కడ ఓ తెలుగు సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. గండికోట అందాలను పూర్తి స్థాయిలో దేశంలోని అన్ని భాషల సినీ నిర్మాతలు, దర్శకులకు అందజేయగలిగితే ఈ ప్రాంతంలో షూటింగ్‌ల సందడి పెరుగుతుంది. షూటింగ్‌లు జరుపుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ అనుమతులను కూడా సరళతరం చేయాల్సి ఉంది. సాహస క్రీడల కేంద్రం గండికోటలో శనివారం నుంచి వారసత్వ ఉత్సవాల్లో భాగంగా అడ్వెంచర్స్ స్పోర్ట్స్ క్లబ్‌ను ప్రారంభించనున్నారు. దీంతో సాహస క్రీడల శిక్షణ కేంద్రంగా మారనుంది. ఇలాంటి కేంద్రం దక్షిణ ప్రాంతంలో ఎక్కడా లేదు. ఉత్తర భారతదేశంలో కూడా కేవలం ఒక్కచోట మాత్రమే ఉంది. అక్కడ పర్వతారోహణకు మాత్రమే అవకాశం ఉండగా, గండికోటలో భూతల జల, వాయు, సాహస క్రీడలకు కూడా శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అన్ని అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గండికోటను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. రూ.1000 కోట్లు తొలి విడతగా మంజూరు చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్లో టెండర్లను కూడా ఆహా్వనించారు. ఆయన అకాల మరణాంతరం అభివృద్ధి మందగించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ జిల్లావారే కావడం, పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పర్యాటకుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. గండికోట లోయలో అద్దాల వంతెన నిర్మించే ఆలోచన ఉన్నట్లు తెలిసి జిల్లా వాసులు ఎంతో ఆనందిస్తున్నారు. గండికోటను చూసేందుకు పండుగలు, రెండవ శనివారం, ఆదివారం, ఇతర సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. దీంతో గండికోటలో ఉన్న హరిత హోటల్ ఏమాత్రం సరిపోవడం లేదు. దీన్ని మరింత అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా పర్యాటక చిత్రపటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించగలదు. సంరంభం.. ప్రారంభం ఉత్సవాల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ హరి కిరణ్ స్వయంగా ఏర్పాట్లను సమీక్షిస్తూ జేసీ గౌతమి, జేసీ–2 శివారెడ్డికి పర్యవేక్షణ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ప్రొద్దుటూరు, పులివెందులలో శోభాయాత్రలు తదితర కార్యక్రమాలు చేపట్టి జిల్లాకు సాహిత్య పరంగా ఉన్న విశిష్టతను గుర్తు చేశారు. విద్యార్థులకు గండికోట అంశంగా వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలను ఏర్పాటు చేసి ఉత్సవాల జోష్ పెంచారు. ప్రొద్దుటూరులో శోభాయాత్ర సంస్కృతి, సాహసం నినాదంతో ఈ ఉత్సవాలను సంస్కృతి, సాహసం నినాదంతో నిర్వహించనున్నారు. అధికారులు ఈ మేరకు గండికోటలో ఈ రెండు రోజులపాటు పలు సాహస విన్యాసాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే కోటలో అడ్వెంచర్స్ స్పోర్ట్స్ క్లబ్ భవనాన్ని సి§ద్ధం చేశారు. తొలిరోజు ఉత్సవంలో భాగంగా అధికారులు, అమాత్యులు కలిసి ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, హాట్ బెలూన్ తదితర సాహస కృత్యాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. కోటలో లోయ వద్ద రక్షణ కోసం ఇనుప బారికేడ్స్ ఏర్పాటు చేశారు. పలుచోట్ల పర్యాటకుల కోసం బెంచీలు, మండపాలను ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల వారు సేద తీరేందుకు ఫ్రకౌట్ టెంట్లను కూడా సిద్ధం చేశారు. ఈ రెండు రోజులు కూడా రాత్రి సినీ గాయకుల ఆర్ర్కెస్టా, మరికొన్ని శాస్త్రీయ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. స్థానిక కళాకారుల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలు ఈ సందర్భంగా పలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో సందర్శకులకు రెండు రకాల ఫుడ్‌కోర్టులు, ఇతర దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. రాయలసీమ పర్యాటక, సాంస్కృతిక సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా పర్యాటక పుస్తకాల ప్రదర్శన, ప్రముఖ పర్యాటక ప్రాంతాల ఛాయచిత్రాల ప్రదర్శన నిర్వహించనున్నారు. -
అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆగినట్టేనా..
సాక్షి, కడప: గండికోటలో అడ్వెంచర్స్ స్టోర్ట్సు అకాడమీ విషయంలో ముందడుగు పడలేదు. భవనం దాదాపు పూర్తయి మౌలిక సదుపాయాలు కలి్పంచే సమయానికి నిలిచిపోయింది. జాతీయ స్థాయిలో అద్బుతమైన, ఆదర్శవంతమైన అకాడమిగా తీర్చిదిద్దుతామని హామీలు గుప్పించిన టీడీపీ ప్రభుత్వం తర్వాత విస్మరించింది. అకాడమి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే జిల్లాకు దేశం చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఎక్కడో హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశీ్మర్ లాంటి ప్రాంతాలలో మాత్రమే ఒకటి, రెండు ఇలాంటి అకాడమిలు పర్వతారోహకులకు ట్రెక్కింగ్ శిక్షణ ఇస్తున్నాయి. కోటలో నేషనల్ అడ్వెంచరస్ అకాడమి పూర్తయితే ఈ ప్రాంతంలో నిత్యం పర్యాటకులు పర్వతారోహకుల సందడి ఉంటుందని జిల్లా వాసులు ఆనందించారు. వారి ఆశలు అంతలోనే ఆవిరైపోయాయి. వాస్తవానికి ఈ అకాడమి పనిచేయడం మొదలైతే ఇక్కడ పర్వతారోహణతోపాటు పెన్నానది, మైలవరం జలాశయం నీటిలో జల సాహస కృత్యాలను కూడా నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది. కోటలో విశాలమైన మైదానాలు ఉన్నాయి గనుక అక్కడ పారా గ్లైడింగ్ లాంటి ఆకాశయాన సాహస కృత్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుత కలెక్టర్ హరి కిరణ్ ఇటీవల గండికోటలో రెండు, మూడు రోజులపాటు పారా గ్లైడింగ్ను ఏర్పాటు చేశారు. మిగతా చోట ఉన్న ఒకటి, రెండు అకాడమిలలో పర్వతారోహణకు మాత్రమే అవకాశం ఉందని, గండికోటలో అకాడమి ఏర్పాటైతే మూడు రకాల సాహస కృత్యాలకు ప్రధాన వేదికగా మారే అవకాశం ఉందని ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు. అకాడమిలో ఈ క్రీడలకు సంబంధించి పలు ఉద్యోగ అవకాశాలు రావడంతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆయా సాహస కృత్యాలలో శిక్షణ పొందేందుకు ఇక్కడికి వస్తారు గనుక మన ప్రాంతంలో సాహస క్రీడాకారుల సందడి పెరుగుతుంది. జిల్లాకు ఆర్థికంగా కూడా మేలు జరిగే అవకాశం ఉంది. అకాడమి భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు కూడా సాగినట్లు సమాచారం. జిల్లాపై అభిమానం గల కొందరు అధికారులు గట్టిగా ప్రయతి్నంచి దీన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ అడ్వెంచర్స్ అకాడమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలని పర్యాటకులు కోరుతున్నారు. దేశ వ్యాప్త గుర్తింపు గండికోటలో నిర్మాణం ప్రారంభమైన నేషనల్ అడ్వెంచర్స్ అకాడమి ద్వారా జిల్లాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. పర్వత, జల, వాయువు మూడు రకాల అడ్వెంచర్లకు అవకాశం గండికోటలో మాత్రమే ఉంటుంది. కనుక ఈ అకాడమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే చేపడితే బాగుంటుంది. – కేవీ రమణారెడ్డి, రాయలసీమ పర్యాటక సంస్థ సీనియర్ సభ్యులు జిల్లాకు ప్రతిష్ఠ సాహస కృత్యాల అకాడమిలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. మన ప్రాంతాలలో బొత్తిగా లేవు. గండికోటలో ఈ అకాడమి నిర్మాణం పూర్తి చేయగలిగితే జిల్లా ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం పర్యాటక రంగానికి పట్టం కట్టే దిశగా సాగతోంది గనుక ఈ అకాడమి నిర్వహణ ప్రభుత్వమే చేపడుతుందని భావిస్తున్నా! – పి.సంతోష్‌కుమార్, ఫ్యాకలీ్ట, వైవీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం -
జిల్లాలో పర్యాటక వెలుగులు
సాక్షి, కడప : జిల్లా పర్యాటకానికి కొత్త ఊపు రానుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఖ్యాతి గల గండికోటలో రెండు కొండల మధ్య అద్దాల వంతెన ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడంతో జిల్లా పర్యాటకుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఊహించని రీతిగా సోమశిల ప్రాజెక్టును జల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయం కూడా జిల్లా పర్యాటక అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఇంతకుముందే ఇడుపులపాయను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించి ఉండడంతో జిల్లా నలుమూలల ఇక పర్యాటక వెలుగులు కనిపించనున్నాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం రాష్ట్ర పర్యాటకాభివృద్దిపై తీసుకున్న నిర్ణయాలలో మన జిల్లాకు సంబంధించి పర్యాటకం అభివృద్ది పథంలో పరుగులు తీయనున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. అలాగే జిల్లా పర్యాటకాభిమానులు, సంస్థల్లో కొత్త సంతోషం కనిపిస్తోంది. నలు వైపులా.. ఇంతకుముందే ఒంటిమిట్టకు ప్రభుత్వ లాంఛనాలు దక్కడంతో తూర్పు పర్యాటక ప్రాంతం ఇప్పుడు ఇడుపులపాయ అభివృద్ధితో దక్షిణ‡ప్రాంత పర్యాటకం, సోమశిలతో ఉత్తర పర్యాటకం, గండికోటతో పడమర పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశాలు పెరిగాయి. తిరుపతి నుంచి రైల్వేకోడూరు ఉద్యాన పరిశోధన కేంద్రం, రాజంపేటలో కన్నప్ప ఆలయం, అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక, నందలూరు సౌమ్యనాథ ఆలయం, బౌద్దారామాలు, ఒంటిమిట్ట వరకు తూర్పు పర్యాటక సర్క్యూట్‌గా ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉన్నాయి. గండికోటలో అద్దాల వంతెన పథకం విజయవంతమైతే పడమర పర్యాటక ప్రాంతాలు కూడా సహజంగా అభివృద్ది చెందగలవు. ఇడుపులపాయతో దక్షిణ పర్యాటక ప్రాంతా లు రాయచోటి, రాక్ గార్డెన్స్, వెలిగల్లు ప్రాజెక్టు, వేంపల్లె గండిక్షేత్రంలకు పర్యాటక కళ రానుంది. సోమశిల అభివృద్ధితో గోపవరం, మొల్లమాంబ జన్మస్థలి, బ్రహ్మంగారిమఠం, బద్వేలు లక్ష్మిపాలెం ఆలయం, వనిపెంట ప్రాంతాలు ఉత్తర విభాగంగా అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న పర్యాటకాభివృద్ది నిర్ణయాలతో జిల్లా నాలుగు వైపుల నాలుగు ప్రత్యేకమైన పర్యాటక సర్క్యూట్లు ఏర్పడినట్లయింది. ఇవి అభివృద్ది చెందడం ప్రారంభమైతే జిల్లా అంతటా పర్యాటకుల సందడి నెలకొంటుంది. దీని ద్వారా జిల్లాకు ఆర్థిక ఆదాయం కూడా లభించనుంది. పెరగనున్న ప్రతిష్ఠ గండికోటకు అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రదేశంగా ఇండియన్ గ్రాండ్ క్యానియన్‌గా పేరుంది. ఇప్పటికే నాలుగుమార్లు వారసత్వ ఉత్సవాలు నిర్వహించడంతో ఈ ప్రదేశానికి వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెండేళ్లుగా వారాంతాలలో హరిత పర్యాటక హోటల్లో గదులు లభించని పరిస్థితి ఉంది. ఇప్పుడు గండికోట పెన్నా ప్రవాహంపై అద్దాల వంతెన ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని ప్రకటించగానే జిల్లా పర్యాటక అభిమానులు, అభివృద్ధి సంఘాలు, పర్యాటక అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు జిల్లా పర్యాటకానికి పట్టాభిషేకం చేయనున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్దికి నిధుల కొరత ఉన్న విషయాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చినా ఈ విషయంగా ముందడుగు వేయాలని ఆయన సూచించడం పర్యాటక రంగ అభివృద్దికి ఆయన కృత నిశ్చయంతో ఉన్నారని స్పష్టమవుతోంది. -
గండికోటకు ‘వారసత్వ హోదా’ వచ్చేనా?
సాక్షి, కడప : భారతదేశపు గ్రాండ్ క్యానియన్‌గా పేరుగాంచి దేశానికి తలమానికంగా నిలిచిన గండికోటకు వారసత్వ హోదా వచ్చే అవకాశంపై పర్యాటకాభిమానుల్లో తిరిగి ఆశలు మొలకెత్తుతున్నాయి. 2012 నుంచి గండికోటకు వారసత్వ హోదా కోసం జిల్లాలోని పర్యాటకాభిమానులేగాక ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఎన్నో రకాలుగా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం, సంబంధిత మంత్రులు, అధికారులను గట్టిగా ఈ విషయంపై అడిగారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే గండికోట వారసత్వ ఉత్సవాల్లో భాగంగా రెండు సంవత్సరాలుగా సాక్షాత్తు జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి స్వయంగా నెలరోజుల్లో వారసత్వ హోదా వస్తుందని నమ్మబలికా రు. గత సంవత్సరం కూడా అదే హామీ ఇచ్చారు. కానీ హోదాకు సంబంధించి ఇంతవరకు జిల్లా నుంచి కనీస అభ్యర్థనలు వెళ్లలేదని తెలుసుకున్న పర్యాటకాభిమానులు ఆవేదనకు గురయ్యారు. వారసత్వహోదా వస్తే.... గండికోటకు వారసత్వ హోదా వస్తే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. సంవత్సరానికి రూ. 100 కోట్లు కోట అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన, ఇతర పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన చరిత్ర పరిశోధకులు, అధ్యయనం కోసం ఈ కోటను ప్రతి సంవత్సరం రెండు, మూడు నెలలపాటు పరిశీలిస్తారు. వారితోపాటు ఆయా దేశాలకు చెందిన పర్యాటకులు కూడా వచ్చే అవకాశం ఉంది. 2012లో గండికోటలో చారిత్రక సంపద అభివృద్ధిలో భాగంగా గండికోటలో వారసత్వ ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా పర్యాటకాభిమానులు కోరారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి 2015 నుంచి ఉత్సవాలను నిర్వహించింది. అప్పటి నుంచి 2019 ఫిబ్రవరి వరకు జరిపారు. ప్రతి సంవత్సరం నిధుల కొరత ఉందని ఉత్సవాలను నిలిపివేసే ప్రయత్నం చేస్తుండడం జిల్లాకు చెందిన పర్యాటకాభిమానులు, పర్యాటక సంస్థల ప్రతినిధులు గట్టిగా పట్టుబట్టడంతో అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ఇవ్వగా.. వేరే శాఖల నుంచి కొద్దిమొత్తాన్ని ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చయ్యాయని ప్రచారం చేశారు. కానీ ఆ స్థాయి కార్యక్రమాలు జరగకపోవడం గమనార్హం. దీనికి అంతర్జాతీయ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభిస్తే పుష్కలంగా నిధులు వచ్చి అనుకున్న విధంగా కోటను అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుంది. గత ప్రభుత్వాలు అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేశారేగానీ ఈ విషయంపై అభ్యర్థన పంపింది లేదు. ప్రస్తుతం పర్యాటకానికి ప్రత్యేకంగా మంత్రిని నియమించడం, ఆయన కూడా ఈ రంగం అభివృద్ధి పట్ల ఆసక్తి కనబరుస్తుండడంతో జిల్లా వాసుల్లో గండికోటకు యునెస్కో గుర్తింపు లభించగలదని ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి గండికోటను సందర్శించాలని కోరుతున్నారు. -
గండికోట రహస్యం
గండికోటలో నాకొక చిత్రమైన అనుభవం. 7వ తరగతి చదువుకుంటున్న రోజులు. గండికోట చూడాలని మావూరి నుంచి బయలుదేరినాం. అప్పుట్లో మావూరు నుంచి గండికోటకు పోవాలంటే ఏట్లో(చిత్రావతి నది) నడిచిపోవాల. లేదంటే జమ్మలమడుగుకు బస్సులో వెళ్లి అక్కడి నుంచయినా నడిచిపోవాల.∙మా ఫ్యామిలీ, నా ఫ్రెండ్ ప్రభాకర్ ఫ్యామిలీ చిత్రావతిలో నడిచి వెళ్లాలని బయలుదేరినాం. రెండు కిలోమీటర్ల మేర రోడ్డు పై ప్రయాణం. ఆ తర్వాత ఏటి ఇసుకలో కాలినడక. కాళ్లు ఈడ్చుకుంటూ...గవ్వలు ఏరుకుంటూ.. రెండు కొండల నడుమ(గాడ్జెస్) పాయలు పాయలుగా పారుతున్న నీటిలో నడుస్తూ ... క్లిష్టర్ క్లియర్‌గా నీటిలో అటుఇటూ బుల్లి చేపలను చేత్తో పట్టుకునేందుకు తంటాలు పడుతూలేస్తూ.. పట్టుకున్నవి మళ్లీ వదులుతూ.. మధ్యాహ్నమయింది. అలిసిపోయామేమో ఒకటే ఆకలి. పైన కరకరమంటున్న ఎండ. ‘‘ఇంగసాలు రాండ్రా బువ్వ తిందురుగాని’’ అని చిన్నక్క(ప్రభాకర్ వాళ్లమ్మను అలాగే పిలుస్తాం) పిలిచాకగాని ఈలోకంలోకి రాలేదు. ఏటి మధ్యలో వెండి, బంగారు కలబోసిన ఇసుక తళుకులు... పైన నీలాకాశం పందిరి కింద(ఇప్పుడు గండికోట ఆనకట్ట కట్టినారే అక్కడ అనుకోండి) వాహ్.. భోజనాలు. ఏమాటకామాట చెప్పుకోవాలి. ఆరోజులు మళ్లీ రావనే అనుకుంటున్నా.సరే, గండికోటకు చేరుకున్నాక చూడాలీ మా ఆనందం.. ఏకబిగిన కోటంతా తిరిగాం. రాజులు, నవాబుల యుద్ధాలు.. ఆ గాల్లో ఏదో గమ్మత్తు. గుర్రపుశాల దగ్గర లోపలికి తొంగిచూస్తే.. వాసన ఎప్పుడూ చూడంది. మసీదు,కోనేర్లు.. పెద్ద బండరాళ్లు మైమరచి పోయాం. అలానడుచుకుంటూ ఎటో వెళ్లిపోయాం. కోటంతా కలియదిరిగి చూసినవన్నీ రేపు బళ్లో గొప్పగా చెప్పుకోవాలనే ఉత్సాహంతో నేనూ ప్రభాకర్గాడు పరిసరాలు మరిచిపోయి నడుస్తూ ఎప్పుడో మావాళ్లని వదిలేసి దూరంగా వచ్చేశాం. వెనక్కి చూస్తే దూరంగా మేమిద్దరమే! అటుఇటు ఎత్తయిన కొండలు.. పెద్ద బండరాళ్లు. చెట్లు, పొదలు, నీటి దొనెలు. కోట ముఖద్వారం అనుకుంటా ఎత్తుగా దూరంగా గోపురం. విఠలాచార్య సినిమాలో దారి తప్పిన కమెడియన్లా అయిపోయింది మా పరిస్థితి. ఏమి చేయాలో అర్థం కాక దాదాపు ఏడ్చేసినంత పని. అయితే కోట ముఖ ద్వారం వద్ద గోపురం కనిపిస్తోందంటే కోట పరిసరాల్లోనే ఉన్నామనే కదా? «దైర్యం చెప్పుకుని గోపురాన్ని చూస్తూ సూటిగా నడిచాం. సాయంత్రం అయింది. గుంపు దొరికింది.ఎక్కడనుకుంటున్నారు? కోనేటి దగ్గర. సైనికులు యుద్ధంలో కత్తులకు అంటిన నెత్తురును కడిగిన కోనేరంట! అదెంత నిజమా తెలీదు కానీ కోనేరు చుట్టూ మావాళ్లు, గండికోట వాసులు. వాళ్ల చూపంతా కోనేటిలో నీటి వైపే ఉంది. అక్కడి పరిస్థితి చూస్తే ఏదో జరగరానిది జరిగిందనిపించింది. గుంపు వెనకాల నిలబడి నక్కినక్కి చూస్తున్నాం. మా అమ్మ, ప్రభాకర్ వాళ్లమ్మ ఒకటే ఏడుపు. ఏదో కీడు శంకించింది. ఏం జరిగి ఉంటుందో అర్థంగాక మాకూ ఏడుపొచ్చేలా ఉంది. ఉన్నట్టుండి.. చుట్టూ చేరిన వాళ్లు అట్నుంచి ఇట్నుంచి కోనేరులో నీళ్లను చూపిస్తూ అదిగో కాలు, అదిగో చేయి.. అదిగో నిక్కరు..చొక్కా.. ఎవరికి తోచినట్లు వాళ్లు చెపుతున్నారు. వాళ్లు చెప్పేకొద్దీ మావాళ్ల ఏడుపు మరింత ఎక్కువైంది. వాళ్లు ఎందుకేడుస్తున్నారో అర్థంకాలేదు. అక్క ఎక్కడున్నారోనని వెతికితే ఓ పక్క నిలబడి నీళ్లలోకి చూస్తూ ఏడుస్తోంది. మెల్లిగా వెనక నుంచి మా అక్క దగ్గరికి వెళ్లి.. తనకు మాత్రమే వినబడేట్లు.. ఆపా.. అని పిలిచా. గిరక్కున వెనక్కి తిరిగి చూసిన మా అక్క.. మా నజీర్ ఆగయా.. అని పిలవడం. మా అక్కకేసి చూడటం ఒకేసారి జరిగిపోయింది. ఒక్కసారిగా అంతానిశ్శబ్దం అంతలోనే కోనేటికి అటువైపున్న మా అమ్మ పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి నన్ను దగ్గరికి తీసుకోవడం కూడా అంతేవేగంగా జరిగిపోయింది. ‘‘ఎక్కడికి పోతివిరా గాడిదా!’’ అని అంత ఏడుపులోనే నాలుగు అంటించింది. అక్కడ ప్రభాకర్ వాళ్ల ఫ్యామిలీ పరిస్థితీ అంతే. మమ్మల్ని తలోమాట అన్నారు. వాళ్ల మాటల్ని బట్టి మాకర్థమయిందేమిటంటే మేం కోనేరులో మునిగిపోయాం. మా శరీరాలు నీటి లోపల కనిపిస్తున్నాయి. మా బడాయి కొద్దీ గుంపును వదిలి మేందూరం పోతింగదా. ఎంత వెదికినా కనబడకపోయేసరికి కోనేరు చూడను పోయి అందులో పడిపోయినామనుకుని భయపడిపోయారు. దీనికి తోడు నీటి లోపల కనిపించీ కనిపించని నాచు, ఆకాశంలోని మేఘాల నీడ ఒక రకమైన భ్రమకు లోనుచేశాయి. వాటిని చూసి కోనేట్లో ఉండేది మా శవాలనుకుని అడుగో అంటే ఇడుగో అని.. మరింత భయపెట్టారు. దాంతో నిజంగానే మా పని అయిపోయిందనుకుని అందరూ ఏడుపు లంకించుకున్నారు. మా గండికోట పర్యటన ఆవిధంగా కొంచెం తీపి–కొంచెం చేదు టైపులో ముగిసింది. ఈ సంఘటన తలుచుకున్నప్పుడల్లా ఇప్పటికీ మా ఇంట్లో నవ్వుల పువ్వులే. నాకు తిట్లే! – నజీర్, హైదరాబాద్ -
గండికోట ప్ర‘గతి’ ఇంతేనా..!
జమ్మలమడుగు : గండికోట అభివృద్ధికి నోచుకోవడం లేదు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గండికోట.. అందాలతోపాటు అపురూపమైన శిల్పసంపదకు నిలయంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గండికోట అభివృద్ధికి కృషి చేశారు. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గండికోట, బెలూంగుహలను కలిపి ప్రత్యేక పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని కడపకు వచ్చిన ప్రతి సారి హామీలు ఇచ్చారే కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. గండికోటలో ఇటీవల తమిళ, కన్నడ, తెలుగు సినీ పరిశ్రమలకు చెందిన వారు సినిమా షూటింగ్‌లు చేస్తున్నారు. అయినా మన ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి చేయడం లేదు. 2015 నవంబర్ 10న ముఖ్యమంత్రి చంద్రబాబు గండికోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని, విదేశాల నుంచి పర్యాటకులు భారతదేశానికి వస్తే వారు కచ్చితంగా జమ్మలమడుగులోని గండికోట ప్రాంతాన్ని చూసే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అలాగే అమెరికాలోని గ్రాండ్ కెనాల్‌పై నిర్మించిన స్కైవాక్‌ను.. ఇక్కడి లోయ వద్ద ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. రెండున్నరేళ్లు దాటినా ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రెండు సార్లు గండికోట ఉత్సవాలను నిర్వహించినా అభివృద్ధి జరగలేదు. బోర్డులకే పరిమితమైన బోటింగ్ మైలవరం జలాశయం నుంచి బోటింగ్ ఏర్పాటు చేస్తామని బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ బోటింగ్ లేకపోవడంతో అసంతృప్తితో తిరిగి వెళుతున్నారు. ఇక్కడ బోటింగ్ బోర్డులకే పరిమితమైంది. దీంతో పలువురు గండికోటలో ఉన్న పురాతన ఆలయాలతోపాటు జుమ్మామసీదు, పెన్నానది అందమైన లోయను చూసి వెళ్తున్నారు. రహదారులు కూడా లేవు గండికోటకు వచ్చే పర్యాటకులకు వివిధ ప్రాంతాలలో ఉన్న వాటిని చూడటం కోసం సరైన రహదారులు కూడా లేవు. జుమ్మా మసీదు నుంచి పెన్నానది లోయ వద్దకు వెళ్లేందుకు పెద్ద రాళ్లు ఎక్కి దిగి వెళ్లాల్సి వస్తోంది. సరైన రహదారిని కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో చాలా మంది వృద్ధులు నడవలేక అవస్థలు పడుతున్నారు. సౌకర్యాలు లేవు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు సరైన సౌకర్యాలు లేవు. ఇక్కడ బోటింగ్ ఉందని బోర్డుల పైన ఉంది. తీరా ఇక్కడ చూస్తే ఎటువంటి బోటింగ్ లేదు. హైదరాబాద్ నుంచి వచ్చాను. లోయ అందాలు చాలా బాగున్నాయి. భద్రత ఎక్కడా లేదు.– ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్. -
దాల్మియాకు ఎర్రకోట
న్యూఢిల్లీ: ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట నిర్వహణ బాధ్యతలను దాల్మియా భారత్ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడాప్ట్ ఎ హెరిటేజ్ (ఓ చారిత్రక కట్టడాన్ని దత్తత తీసుకోండి) పథకంలో భాగంగా ఎర్రకోట, వైఎస్సార్ కడప జిల్లా ‘గండికోట’ కోట నిర్వహణ బాధ్యతలను నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖలతో దాల్మియా భారత్ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద కాలం ఐదేళ్లు. ఎర్రకోట కోసం తీవ్రమైన పోటీ నెలకొనగా.. ఇండిగో, జీఎంఆర్ గ్రూపులను వెనక్కు నెట్టి రూ. 25కోట్లకు (ఈ మొత్తాన్ని ఎర్రకోట నిర్వహణకు వెచ్చించాలి) దాల్మియా ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. ‘ ఎర్రకోట నిర్వహణ బాధ్యతలు పొందటం ఆనందంగా ఉంది. 30 రోజుల్లో మేం పనిని ప్రారంభించాలి. భారత్‌తో దాల్మియా బ్రాండ్‌ను పెంచుకునేందుకు ఈ అవకాశం దోహదపడుతుంది. ఎర్రకోట వైశాల్యంతో పోలిస్తే చాలా చిన్నగా ఉండే యూరప్‌లోని కొన్ని కట్టడాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఆ పద్ధతిలోనే మేం ఎర్రకోటను ప్రపంచ ఉత్తమ కట్టడాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం’ అని దాల్మియా భారత్ సిమెంట్స్ గ్రూప్ సీఈవో మహేంద్ర సింఘీ తెలిపారు. చారిత్రక కట్టడాల నిర్వహణలో ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యాన్ని తీసుకువచ్చేందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ ఎ హెరిటేజ్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 70 ఏళ్లు ఏం చేశారు?: కేంద్రం ఈ పథకంలో భాగస్వాములైన కంపెనీలు కేవలం డబ్బులు ఖర్చుపెట్టి సదుపాయాలను మెరుగుపరుస్తాయే తప్ప.. పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయబోవని కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ స్పష్టం చేశారు. కట్టడాలను ప్రైవేటీకరించే ఆలోచన అర్థరహితమని పర్యాటక మంత్రి కేజే అల్ఫోన్స్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ 70 ఏళ్లుగా ఏం చేసింది? అన్ని కట్టడాలు, వాటిలోని వసతులు చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు వసతులే లేవు. అలాంటిది ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. కట్టడాల నిర్వహణ కాంట్రాక్టుల జాబితాలో కుతుబ్ మినార్ (ఢిల్లీ), హంపి (కర్ణాటక), సూర్య దేవాలయం (ఒడిశా), అజంతా గుహలు (మహారాష్ట్ర), చార్మినార్ (తెలంగాణ), కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం) వంటి 95 ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్నాయి. కాంగ్రెస్ మండిపాటు ప్రముఖ కట్టడం నిర్వహణను ఓ ప్రైవేటు కంపెనీకి ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్, తృణమూల్, వామపక్ష పార్టీలు ప్రశ్నించాయి. భారత స్వాతంత్య్ర ప్రతీకైన ఎర్రకోట బాధ్యతలను ఇతరులకు ఎలా అప్పగిస్తారని మండిపడ్డాయి. ‘ప్రైవేటు సంస్థకు చారిత్రక కట్టడాన్ని నిర్వహించే బాధ్యతను ఎలా అప్పజెబుతారు? ఇది మీరు (ప్రభుత్వం) చేయలేరా? భారత చరిత్ర పరిరక్షణపై ప్రభుత్వ విధానమేంటి? నిధుల కొరత ఉందా? భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్ఐ)కి కేటాయించిన నిధులు మురిగిపోతున్నాయి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. -
ఘనంగా గండికోట వారసత్వ ఉత్సవాలు