వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా
కడప : వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గొర్రెల గుంపుపై చిరుత దాడి చేయటంతో ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.