కవి సమ్మేళనానికై కవితల ఆహ్వానం | Poems Invitation in KaviSammelanam | Sakshi
Sakshi News home page

కవి సమ్మేళనానికై కవితల ఆహ్వానం

Published Sun, Sep 25 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

Poems Invitation in KaviSammelanam

కడప కల్చరల్‌ : అక్టోబరులో జరగనున్న గండికోట వారసత్వ ఉత్సవాలలో నిర్వహించనున్న కవి సమ్మేళనం కోసం జిల్లాకు చెందిన కవులు, రచయితల నుంచి కవితలను ఆహ్వానిస్తున్నామని సాంస్కృతిక కమిటీ సభ్యులు, ఇంటాక్‌ జిల్లా కన్వీనర్‌ ఎస్‌.ఎలియాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాలలో భాగంగా ప్రధాన వేదికపై ఏర్పాటు చేయనున్న కవి సమ్మేళనానికి రెండు లేదా మూడు నిమిషాలకు మించని కవితలను పంపాలని కోరారు. వచ్చిన వాటిలో ప్రత్యేక జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన కవితలను మాత్రమే ఉత్సవాలలో చదివేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు. గండికోట వైభవం తెలిపేలా కవితలు పంపాలని, వివరాలకు 98858 01061 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement