gadikota
-
ఉపాసన ఎమోషనల్ పోస్ట్.. సమంత రియాక్షన్
Upasana Konidela Shares Emotional Post On Her Wedding Photo: మెగా కోడలు ఉపాసన కొణిదెల సోదరి అనుష్పల కామినేని వివాహ వేడుకలు దోమకొండ గడికోటలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా కామినేని వారి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పోచమ్మ పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ కుటుంబం కూడా హాజరైంది. ఈ సెలబ్రేషన్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన సందడి చేసిన ఫొటోలు, వీడియోలను ఉపాసన ఇప్పటికే షేర్ చేసింది. అయితే తాజాగా ఉపాసన తన సోదరి పెళ్లి వేడుకలలో తన వివాహ విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోచమ్మ గుడికి వెళ్లినప్పుడు ధరించిన దుస్తుల గురించి చెప్పుకొచ్చారు. తొమ్మిదేళ్ల క్రితం తన పెళ్లి వేడుకల్లో భాగంగా పోచమ్మ పండుగ సెలబ్రేషన్స్‌లో వేసుకున్న దుస్తులను రీక్రియేట్ చేసి ఇప్పుడు తన సోదరి వివాహ వేడుక సందర్భంగా వేసుకున్నట్లుగా ఉపాసన పేర్కొన్నారు. ఉపాసన తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లో 'దుస్తులను వేసుకోవడం, వాటిని జాగ్రత్తగా భద్రపరచడం నాకు ఎంతో ఇష్టం. అంది నాకు గర్వంగా ఉంటుంది. నాణ్యత ఉన్న వస్త్రాలను షాపింగ్ చేయడం నాకు ఇష్టం. దుస్తులతో వెలకట్టలేని ఎమోషన్స్ ఉంటాయి. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత దోమకొండలో నా పెళ్లికి సంబంధించిన పోచమ్మ పండుగ సెలబ్రేషన్స్ దుస్తులను రీక్రియేట్ చేసినందుకు అనామిక ఖన్నాకు థ్యాంక్స్' అని తెలిపారు. అలాగే ప్రస్తుత ఫొటోలతోపాటు తన వివాహ ఫొటోలను షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌కు పలువురు స్పందించగా, స్టార్ హీరోయిన్ సమంత 'బ్యూటిఫుల్' అంటూ రియాక్షన్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) ఇదీ చదవండి: అనుష్పల పెళ్లి వేడుకలో పోచమ్మ పండుగ, రామ్‌చరణ్, ఉపాసన సందడి -
గడికోట టీడీపీ ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీలో చేరిక
కడప కార్పొరేషన్: జిల్లాలోని వీరబల్లి మండలం గడికోటకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సీ. మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఇక్కడి ఓ ప్రైవేటు అతిథిగృహంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చక తాను వైఎస్ఆర్సీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో ఎవరి బలవంతమూ లేదన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డిపై ఉన్న అభిమానంతోనే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాయచోటి మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి, రామాపురం మాజీ జెడ్పీటీసీ నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గడికోటలో ఎమ్మెల్యే పూజలు
పెద్దశంకరంపేట: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పేట గడికోటలో అమ్మవారికి గురువారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి హారతి ఇచ్చారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. గడికోట అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పురాతన కోటను ఎక్కి పేట అందాలను తిలకించారు. పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రాయిని సంగమేశ్వర్, సర్పంచ్ జంగం శ్రీనివాస్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు విజయరామరాజు, కల్హేర్ మాజీ ఎంపీపీ మల్లేషం, నాయకులు లక్ష్మణ్, పున్నయ్య, నారాయణ, దాదిగారి రాధాక్రిష్ణ, అమర్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
షష్టిపూర్తి వేడుకలకు హాజరైన చిరంజీవి
దోమకొండ : నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ గడీకోటలో శనివారం తన వియ్యంకుడు, అపోలో ఆస్పత్రుల డైరెక్టర్ అయిన కామినేని అనిల్‌కుమార్ షష్టిపూర్తి కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రాంచరణ్‌తేజ, ఆయన సతీమణి ఉపాసనలు హాజరయ్యారు. గడీకోటలోని మహదేవుని ఆలయంలో ఉదయం నుంచి షష్టిపూర్తి కార్యక్రమం సందర్భంగా పూజలు నిర్వహించారు. అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, రిటైర్డు ఐఏఏస్ అధికారి కామినేని ఉమాపతిరావ్, తదితరులు అనిల్‌కుమార్ దంపతులను∙దీవించారు. రాత్రి చిరంజీవి డిన్నర్‌కు హాజరై తిరిగి వెళ్లిపోయారు. రాంచరణ్ మాత్రం ఆయన సతీమణితో కలిసి ఇక్కడే ఉన్నారని గడీకోట ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.