ఆయుధ పూజ ఆరంభం | NTR dual act with this astonishing scene | Sakshi
Sakshi News home page

ఆయుధ పూజ ఆరంభం

Published Tue, Aug 13 2024 4:16 AM | Last Updated on Tue, Aug 13 2024 4:16 AM

NTR dual act with this astonishing scene

హీరో ఎన్టీఆర్‌ ఆయుధ పూజ చేస్తున్నారు. అయితే ఈ పూజ ‘దేవర’ కోసం. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె  నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరు«ధ్‌ సంగీతదర్శకుడు. కాగా ఈ సినిమాలో ఆయుధ పూజ నేపథ్యంలో సాగే ఓ పాట ఉందట. 

ప్రస్తుతం ఈ పాటని తెరకెక్కిస్తున్నారని సమాచారం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని ఎన్టీఆర్, ఇతర తారాగణంపై రాత్రి వేళల్లో చిత్రీకరిస్తున్నారని టాక్‌. పతాక సన్నివేశాలకు ముందు ఈ పాట వస్తుందట. రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ తొలి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement