ఏపీలో 'దేవర' అదనపు షోలకు అనుమతి.. టికెట్‌ ధరలు ఇలా | AP GOVT Release GO For Devara Benefit Shows And Tickets Hike | Sakshi
Sakshi News home page

ఏపీలో 'దేవర' అదనపు షోలకు అనుమతి.. టికెట్‌ ధరలు ఇలా

Published Sat, Sep 21 2024 1:20 PM | Last Updated on Mon, Sep 23 2024 8:00 PM

AP GOVT Release GO For Devara Benefit Shows And Tickets Hike

జనతా గ్యారేజ్‌ హిట్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'దేవర'. సెప్టెంబర్‌ 27న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి   ప్రకటన వచ్చింది. దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో  మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పకులు. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. డేట్ ఫిక్స్)

దేవర సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కడంతో భారీ బడ్జెట్‌ ఖర్చు చేశారు. దీంతో సినిమా టికెట్‌ ధరలతో పాటు స్పెషల్‌ షోల విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని చిత్ర యూనిట్‌ కొద్దిరోజుల క్రితం సంప్రదించింది. దీంతో తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి టికెట్‌ ధరకు అధనంగా ఎంతమేరకు పెంచుకునే వెసులుబాటు ఉందో చెబుతూ ఒక జీవోను రిలీజ్‌ చేసింది.

టికెట్ల రేట్లు ఇలా..
'దేవర' విడుదల రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు ఏపీ అనుమతిచ్చింది. ఆ తర్వాత రోజు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇలా 9రోజుల వరకు అదనపు షోలు  ఉండనున్నాయి. ఇదే క్రమంలో దేవర టికెట్ల ధరలను సైతం పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌ మొదటి తరగతి టికెట్స్‌కు రూ. 110, దిగువ తరగతి రూ.60 వరకు పెంచింది. మల్టీప్లెక్స్‌లలో అయితే రూ. 135 చొప్పున పెంచింది. జీఎస్టీతో కలుపుకొనే ఈ ధరలు ఉండనున్నాయి. అంటే ఈ లెక్కన సింగిల్‌ స్క్రీన్‌లో దేవర టికెట్ ధర రూ. 225 ఉంటే మల్టీప్లెక్స్‌లలో మాత్రం రూ.320 ఉండనుంది. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్‌ 27 నుంచి 14 రోజుల పాటు ఉండనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement