
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ నుంచి 19న ‘ఫియర్’ అనే తొలి సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘జనతా గ్యారేజ్ ’(2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు.
నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ‘దేవర’ నుంచి ‘ఫియర్..’ అంటూ సాగే పాట ఈ నెల 19న విడుదల కానుంది. ఈ పాటలో ‘దేవర ముంగిట నువ్వెంత..’ అనే పదాలు ఉన్నట్లు సమాచారం. రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. సైఫ్ అలీఖాన్, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు.
Comments
Please login to add a commentAdd a comment