చలో థాయ్‌లాండ్‌ | Jr NTR Heads To Thailand To Shoot Devara, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Devara Shooting Update: చలో థాయ్‌లాండ్‌

Jun 18 2024 1:50 AM | Updated on Jun 18 2024 12:11 PM

Jr NTR heads to Thailand to shoot Devara

హీరో ఎన్టీఆర్‌ థాయ్‌లాండ్‌కి పయనమయ్యారు. ‘దేవర’ మూవీ తాజా షెడ్యూల్‌ చిత్రీకరణలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లారు ఎన్టీఆర్‌. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘దేవర’ కీలక షెడ్యూల్‌ను గోవాలో పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్‌ చేరుకుంది చిత్రబృందం. తర్వాతి షెడ్యూల్‌ కోసం సోమవారం ఎన్టీఆర్‌ హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌ ప్రయాణం అయ్యారు.

ఆయనతోపాటు భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్, భార్గవ్‌ కూడా ఉన్నారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్న ఎన్టీఆర్‌ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘దేవర’ షూటింగ్‌లో పాల్గొనేందుకు జాన్వీ కపూర్‌ కూడా ఆదివారం సాయంత్రం థాయ్‌లాండ్‌కు బయలుదేరారు. అక్కడ ఎన్టీఆర్, జాన్వీలపై ఓ పాటతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట కొరటాల శివ. రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ తొలి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement