గోవాలో ఆటా పాటా... | Jr Ntr Devara hits Goa for shooting | Sakshi
Sakshi News home page

గోవాలో ఆటా పాటా...

Published Mon, Jun 10 2024 12:07 AM | Last Updated on Mon, Jun 10 2024 12:06 AM

Jr Ntr Devara hits Goa for shooting

మళ్లీ గోవా వెళ్లాడు దేవర. ‘జనతా గ్యారేజ్‌’ (2016) వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగాన్ని ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్‌ చేయనున్నట్లు గతంలో మేకర్స్‌ వెల్లడించారు.

ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఎన్టీఆర్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో ఓ సాంగ్, కొంత టాకీ పార్ట్, ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారట. ఈ ఏడాది మార్చిలో ‘దేవర’ యూనిట్‌ గోవాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది. ఇప్పుడు మళ్లీ గోవాలో షూటింగ్‌ జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement