Jr NTR Wraps Up Action-Packed Schedule Of 'Devara' - Sakshi
Sakshi News home page

స్టార్ట్‌ యాక్షన్

Published Mon, Jul 31 2023 6:10 AM | Last Updated on Mon, Jul 31 2023 10:02 AM

Jr NTR Wraps Up Action Packed Schedule Of Devara - Sakshi

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో జాన్వీకపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ‘దేవర’ లోని ఓ యాక్షన్  షెడ్యూల్‌ పూర్తయింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌ ఆగస్టు తొలివారంలో ప్రారంభం అవుతుందనీ, ఓ యాక్షన్  సన్నివేశాన్ని చిత్రీకరిస్తారని టాక్‌.

ఈ ఫైట్‌ ఇంట్రవెల్‌ సమయంలో వస్తుందని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్ ్స ఈ యాక్షన్  సీక్వెన్ ్సను డిజైన్  చేయనున్నట్లు టాక్‌. అలాగే ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అయిన సైఫ్‌ అలీఖాన్ , జాన్వీకపూర్‌లతో పాటు, కొందరు కీలక పాత్రధారులపై ఈ షెడ్యూల్‌లోనే  కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారట కొరటాల. ‘దేవర’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement