Janhvi Kapoor Tamil Debut Film With Kamal Hassan - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ 'దేవర' తర్వాత జాన్వీకి దక్కనున్న గోల్డెన్‌ చాన్స్‌

Published Sat, Jul 8 2023 7:05 AM | Last Updated on Sat, Jul 8 2023 9:32 AM

Janhvi Kapoor Tamil Debut Film With Kamal Hassan - Sakshi

నటి శ్రీదేవి ఈ పేరే అందానికి బ్రాండ్‌ అంబాసిడర్‌. మొదట కోలీవుడ్‌లో బాలనాటిగా తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత టాప్‌ హీరోయిన్‌గా పేరు పొందారు. అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటించి ఇండియన్‌ సినీ చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు. ఆమె జీవితం కథానాయకిగానే ముగిసింది.

ఇక శ్రీదేవి వారసురాలిగా రంగప్రవేశం చేస్తున్న పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో ఇప్పటికే క్రేజీ కథానాయకిగా రాణిస్తోంది. నటన కంటే తన అందాలతో సోషల్‌ మీడియాను ఊపేస్తున్న జాన్వీకపూర్‌పై దక్షిణాది సినిమా చూపు చాలా కాలం క్రితమే పడింది. పలువురు ప్రముఖ దర్శక, నిర్మాతలు తమ చిత్రాల ద్వారా పరిచయం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆమెకు దక్షిణ చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉన్నా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చింది. అలా ఇటీవలే తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన 'దేవర' చిత్రంలో నటించడానికి అంగీకరించింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.

(ఇదీ చదవండి: పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా!)

కాగా జాన్వీకపూర్‌ దక్షిణాదిలో తన రెండవ చిత్రాన్ని కోలీవుడ్‌లో చేయబోతున్నారని తాజా సమాచారం. కోలీవుడ్‌లో కమలహాసన్‌, శ్రీదేవిలది సూపర్‌ హిట్‌ కాంబో. కాగా శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్‌ను కమలహాసన్‌ కోలీవుడ్‌లో పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. ఇటీవల విక్రమ్‌ చిత్రంతో బంపర్‌ హిట్‌ కొట్టిన ఆయన ప్రస్తుతం తన 233వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌న్స్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

(ఇదీ చదవండి: ‘భాగ్‌ సాలే’మూవీ రివ్యూ)

కాగా మరోపక్క ఆయన వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నారు. నటుడు శింబు హీరోగా ఒక చిత్రం, శివకార్తికేయన్‌తో మరో చిత్రం చేస్తున్న కమలహాసన్‌, ఇటీవల చిన్నచిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన 'లవ్‌ టుడే' చిత్ర దర్శకుడు, కథానాయకుడు ప్రదీప్‌ రంగనాథం హీరోగా, నయనతార భర్త విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో మరో చిత్రాన్ని కమల్‌ నిర్మాతగా ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ చిత్రంలోనే నటి జాన్వీకపూర్‌ను కథానాయకిగా నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇందులో కమల్‌ ఒక కీలక పాత్రలో చేయనున్నట్లు సమచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement