మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా కోసం ఓ పాటను భారీగా చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణలో దాదాపు వెయ్యి మంది డాన్సర్లు, మరో వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొననున్నారు.
ఇప్పటికే ఈ పాట చిత్రీకరణ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌ను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ సెట్‌లో పాట చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఈ పాటలో చిరుతో పాటు తమన్నా, నయనతార ఇతర నటీనటులు పాల్గొననున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment