
మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బుధవారం(అక్టోబర్ 2) రోజున ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రం ఘన విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తాజాగా ప్రముఖ నటుడు మోహన్‌బాబు సైరా మూవీకి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ‘నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని.. నిర్మాత చరణ్‌కు, చిరంజీవికి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. Best of Luck!
— Mohan Babu M (@themohanbabu) October 1, 2019
చదవండి : ‘సైరా’ఫస్ట్ రివ్యూ: రోమాలు నిక్కబొడిచేలా చిరు నటన
బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న ‘సైరా’
చదవండి.. సైరా ఫుల్ రివ్యూ (4/5)
Comments
Please login to add a commentAdd a comment