ఆప్ కాదు పాప్... కేజ్రీవాల్ కోతి: వర్మ | aap should be renamed paap, kejriwal is a true monkey, says ramgopal varma | Sakshi
Sakshi News home page

ఆప్ కాదు పాప్... కేజ్రీవాల్ కోతి: వర్మ

Published Thu, Oct 6 2016 1:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

ఆప్ కాదు పాప్... కేజ్రీవాల్ కోతి: వర్మ

ఆప్ కాదు పాప్... కేజ్రీవాల్ కోతి: వర్మ

సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియోలు బయట పెట్టాలని డిమాండ్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ విరుచుకుపడ్డాడు.

సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియోలు బయట పెట్టాలని డిమాండ్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ విరుచుకుపడ్డాడు. సైనిక దళాల నిబద్ధతను కేజ్రీవాల్ ప్రశ్నించడం చూస్తుంటే.. దారుణంగా ఉందని వ్యాఖ్యానించాడు. భారత సైన్యం దేశం వెలుపల సర్జికల్ స్ట్రైక్స్ చేయడంతో పాటు.. దేశం లోపలే ఉండి జాతి వ్యతిరేకులుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ లాంటివాళ్ల మీద కూడా సర్జికల్ స్ట్రైక్స్  చేయాలని సూచించాడు.

మఫ్లర్, టోపీ పెట్టుకుని ఉన్న కేజ్రీవాల్‌ను చూస్తే తనకు ఎప్పుడూ కోతి గుర్తుకొచ్చేదని, కానీ ఇప్పుడు భారతీయ సైన్యంపై ఆయన వ్యాఖ్యలు చూస్తే నిజంగా అసలైన కోతేనని అర్థమైందని వర్మ అన్నాడు. ఇప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను పాప్ అనాలని చెప్పాడు. అందులో పి అంటే పాకిస్థాన్ అని, అలాగే పాపం అన్న అర్థం కూడా వస్తుందని వర్మ వ్యాఖ్యానించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement