పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియో ఫుటేజిని విడుదల చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత ఆర్మీ తేల్చి చెప్పేసింది. ఇక ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రే. అసలు సర్జికల్ స్ట్రైక్స్ ఏవీ జరగలేదంటూ పాకిస్థాన్ మీడియా దుష్ప్రచారం చేయడం, భారతదేశంలో కూడా కొందరు నాయకులు దానికి వత్తాసు పాడటం లాంటి ఘటనల నేపథ్యంలో వీడియోలను విడుదల చేసి పక్కా సాక్ష్యాలు బయటపెట్డమే మేలని ఆర్మీ భావిస్తున్నట్లు తెలుస్తోంది