పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) లో భారత్ చేసింది ఆర్మీ చర్యగా చూడరాదని, కేవలం ఆత్మరక్షణ కోసం చేసిన దాడులుగా పరిగణించాలని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ పేర్కొన్నారు. రక్షణ కోసం అవసరమైతే భారత ఆర్మీ ఎన్ని దాడులకైనా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇటీవల జమ్ముకశ్మీర్ లోని ఉడీ దాడుల్లో 18 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అందుకు ప్రతీకారంగా భారత్ ఆత్మరక్షణ చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే తాజాగా పీఓకేలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ దాడికి ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు.పీఓకేలో ఎలాంటి ఉల్లంఘటనలకు పాల్పడలేదని, ఎందుకంటే పీఓకే భారత్ లో అంతర్భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు
Published Fri, Sep 30 2016 10:41 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement