Rajyavardhan Rathore
-
ఇది మోదీ సునామీ: సీఎం రేసులో బీజేపీ రేసు గుర్రాలు
రాజస్థాన్‌లో బీజేపీ ఆధిక్యం అప్రతి హతంగా కొనసాగుతోంది. కీలక నేతలు భారీ మెజారిటీతో విజయం సాధించి గెలుపు గుర్రాలు నిలిచారు. ముఖ్యంగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝల్రాపటన్ అసెంబ్లీ స్థానంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే 53,193 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. దీంతో ఆమె మళ్లీ రాజస్థాన్ ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించాలని ఆమె మద్దతుదారులు కోరుకుంటున్నారు. మరోవైపు బీజేపీ ఎంసీ దియా కుమారి విద్యాధర్ నగర్లో 71,368 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై విజయం సాధించారు. రాజకుటుంబానికి చెందిన కుమారికూడా సీఎం రేసులో ఉన్న సంగతి తెలిసిందే. తన విజయం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె దేశవ్యాప్తంగా మోదీ సునామీ వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ గెలుపు ప్రధాని మోదీ, అమిత్ షా జీ, జేపీ నడ్డా జీ, రాష్ట్ర నాయకులు పార్టీ కార్యకర్తలకే చెందుతుంతన్నారు. రాజస్థాన్‌తో పాటు ఎంపీ ,ఛత్తీస్‌గఢ్‌లో కూడా మోదీజీ మ్యాజిక్ పనిచేసింది, రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధిని అందిస్తాం.. ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు కనిపిస్తున్నాయి.. ఇక సీఎం ఎవరనేది పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయిస్తుందని దియా వ్యాఖ్యానించారు. మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జోత్వారా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరిపై ఆయన సునాయాసంగా విజయాన్ని నమోదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీ శ్రేణులకు, జోత్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాము చెప్పేది చేసే పార్టీకి చెందిన వారమని ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. #WATCH | Rajasthan BJP MLA candidate Diya Kumari, in Jaipur says, "The credit for this win goes to PM Modi, Amit Shah ji, JP Nadda ji, state leaders and party workers. Modi ji's magic worked in Rajasthan and also MP & Chhattisgarh...We will ensure good governance and development… pic.twitter.com/3stn8l8Vj1 — ANI (@ANI) December 3, 2023 VIDEO | Rajasthan elections 2023: "I would like to thank PM Modi, BJP workers and the people of Jhotwara. People know that we belong to a party that do what it says," says @Ra_THORe, BJP candidate from Jhotwara, as party continues to maintain lead in Rajasthan.… pic.twitter.com/BO2v3PCmu1 — Press Trust of India (@PTI_News) December 3, 2023 -
‘అథ్లెట్ల మధ్య యుద్ధం కాదు ఇది’
జైపూర్ : లోక్‌సభ ఎన్నికల వేళ జైపూర్ రూరల్ పార్లమెంట్ స్థానం ఒలంపియన్ల మధ్య ‘యుద్ధాని’కి వేదిక అయ్యింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి రాజ్‌వర్థన్ సింగ్ పోటీ చేస్తుండగా.. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ క్రిష్ణ పునియాను బరిలో దింపింది. దీంతో ఒలంపిక్ క్రీడల్లో భారత దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఇద్దరు అథ్లెట్లు.. ప్రస్తుతం వేర్వేరు పార్టీల నుంచి బరిలో దిగడంతో అక్కడ ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో వీరి పోటీని ‘ఇద్దరు ఒలంపియన్ల మధ్య యుద్ధం’ గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ విషయం గురించి సదులాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్రిష్ణ పునియా మాట్లాడుతూ.. ‘ ఇది అథ్లెట్ల మధ్య యుద్ధం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మా పార్టీ కృషి చేస్తోంది. యువత, మహిళలు, రైతు సంక్షేమం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. కానీ చౌకీదార్లుగా చెప్పుకుంటున్న వ్యక్తులు జాతి సంపదను దళారులు దోచుకుంటుంటే ఏం చేస్తున్నారో. బహుశా వాళ్లు నిద్రపోతూ ఉంటారు’ అని ఎద్దేవా చేశారు. కాగా 2004 ఏథెన్స్ ఒలంపిక్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్(49) 2013లో బీజేపీలో చేరారు. కామన్వెల్త్ క్రీడలు, పలు అంతర్జాతీయ చాంపియన్ షిప్లో అనేక పతకాలు సాధించిన ఆయన ప్రస్తుతం కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. జైపూర్ రూరల్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న రాథోడ్ మరోసారి విజయం సాధించాలనే నిశ్చయంతో ఉన్నారు. ఇక హర్యానాకు చెందిన క్రిష్ణ పునియా(36).. కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించారు. మూడు సార్లు ఒలంపిక్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆమె.. 2011లో పద్మశ్రీ పొందారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన పునియా ఇటీవల జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సదులాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం పార్టీ అధిష్టానం మేరకు ఆమె జైపూర్ పార్లమెంట్ స్థానం నుంచి రాథోడ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు క్రీడాకారులు ఒకే ఏడాదిలో అంటే 2013లోనే రాజకీయాల్లో ప్రవేశించడం విశేషం. -
ఆధారాలు కావాలా.. బాలాకోట్ వెళ్లండి!
సాక్షి, న్యూఢిల్లీ: వైమానిక దాడులపై కట్టుకథలతో బీజేపీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులకు ఆధారాలు చూపించాలన్న కాంగ్రెస్ సీనియర్‌నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యలపై కేంద్ర సమాచారమంత్రిత్వ శాఖమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తీవ్రంగా స్పందించారు. భారత వైమానిక దళం జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసేందో లేదో తెలియాలంటే పాకిస్తాన్‌లోని బాలాకోట్‌కు వెళ్లిచూడండి అని ఘాటుగా బదులిచ్చారు. దీనిపై వారిద్దరి మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం సాగింది. ‘‘గత పార్లమెంట ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని కాంగ్రెస్ నేతలు బ్రిటన్ వెళ్లి అక్కడ ఆధారాలు ఉన్నాయంటూ తమపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా బాలాకోట్ వెళ్లి పరిశీలించి దాడులు జరిగాయో లేదో చెప్పండి. అక్కడే సరైన ఆధారాలు దొరుకుతాయి’’ అని రాథోడ్ సమాధానమిచ్చారు. బాలాకోట్ దాడులకు సరైన అధారాలు లేవని అంతర్జాతీయ మీడియా చేస్తున్న ప్రచారం మీకు (కాంగ్రెస్) చాలా ఆనందాన్ని కలిగిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత సైన్యంపై కంటే విదేశీ మీడియాపైనే కాంగ్రెస్‌కు ఎక్కువ నమ్మకమని అన్నారు. కాగా వైమానిక దళ దాడులపై అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరగుతోంది. బాలాకోట్ దాడులపై న్యూయార్స్ టైమ్స్, వాషింగ్టన్ డీసీ ప్రచురించిన కథనాలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని కపిల్ సిబాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. Kapil Sibal ji: You believe international media over own Intelligence agencies? You seem happy when media quoted by you says “no losses in strike”? ..and sir, for us you went to london🤦🏽♂️ to find evidence against EVMs, will you please also go to Balakot to check? https://t.co/JefbNnGdqP — Rajyavardhan Rathore (@Ra_THORe) 5 March 2019 -
పతకం పోయినా... 10 లక్షలు వచ్చాయి
న్యూఢిల్లీ: ఏషియాడ్‌లో దురదృష్టం వెంటాడి కాంస్యం కోల్పోయిన భారత అథ్లెట్ గోవిందన్ లక్ష్మణన్‌ను నజరానా వరించింది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్... అతడిని నగదు పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ 10 వేల మీటర్ల పరుగులో మూడో స్థానంలో నిలిచాడు. కానీ మరో అథ్లెట్ నెట్టడంతో అతని అడుగు అనూహ్యంగా ట్రాక్ లైన్‌ను దాటి బయటపడింది. దీంతో అనర్హతకు గురై పతకాన్ని కోల్పోయాడు. మరో అథ్లెట్ తగలడం వల్లే అతను లైన్ దాటాడని భారత్ చేసిన అప్పీల్‌ను నిర్వాహకులు తోసిపుచ్చారు. అయితే పరుగును పూర్తిచేసిన లక్ష్మణన్ కఠోర శ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నజరానాకు ఎంపిక చేసినట్లు రాథోడ్ తెలిపారు. -
ఆసియా క్రీడలకు భారత్ నుంచి 36 క్రీడాంశాల్లో 572 మంది
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా మైదానంలో, బయటా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని భారత బృందానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ సూచించారు. ఈనెల 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేసియాలోని జకార్తా, పాలెంబాంగ్‌లో జరిగే ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 36 క్రీడాంశాల్లో 572 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. మరోవైపు ఈ క్రీడల్లో యువ జావెలిన్ త్రోయర్, కామన్వెల్త్ క్రీడల చాంపియన్ నీరజ్ చోప్రా మార్చ్‌పాస్ట్‌లో త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించనున్నాడు. 20 ఏళ్ల నీరజ్ చోప్రా గతేడాది ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో, 2016 లో అండర్–20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. -
నాకిష్టం లేకున్నా... మంత్రి రాథోడ్ వల్లే చేరా!
న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)కు చెందిన యాంటీ డోపింగ్ అప్పీల్స్ ప్యానెల్ (ఏడీఏపీ)లో ఇష్టం లేకపోయినా క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కోరిక మేరకే చేరానని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశాడు. ‘నాడా’ గతేడాది నవంబర్‌లో ఏడీఏపీ సభ్యుడిగా సెహ్వాగ్‌ను నియమించింది. ఆటగాళ్ల నిషేధంపై చేసుకున్న అప్పీల్‌ను ఈ ప్యానెల్ విచారిస్తుంది. ఇప్పటివరకు పలువురి అప్పీళ్లను విచారించినప్పటికీ ఏ ఒక్క విచారణకు సెహ్వాగ్ హాజరు కాలేదు. దీనిపై వచ్చిన వార్తలపై అతను వివరణ ఇచ్చాడు. ‘నా అభిప్రాయం ప్రకారం క్రికెటర్ల కంటే ఒలింపియన్లనే ‘నాడా’ కమిటీల్లో నియమించాలి. వాళ్లకైతేనే ‘నాడా’ వ్యవహారాలు తెలుస్తాయి. డోపింగ్ నిరోధక అంశాలు నాకంటే ఒలింపియన్లకే బాగా తెలుసు. వారే ఈ ప్యానెల్ సభ్యులుగా అర్హులు. నాకు ఈ పదవిపై ఇష్టమే లేదు. కానీ... మంత్రి రాథోడ్ కోరికను కాదనలేకే సరేనన్నా’ అని సెహ్వాగ్ వివరించాడు. -
‘సాయ్’ ఇకపై స్పోర్ట్స్ ఇండియా: రాథోడ్
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పేరు మారింది. ఇక నుంచి ‘సాయ్’ను ‘స్పోర్ట్స్ ఇండియా’గా పిలవనున్నారు. న్యూఢిల్లీలో జరిగిన ‘సాయ్’ 50వ సర్వసభ్య సమావేశం అనంతరం ఈ కొత్త పేరును కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెల్లడించారు. ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) నుంచి అథారిటీ పదాన్ని తొలగించాం. అది ఇప్పుడు స్పోర్ట్స్ ఇండియా (ఎస్ఐ)గా మారింది’ అని రాథోడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘సాయ్’ని 1984లో స్థాపించారు. 50వ సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుతో పాటు పలు కీలక నిర్ణయాలనూ తీసుకున్నారు. అథ్లెట్లకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించేందుకు మెస్ చార్జీలను పెంచారు. పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసేందుకు ప్రొఫెషనల్స్‌ను రంగంలోకి దించాలని ఎస్ఐ యోచిస్తోంది. -
నామినేట్ చేసినందుకు మోదీకి థ్యాంక్స్!
న్యూఢిల్లీ : ఇటీవల కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ప్రారంభించిన ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’కు విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేను సైతం అంటూ తన ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేశారు. నరేంద్ర మోదీ ఫిట్నెస్ ఛాలెంజ్‌పై భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా స్పందించారు. ప్రధాని మోదీ స్థాయి వ్యక్తి తనకు ఫిట్నెస్ ఛాలెంజ్ విసరడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను గుర్తించి ఫిట్నెస్ ఛాలెంజ్‌కు నామినేట్ (ఆహ్వానించినందుకు) చేసినందుకు ప్రధానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మోదీ చేసిన ఈ ప్రయత్నం అందరికీ ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. క్రీడాకారులతో పాటు ఇతరలుకు కూడా ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమని మానికా అభిప్రాయపడ్డారు. కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా మోదీ ఛాలెంజ్‌ను స్వీకరించారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మానికా బత్రా. కామన్వెల్త్ చరిత్రలో టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ సాధించిన తొలి పతకం కావడం గమనార్హం. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మానికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్ల తేడాతో నెగ్గి స్వర్ణం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అతికొద్ది మందిలో మోదీ ఒకరు: రాజ్యవర్థన్ రాథోడ్ తాను ప్రారంభించిన హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఫిట్నెస్ విడుదల చేయడంపై కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రధాని తరచుగా యువత ఫిట్నెస్ గురించి మాట్లాడేవారు. యువత వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందని మోదీ భావించేవారు. ఇలాంటి ఫిట్నెస్ వీడియోలు షేర్ చేసే అతికొద్దిమంది ప్రధానులలో మోదీ ఒకరు. ఈ ప్రచారం మంచిధోరణిలో వెళ్తుంది. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని’ రాజ్యవర్ధన్ రాథోడ్ వివరించారు. -
పాండ్యాకు రాహుల్ సవాల్!
న్యూఢిల్లీ : కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ పిలుపునిచ్చిన ‘ఫిట్నెస్ ఛాలెంజ్’కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. క్రీడాకారుల నుంచే కాకుండా సినీతారాలు, సామన్య ప్రజానికం సైతం ఈ చాలెంజ్‌కు సై అంటున్నారు. ‘‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో మొదలుపెట్టిన రాథోడ్ ఈ ఛాలెంజ్‌ను కోహ్లీ, హృతిక్‌రోషన్, సైనా నెహ్వాల్‌కు విసిరాడు. మంత్రి చాలెంజ్‌ను స్వీకరించిన టీమిండియా కెప్టెన్ కోహ్లి.. ప్రధాని నరేంద్రమోదీ, టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, అనుష్కశర్మతో పాటు కేఎల్ రాహుల్‌లకు సవాల్ విసిరాడు. అయితే కోహ్లి సవాల్‌ను స్వీకరించిన కేఎల్ రాహుల్ తన ఫిట్నెస్ కసరత్తుల సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. హార్ధిక్‌పాండ్యా, దినేశ్కార్తీక్లకు చాలెంజ్ విసిరాడు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సైతం సవాల్ స్వీకరిస్తున్నట్లు చెప్పి త్వరలోనే వీడియోను ఫోస్ట్ చేస్తానని తెలిపిన విషయం తెలిసిందే. ఇక సురేశ్ రైనా హర్భజన్‌ను చాలెంజ్ చేయగా.. బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ టాలీవుడ్ హీరో రానాదగ్గబాటి, రకుల్‌ప్రీత్ సింగ్‌లకు సవాల్ విసిరాడు. ప్రస్తుతం ఈ చాలెంజ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. -
మీరు ఫిట్‌గా ఉన్నారా? చాలెంజ్
న్యూఢిల్లీ : ఆ మధ్య సోషల్ మీడియాలో ఐస్ బకెట్ చాలెంజ్, ప్యాడ్మాన్ చాలెంజ్‌ల గురించి విన్నాం. సెలబ్రిటీల నుంచి మాములు నెటిజన్ల వరకు ఈ చాలెంజ్‌లను స్వీకరిస్తూ ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఈ తరహాలోనే మరో కొత్త చాలెంజ్ తెరపైకి వచ్చింది. ఈ చాలెంజ్‌ను తీసుకొచ్చింది ఎవరో కాదు. కేంద్ర కీడా శాఖ మంత్రి, ఒలింపిక్ విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. భారతీయులు ఫిట్నెస్గా ఉండాలనే ఉద్దేశ్యంతో ‘హమ్ ఫిట్‌తో ఫిట్ ఇండియా ఫిట్’ అనే చాలెంజ్‌కు ఆయన శ్రీకారం చుట్టారు. మంగళవారం ఈ చాలెంజ్‌కు సంబంధించి ఓ వీడియోను తన ట్విటర్ అకౌంట్లో పంచుకుంటూ.. ‘ఫిట్నెస్ కోసం చేసే కసరత్తులకు సంబంధించి వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. అలాగే మీ మిత్రులకు చాలెంజ్ చేయండి. నేను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్లకు సవాల్ విసురుతున్నాను’. అని ట్వీట్ చేశాడు. వీడియోలో ఏం చెప్పాడంటే.. ఫిట్నెస్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తాను స్పూర్తి పొందినట్లు తెలుపుతూ.. ఈ ఒలింపిక్ విజేత పది పుషప్స్ చేశాడు. ‘‘ ప్రధాని మోదీని చూసినప్పుడల్లా స్పూర్తి పొందుతాను. ఆయన చాలా శక్తివంతుడు. రోజంతా పనిచేస్తునే ఉంటారు. భారత ప్రజలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని ఆయన ఎప్పుడు పరితపిస్తుంటారు. ఫిట్‌నెస్‌పై ప్రధాని మాట్లాడిన కొన్ని మాటలు నన్ను ఆలోచింపజేశాయి.’’ అని తెలిపారు. ఇక ఈ చాలెంజ్‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తమ వర్కౌట్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. #HumFitTohIndiaFit 🇮🇳🏆 Post pictures and videos of how you keep yourself fit and send a #FitnessChallenge to your friends on social media. Here's my video 😀and I challenge @iHrithik, @imVkohli & @NSaina to join in🥊 pic.twitter.com/pYhRY1lNEm — Rajyavardhan Rathore (@Ra_THORe) May 22, 2018 -
జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం
సరియైన నూట్రిషనల్ విలువలు లేని లేదా సరిపడ కేలరీలు లేని ఆహారపదార్థాలు జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. చిన్నపిల్లలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్న ఈ జంక్ ఫుడ్స్‌ను నిర్మూలించడానికి ప్రభుత్వం, కార్టూన్ ఛానల్స్‌లో ప్రసారమవుతున్న వీటి ప్రకటనలపై నిషేధం విధించాలని నిర్ణయించింది. జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ప్రకటనలను నిషేధించడానికి తగిన అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర సమాచార, టెక్నాలజీ జూనియర్ మంత్రి రాజ్యవర్థన్ రాథోర్ నేడు పార్లమెంట్‌కు తెలిపారు. దీనిపై త్వరలోనే కార్టూన్ ఛానల్స్‌కు ఆదేశాలను జారీచేస్తామన్నారు. అనారోగ్యకరమైన ఈ ఫుడ్ ఉత్పత్తులను పిల్లలు తీసుకోకుండా ఉండేందుకు ఈ ఐడియా పనిచేస్తుందన్నారు. అనారోగ్యకరమైన ఫుడ్లపై చిన్న పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, ఇది వారి దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ పేర్కొంది. ఊబకాయం వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయన్నారు. పిల్లలని టార్గెట్ చేసి వీటి ప్రకటనలను కూడా ఎక్కువగా కార్టూన్ ఛానల్స్‌లోనే ప్రదర్శిస్తున్నారు. పోగో, నికెలోడియాన్ వంటి పిల్లల టెలివిజన్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే ఈ ప్రకటనలకు రెవెన్యూలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. దీంతో కార్టూన్ ఛానల్స్‌లో ఈ ప్రకటనలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు
సాక్షి, న్యూఢిల్లీ : అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. టోక్యో ఒలంపిక్స్, ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు నెలకు 50 వేల రూపాయలను నెలసరి ఖర్చుల కింద చెల్లిస్తున్నట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ శుక్రవారం ప్రకటించారు. అభినవ్ బింద్రా నేతృత్వం వహిస్తున్న ఒలంపిక్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులను సైతం ఆమోదించినట్లు ఆయన చెప్పారు. టార్గెట్ ఒలంపిక్స్ స్కీమ్ కింద 152 మంది క్రీడాకారులను ఎలైట్ ప్యానెల్లో చేర్చినట్లు రాథోడ్ చెప్పారు. ఎలైట్ప్యానల్కు ఎంపికైన 152 మంది క్రీడాకారులకు ఈ అవకాశం వర్తిస్తుందని అన్నారు. ఈ నెలసరి ఖర్చుల మొత్తాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్లో కూడా పేర్కొన్నారు. MYAS @IndiaSports announces Rs 50k/month pocket allowance for 152 elite athletes preparing for Tokyo/CWG/Asian Games. Athletes first,always! — Rajyavardhan Rathore (@Ra_THORe) 15 September 2017 The allowance applies wef 1 Sep 2017 & is purely for pocket expenses of elite athletes.Committed to providing all resources to our champions — Rajyavardhan Rathore (@Ra_THORe) 15 September 2017 -
కేంద్ర మంత్రికి రాజమౌళి రహస్యం చెప్పేశారు
పనాజీ: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న ఎంత పాపులరో వేరే చెప్పనక్కర్లేదు. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం ఎవరు చేసినా వెంటనే మన చెవులు ఆ వైపు పెట్టాలనిపిస్తుంటుంది. కానీ ఈసారి ఆ ముచ్చట గురించి చెబుతోంది చిన్న వ్యక్తి కాదు. ఓ కేంద్ర మంత్రి. అవును కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని విషయంపై మాట్లాడారు. ఆ గుప్త రహస్యం తనకు తెలుసని, అది తనకు చెప్పిన దర్శకుడు రాజమౌలికి ధన్యవాదాలు అని అన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దిన అద్భుత వెండితెర చిత్రం ‘బాహుబలి ది బిగినింగ్’ . ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎంత ప్రతిష్టను ఇనుమడింపజేసుకుందో చెప్పనక్లర్లేదు. అయితే అంతే స్థాయిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న కూడా ఫేమస్ అయింది. దీనిపై ఇప్పటికే వేల ఊహాగానాలు జోకులుగా, సీరియస్ కామెంట్లుగా, వివరణలుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. తాజాగా గోవాలో జరుగుతున్న 47 అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి దర్శకుడు రాజమౌళి కూడా ప్రత్యేక అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యవర్ధన్ రాథోడ్‌కు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే రహస్యం చెప్పారంట. ఈ విషయాన్ని రాథోడ్ స్వయంగా సోమవారం ఈ చిత్రోత్సవానికి ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో వేదికపై నుంచి వెల్లడించారు. ‘బాహుబలిలాంటి బ్రిలియంట్ చిత్రాన్ని మనకు అందించిందనందుకు రాజమౌళికి నా ధన్యవాదాలు. అలాగే బాహబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం కూడా చెప్పినందుకు కూడా ధన్యవాదాలు. ఆయన ఎందుకు చెప్పారంటే మా ప్రభుత్వానికి అన్నీ తెలుసు.. అంతేకాదు దేన్ని రహస్యంగా ఉంచాలో కూడా తెలుసు.. అందువల్ల రాజమౌళి నాకు చెప్పిన ఆ రహస్యం కూడా భద్రంగా ఉంటుంది’ అని రాథోడ్ అన్నారు. -
పాక్‌పై మరిన్ని దాడులు చేస్తాం: కేంద్ర మంత్రి
-
మరిన్ని దాడులు చేస్తాం: కేంద్ర మంత్రి
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) లో భారత్ చేసింది ఆర్మీ చర్యగా చూడరాదని, కేవలం ఆత్మరక్షణ కోసం చేసిన దాడులుగా పరిగణించాలని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ పేర్కొన్నారు. రక్షణ కోసం అవసరమైతే భారత ఆర్మీ ఎన్ని దాడులకైనా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇటీవల జమ్ముకశ్మీర్ లోని ఉడీ దాడుల్లో 18 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అందుకు ప్రతీకారంగా భారత్ ఆత్మరక్షణ చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే తాజాగా పీఓకేలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ దాడికి ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. పీఓకే భారత్‌దే, మరీ ఉల్లంఘనెక్కడిది? పీఓకేలో ఎలాంటి ఉల్లంఘటనలకు పాల్పడలేదని, ఎందుకంటే పీఓకే భారత్ లో అంతర్భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై 'నిర్దేశిత దాడుల' (సర్జికల్ స్ట్రైక్స్) విషయంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పీవోకే పాక్ నియంత్రణలో ఉన్నా.. అధికారికంగా ఇది భారత్ భూభాగంలో ఉన్నట్టే లెక్క. కాబట్టి ఈ ప్రాంతంలో దాడులు జరిపినా.. సరిహద్దుల ఉల్లంఘన, ప్రాదేశిక ఉల్లంఘన కిందకి రాదు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ మీడియాకు వెల్లడించారు. కేవలం కొంతమంది ఉగ్రవాదులను అంతం చేయడమే ఈ దాడుల లక్ష్యమని, అంతేకానీ మిలటరీ చర్యగా భావించవద్దని పాక్ కు సూచించారు. పీఓకేలో భారత ఆర్మీ నిర్దేశిత దాడులలో దాదాపు 38 మంది ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. -
బలమైన కేసు ఎందుకు పెట్టలేదు?
జైపూర్/డెహ్రడూన్: ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వనున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లలిత్ ను తమకు అప్పగించాలని బ్రిటన్ ను కోరనున్నామని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి దమ్ముంటే లలిత్ మోదీని స్వదేశానికి రప్పించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం సవాల్ చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. లలిత్ ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాథోడ్ తెలిపారు. రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. లలిత్ మోదీ విదేశాలకు పారిపోవడానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆయనపై బలమైన కేసు పెట్టివుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు. ఫెమా కేసు మాత్రమే పెట్టి యూపీఏ ప్రభుత్వం చేతులు దులుపుకుందని దుయ్యబట్టారు. ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం లేదని, ఎక్కువ శిక్ష కూడా పడదని తెలిపారు. లలిత్ గేట్ వివాదంపై ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. -
నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు - రాజ్యవర్ధన్
న్యూఢిల్లీ: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తనపై వచ్చిన ఆరోపణలకు ట్విట్టర్ లో్ వివరణ ఇచ్చుకున్నారు. మహిళా జర్నలిస్టులు రిపోర్టర్లుగా బయటికి వెళ్ళకుండా , కార్యాలయంలోనే వివిధ రంగాల్లో ఇంకా బాగా పనిచేయొచ్చన్నమంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. దీంతో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ రాజ్యవర్ధన్ ట్వీట్ చేశారు. జర్నలిస్టుల భద్రత, రక్షణ,వారు పనిచేసే పరిస్థితులు,పనిగంటలు, ఒక తల్లిగా, ఒక సోదరిగా, భార్యగా ఆమె బాధ్యతలను దృష్టిలో పెట్టుకొనే అలా మాట్లాడానే తప్ప అసలు వారు బయటికి వెళ్ళకూడదు అనేది తన ఉద్దేశం కాదన్నారు. మహిళలంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. అంతేకాదు తన భార్య ఒక మాజీ సైనికురాలని, పార్లమెంట్ పై దాడి సందర్భంగా జరిగిన పోరాటంలో ఆమె కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. Controversy over Minister Rajyavardhan Rathore's Remarks on Women Journalists -
'భారత్ హిందూ రాజ్యమే!'
-
'భారత్ హిందూ రాజ్యమే'
న్యూ ఢిల్లీ: భారత దేశం ఎప్పుడూ లౌకికదేశం కాదు, మనది హిందూ రాజ్యమే అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చిన లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. కేంద్రప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా పత్రికలకి జారీ చేసిన ప్రకటనలో పాత పీఠికనే ప్రచురించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ప్రకటనలో పాత పీఠిక ప్రచురించడంతో లౌకిక, సామ్యవాద పదాలు కనిపించలేదు. పాత రాజ్యాంగ పీఠికను మాత్రమే పొరపాటున ఈ అడ్వర్టైజ్మెంట్లో వాడామని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి రాజవర్ధన్ రాథోడ్ వివరణ ఇచ్చారు. అయితే ఇది పొరపాటుకాదు, మంచిపని చేశారు..పాత రాజ్యాంగపీఠికనే అనుసరించండని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. -
తక్కువ పర్యవేక్షణ, ఎక్కువ పాలన: రాజ్యవర్థన్
న్యూఢిల్లీ: తక్కువ పర్యవేక్షణ ఎక్కువ పాలన ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని కేంద్ర సమాచార శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ అన్నారు. నవంబర్ 9 తేదిన జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం రాజ్ వర్ధన్ రాథోడ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. సమర్ధవంతమైన పాలన అందించడానికి ప్రధాని కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన తెలిపారు. షూటర్ గా క్రీడాజీవితం ప్రారంభించిన 44 ఏళ్ల రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ భారత సైన్యాధికారి పదవికి స్వచ్ఛంద విరమణ ప్రకటించి 2013లో బీజేపీ చేరారు. 2014 సాధారణ ఎన్నికల్లో రాజస్థాన్ లోని జైపూర్ రూరల్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొదటిసారిగా ఎంపీగా ఎన్నికైన ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టారు. -
ఆ రుగ్మతలపై పోరాడాల్సిందే: రాథోడ్
జైపూర్: క్రీడా సమాఖ్యల్లో ఆటగాళ్లు తప్పకుండా భాగస్వాములు కావాల్సిందేనని స్టార్ షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పేర్కొన్నాడు. ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్న ఇతను జాతీయ రైఫింగ్ సంఘం (ఎన్ఆర్ఐ) ఎన్నికలపై కోర్టులో పోరాడుతున్నాడు. ‘ఆటగాళ్లు రాజకీయాలు మనకెందుకులే అని అనుకోకుండా క్రీడా సమాఖ్యల పాలకపగ్గాల బాధ్యతల్లో పాలుపంచుకోవాలి. అప్పుడే సుదీర్ఘ కాలంగా అక్కడ తిష్ట వేసిన అసమర్థ, అవినీతి రుగ్మతలపై పోరాడే అవకాశం లభిస్తుంది. తద్వారా చక్కని ఫలితాల్ని దేశానికి అందించగలుగుతాం’ అని అతను సూచించాడు. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిస్థితుల్ని చక్కదిద్దే చొరవ క్రీడాకారులు తీసుకుంటేనే క్రీడలకు న్యాయం చేయగలుగుతామన్నాడు. అసమర్థ కార్యకలాపాలకు చరమగీతం పలికే అవకాశం ఆ సమాఖ్యల్లో క్రీడాకారులు భాగమైనప్పుడే లభిస్తుందని రాథోడ్ చెప్పాడు. క్రీడా సమాఖ్యల్లో ‘అథ్లెట్స్ కమిషన్’ను ఏర్పాటు చేయాలనే తన ప్రతిపాదనకు భారత ఒలింపిక్ సంఘం ఆమోదం తెలిపిందని... అలాగే ఇతర సమాఖ్యలు, సంఘాలు కూడా ఈ కమిటీకి తమ పాలకమండలిలో చురుకైన సభ్యత్వం ఇస్తేనే పరిస్థితులు మెరుగవుతాయని చెప్పాడు. తానిప్పుడు ఎన్ఆర్ఏఐపై పోరాడుతున్నానన్నాడు. ఈ సంఘం ఎన్నికలను సవాలు చేస్తూ అతను ఢిల్లీ హైకోర్టుకెక్కాడు.