కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
న్యూఢిల్లీ : ఆ మధ్య సోషల్ మీడియాలో ఐస్ బకెట్ చాలెంజ్, ప్యాడ్‌మాన్ చాలెంజ్‌ల గురించి విన్నాం. సెలబ్రిటీల నుంచి మాములు నెటిజన్ల వరకు ఈ చాలెంజ్‌లను స్వీకరిస్తూ ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఈ తరహాలోనే మరో కొత్త చాలెంజ్ తెరపైకి వచ్చింది. ఈ చాలెంజ్‌ను తీసుకొచ్చింది ఎవరో కాదు. కేంద్ర కీడా శాఖ మంత్రి, ఒలింపిక్ విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. భారతీయులు ఫిట్‌నెస్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో ‘హమ్ ఫిట్‌తో ఫిట్ ఇండియా ఫిట్’ అనే చాలెంజ్‌కు ఆయన శ్రీకారం చుట్టారు. మంగళవారం ఈ చాలెంజ్‌కు సంబంధించి ఓ వీడియోను తన ట్విటర్ అకౌంట్‌లో పంచుకుంటూ.. ‘ఫిట్‌నెస్ కోసం చేసే కసరత్తులకు సంబంధించి వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. అలాగే మీ మిత్రులకు చాలెంజ్ చేయండి. నేను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌లకు సవాల్ విసురుతున్నాను’. అని ట్వీట్ చేశాడు.
వీడియోలో ఏం చెప్పాడంటే.. ఫిట్‌నెస్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తాను స్పూర్తి పొందినట్లు తెలుపుతూ.. ఈ ఒలింపిక్ విజేత పది పుషప్స్ చేశాడు. ‘‘ ప్రధాని మోదీని చూసినప్పుడల్లా స్పూర్తి పొందుతాను. ఆయన చాలా శక్తివంతుడు. రోజంతా పనిచేస్తునే ఉంటారు. భారత ప్రజలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని ఆయన ఎప్పుడు పరితపిస్తుంటారు. ఫిట్‌నెస్‌పై ప్రధాని మాట్లాడిన కొన్ని మాటలు నన్ను ఆలోచింపజేశాయి.’’ అని తెలిపారు. ఇక ఈ చాలెంజ్‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తమ వర్కౌట్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
#HumFitTohIndiaFit 🇮🇳🏆
— Rajyavardhan Rathore (@Ra_THORe) May 22, 2018
Post pictures and videos of how you keep yourself fit and send a #FitnessChallenge to your friends on social media. Here's my video 😀and I challenge @iHrithik, @imVkohli & @NSaina to join in🥊 pic.twitter.com/pYhRY1lNEm
Comments
Please login to add a commentAdd a comment