
తాను ప్రతిపాదించిన ఫిట్‌నెస్ చాలెంజ్‌కు అద్భుత స్పందన రావడం పట్ల కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఫిట్‌నెస్‌పై ఈ తరహా ప్రచారం అందరిలో ఆసక్తి రేపుతోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వీడియోలు పంపిస్తున్నారు’ అని రాథోడ్ అన్నారు.
‘మనందరి ఫిట్‌నెస్ దేశం ఫిట్‌నెస్’ అంటూ ఇటీవల తాను పుషప్స్ తీస్తున్న వీడియోను రాథోడ్ ట్విట్టర్‌లో పెట్టి... భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లి, బ్యాడ్మింటన్ స్టార్ సైనా, బాలీవుడ్ హీరో హృతిక్‌లకు సవాల్ విసిరారు. దీంతో వారంతా తమ కసరత్తుల వీడియోలను పోస్ట్ చేశారు.