
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పేరు మారింది. ఇక నుంచి ‘సాయ్’ను ‘స్పోర్ట్స్ ఇండియా’గా పిలవనున్నారు. న్యూఢిల్లీలో జరిగిన ‘సాయ్’ 50వ సర్వసభ్య సమావేశం అనంతరం ఈ కొత్త పేరును కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెల్లడించారు. ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) నుంచి అథారిటీ పదాన్ని తొలగించాం.
అది ఇప్పుడు స్పోర్ట్స్ ఇండియా (ఎస్‌ఐ)గా మారింది’ అని రాథోడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘సాయ్’ని 1984లో స్థాపించారు. 50వ సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుతో పాటు పలు కీలక నిర్ణయాలనూ తీసుకున్నారు. అథ్లెట్లకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించేందుకు మెస్ చార్జీలను పెంచారు. పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసేందుకు ప్రొఫెషనల్స్‌ను రంగంలోకి దించాలని ఎస్‌ఐ యోచిస్తోంది.