న్యూఢిల్లీ: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తనపై వచ్చిన ఆరోపణలకు ట్విట్టర్ లో్ వివరణ ఇచ్చుకున్నారు. మహిళా జర్నలిస్టులు రిపోర్టర్లుగా బయటికి వెళ్ళకుండా , కార్యాలయంలోనే వివిధ రంగాల్లో ఇంకా బాగా పనిచేయొచ్చన్నమంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. దీంతో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ రాజ్యవర్ధన్ ట్వీట్ చేశారు.
జర్నలిస్టుల భద్రత, రక్షణ,వారు పనిచేసే పరిస్థితులు,పనిగంటలు, ఒక తల్లిగా, ఒక సోదరిగా, భార్యగా ఆమె బాధ్యతలను దృష్టిలో పెట్టుకొనే అలా మాట్లాడానే తప్ప అసలు వారు బయటికి వెళ్ళకూడదు అనేది తన ఉద్దేశం కాదన్నారు. మహిళలంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. అంతేకాదు తన భార్య ఒక మాజీ సైనికురాలని, పార్లమెంట్ పై దాడి సందర్భంగా జరిగిన పోరాటంలో ఆమె కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు.
Controversy over Minister Rajyavardhan Rathore's Remarks on Women Journalists
నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు - రాజ్యవర్ధన్
Published Sat, Feb 14 2015 12:20 PM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement