తక్కువ పర్యవేక్షణ, ఎక్కువ పాలన: రాజ్యవర్థన్
న్యూఢిల్లీ: తక్కువ పర్యవేక్షణ ఎక్కువ పాలన ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని కేంద్ర సమాచార శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ అన్నారు. నవంబర్ 9 తేదిన జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం రాజ్ వర్ధన్ రాథోడ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. సమర్ధవంతమైన పాలన అందించడానికి ప్రధాని కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన తెలిపారు.
షూటర్ గా క్రీడాజీవితం ప్రారంభించిన 44 ఏళ్ల రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ భారత సైన్యాధికారి పదవికి స్వచ్ఛంద విరమణ ప్రకటించి 2013లో బీజేపీ చేరారు. 2014 సాధారణ ఎన్నికల్లో రాజస్థాన్ లోని జైపూర్ రూరల్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మొదటిసారిగా ఎంపీగా ఎన్నికైన ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టారు.