సాక్షి, న్యూఢిల్లీ: వైమానిక దాడులపై కట్టుకథలతో బీజేపీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులకు ఆధారాలు చూపించాలన్న కాంగ్రెస్ సీనియర్‌నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యలపై కేంద్ర సమాచారమంత్రిత్వ శాఖమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తీవ్రంగా స్పందించారు. భారత వైమానిక దళం జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసేందో లేదో తెలియాలంటే పాకిస్తాన్‌లోని బాలాకోట్‌కు వెళ్లిచూడండి అని ఘాటుగా బదులిచ్చారు. దీనిపై వారిద్దరి మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం సాగింది.
‘‘గత పార్లమెంట ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని కాంగ్రెస్ నేతలు బ్రిటన్ వెళ్లి అక్కడ ఆధారాలు ఉన్నాయంటూ తమపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా బాలాకోట్ వెళ్లి పరిశీలించి దాడులు జరిగాయో లేదో చెప్పండి. అక్కడే సరైన ఆధారాలు దొరుకుతాయి’’ అని రాథోడ్ సమాధానమిచ్చారు. బాలాకోట్ దాడులకు సరైన అధారాలు లేవని అంతర్జాతీయ మీడియా చేస్తున్న ప్రచారం మీకు (కాంగ్రెస్) చాలా ఆనందాన్ని కలిగిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత సైన్యంపై కంటే విదేశీ మీడియాపైనే కాంగ్రెస్‌కు ఎక్కువ నమ్మకమని అన్నారు. కాగా వైమానిక దళ దాడులపై అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరగుతోంది. బాలాకోట్ దాడులపై న్యూయార్స్ టైమ్స్, వాషింగ్టన్ డీసీ ప్రచురించిన కథనాలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని కపిల్ సిబాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Kapil Sibal ji:
You believe international media over own Intelligence agencies?
You seem happy when media quoted by you says “no losses in strike”?
..and sir, for us you went to london🤦🏽♂️ to find evidence against EVMs, will you please also go to Balakot to check? https://t.co/JefbNnGdqP
— Rajyavardhan Rathore (@Ra_THORe) 5 March 2019
Comments
Please login to add a commentAdd a comment