
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాశ్మీర్‌లో పాకిస్తాన్ తమ దాడులను ఆపకపోతే మరిన్ని సర్జికల్ దాడులు చేస్తామని హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. తాము దాడులను సహించబోమని సర్జికల్ స్ట్రైక్స్ నిరూపించాయి. పాక్ నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్తులో మరిన్ని దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.
గోవాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడానికి వెళ్లిన అమిత్ షా ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హయాంలో సర్జికల్ స్ట్రైక్ ఓ చారిత్రాత్మక ఘటన. దాని ద్వారా భారత సరిహద్దులను ఎవరూ చెరపాలన్న చూసిన వారికి ఇదే గతి పడుతుందని తెలిసేలా చేశాం. గతంలో చర్చించే వాళ్లం, కానీ ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీసే సమయమని’ షా అన్నారు.
కాగా భారత్‌లో ఉరీ, పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా 2016 సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌లో భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో అనేక ఉగ్రవాద శిబిరాలను భారత సైనికులు ధ్వంసం చేశారు. ఉరీ దాడి జరిగిన 11 రోజుల తర్వాత 2016 సెప్టెంబర్ 29 న సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.
చదవండి: Birth Day Celebrations : కళ్లు చెదిరే వేడుక..ఇలా కూడా చేస్తారా?
Comments
Please login to add a commentAdd a comment