
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం అనుమతిస్తే మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ దనోవ్ గురువారం ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 85వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగించారు. మరోదఫా సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే ఐఏఎఫ్ పూర్తిస్థాయిలో భాగం పంచుకుంటుందని ఆయన తెలిపారు. ఎటువంటి పోరాటంలో పాల్గొనేందుకైనా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విభాగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని.. ఆయన ప్రకటించారు.