'ఈగో దెబ్బతింటుందని పాక్ అలా చేస్తోంది'
జమ్మూ: తన అహంకారం సంతృప్తి చెందేందుకే భారత్ సర్జికల్ దాడులు నిర్వహించలేదని పాకిస్థాన్ అబద్ధం చెబుతోందని బీజేపీ ఆరోపించింది. పాక్ ఆర్మీ ఎప్పుడూ ఈగోతోనే ఉంటుందని, దానికి అహంకారం తక్కువ చేసుకోవడం ఇష్టం ఉండదని పేర్కొంది.అసలు భారత్ తమ ప్రాంతంలో ఎలాంటి సర్జికల్ దాడులు నిర్వహించలేదని పాక్ ఆరోపించడంపై జమ్మూలోని బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్ గుప్తా ఖండిస్తూ..
'భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ దాడులను అంగీకరించపోవడం వెనుక వాస్తవం ఏమిటంటే పాక్ ప్రభుత్వం, పాక్ ఆర్మీ తమ అహంకారంను ఎప్పుడూ తక్కువకానివ్వవు. వారి అహంకారం దెబ్బతింటుందనే ఇలా చేస్తున్నారు. ఇక ఆ దేశ ఆర్మీ అధికారి దిగిపోతున్న ఈ సమయంలో ఇలాంటిని అస్సలు అంగీకరించకదు' అని మండిపడ్డారు. ఈ సందర్భంగా భారత ఆర్మీని తక్కువ చేసేలా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై, కశ్మీర్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.