
'మెరుపుదాడులను రాజకీయం చేయడం సరికాదు'
ఉగ్రముకలపై ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ పై రాజకీయం చేయడం సరికాదని అమిష్ షా అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ : పాక్ అక్రమిత కశ్మీర్లోని ఉగ్రముకలపై ఆర్మీ నిర్వహించిన మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రైక్స్)పై రాజకీయం చేయడం సరికాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిష్ షా అభిప్రాయపడ్డారు. కొంతమంది అనవసరంగా ఈ అంశాన్ని వివాదం చేస్తున్నారని పేర్కొన్నారు.
శుక్రవారం న్యూఢిల్లీలో అమిత్ షా మాట్లాడుతూ... భారత ఆర్మీని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అవమానించారని చెప్పారు. రాహుల్ వ్యాఖ్యలు భద్రతా దళాల స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. మెరుపు దాడలుపై ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని... మన ఆర్మీ శక్తి సామర్థ్యాలు ఏమిటో అందరికీ తెలుసు అని అమిత్ షా వెల్లడించారు. ఈ దాడులపై దేశమంతా హర్షిస్తోందని అమిత్ షా తెలిపారు.