దేశానికి లోపలి నుంచే ముప్పు! | India has threat from internal forces, not from pak of china, says shiv shankar menon | Sakshi
Sakshi News home page

దేశానికి లోపలి నుంచే ముప్పు!

Oct 14 2016 8:31 AM | Updated on Sep 4 2017 5:12 PM

దేశానికి లోపలి నుంచే ముప్పు!

దేశానికి లోపలి నుంచే ముప్పు!

భారతదేశానికి ముప్పు పొంచి ఉన్నది లోపలి నుంచే తప్ప పాకిస్థాన్, చైనా లాంటి ఇతర దేశాల నుంచి కాదని మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ అన్నారు.

భారతదేశానికి ముప్పు పొంచి ఉన్నది లోపలి నుంచే తప్ప పాకిస్థాన్, చైనా లాంటి ఇతర దేశాల నుంచి కాదని మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ అన్నారు. ఆ రెండు దేశాల వల్ల భారతదేశానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో ఆయన ఎన్ఎస్ఏగా ఉన్నారు. జాతీయ భద్రతకు అసలైన ముప్పు దేశం లోపలి నుంచే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 1950లలో అయితే బయటినుంచి ముప్పు ఉండేదని, 60లలో చివరి వరకు కూడా అంతర్గతంగా వేర్పాటువాదులతో ముప్పు ఉంది గానీ ఎక్కువ కాలం కాదని తెలిపారు. ప్రస్తుతం దేశంలో వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ఇవన్నీ క్రమంగా తగ్గుతున్నాయని చెప్పారు. 2012 తర్వాతి నుంచి మతఘర్షణలు, సామాజిక హింస, అంతర్గత హింస చాలా ఎక్కువైపోయాయని, వీటిని తక్షణం అరికట్టాలని మీనన్ సూచించారు.

ఇది సంప్రదాయ శాంతిభద్రతల సమస్య కాదని.. దీన్ని ఎలా అరికట్టాలో ప్రభుత్వానికి, పోలీసులకు కూడా బాగా తెలుసని శివశంకర్ మీనన్ అన్నారు. మహిళలపై హింస, వర్గాల మధ్య ఘర్షణ, కులాల కుమ్ములాటలు... ఇలాంటివన్నీ సామాజిక, ఆర్థిక మార్పుల వల్లే వస్తున్నాయని, పట్టణీకరణ కూడా ఇందుకు సగం కారణమని ఆయన విశ్లేషించారు. వీటివల్ల దీర్ఘకాలంలో చాలా సమస్య తలెత్తుతుందని చెప్పారు. భారతదేశం చాలా మారిందని, ఇది చాలా సమాజాల్లో సాధారణమే అయినా, మార్పు వల్ల తలెత్తే దుష్పరిణామాలను సక్రమంగా అరికట్టాలని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement