ఔను! ఆ అణుబాంబే ఇలా మారిపోయాడు! | Pakistani ChaiWala new makeover | Sakshi
Sakshi News home page

ఔను! ఆ అణుబాంబే ఇలా మారిపోయాడు!

Published Thu, Oct 27 2016 12:36 PM | Last Updated on Wed, Apr 3 2019 4:43 PM

ఔను! ఆ అణుబాంబే ఇలా మారిపోయాడు! - Sakshi

ఔను! ఆ అణుబాంబే ఇలా మారిపోయాడు!

నిన్నమొన్నటివరకు ఇస్లామాబాద్‌లో ఓ మారుమూల చాయ్‌ అమ్ముకున్న నీలి కళ్ల కుర్రాడు.. ఇప్పుడు పాకిస్థాన్‌ టాప్‌ మోడల్‌గా హల్‌చల్‌ చేస్తున్నాడు. నీలికళ్ల 'చాయ్‌వాలా' అర్షద్‌ ఖాన్‌ సోషల్‌ మీడియా దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. నిన్న ట్రెండింగ్‌ అయిన అతడు.. నేడు ట్రెండీగా సరికొత్త అవతారంలో మోడల్స్‌తో కలిసి ర్యాంప్‌వాక్‌ చేస్తున్నాడు.

తాజాగా అర్షద్‌ ఖాన్‌ పాకిస్థాన్‌లోనే పాపులర్‌ టాక్‌ షో ’గుడ్‌మార్నింగ్‌ పాకిస్థాన్‌’ లో కనిపించాడు. ఏఆర్‌వై చానెల్‌లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో సరికొత్త మేకోవర్‌తో మోస్ట్‌ స్టైలిష్‌ లుక్‌తో అదరగొట్టాడు. అతని ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి.  

ఇస్లామాబాద్‌లోని ఇత్వార్‌ బజార్‌లో చాయ్‌ అమ్ముతూ జీవనం సాగించిన అర్షద్‌ ఖాన్‌ అదృష్టం కొన్నిరోజుల కిందట అనూహ్యంగా మారిపోయిన సంగతి తెలిసిందే. నీలికళ్ల ఓరచూపుతో చాయ్‌ కాస్తున్న అతని ఫొటో సోషల్‌ మీడియాలో దర్శనమివ్వడంతో అతను ఒక్కసారిగా ట్విట్టర్‌లో ట్రెండ్‌ అయ్యాడు. భారత్‌ చేసిన సర్జికల్‌ దాడులకు పాకిస్థాన్‌ సమాధానం ఇదిగో అంటూ దాయాది దేశపు నెటిజన్లు అతని ఫొటోను విపరీతంగా షేర్‌ చేసుకున్నారు. భారత్‌పై పాకిస్థాన్‌ ‘అణుబాంబ్‌’ ఇతనేనంటూ.. ఈ నీలికళ్ల కుర్రాడు భారతీయ అమ్మాయిలపై సర్జికల్‌ దాడులు చేస్తాడని వ్యాఖ్యానించారు. దీంతో అర్షద్‌ ఖాన్‌ దశ తిరిగిపోయి.. ఫిటిఇన్‌.పీకే ఫ్యాషన్‌ దుస్తుల బ్రాండ్‌కు మోడలింగ్‌ చేసే అవకాశం అతన్ని వరించింది.




Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement