Nuclear weapon
-
మన అణ్వస్త్ర విధానం మారొచ్చు
జైపూర్/న్యూఢిల్లీ: సరిహద్దులో పాక్ కయ్యానికి కాలు దువ్వుతున్నవేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మొదటగా అణ్వాయుధాలను ప్రయోగించరాదు’అన్న విధానానికే భారత్ కట్టుబడి ఉందనీ, అయితే భవిష్యత్‌లో ఎదురయ్యే పరిస్థితుల దృష్ట్యా ఇది మారవచ్చని పరోక్షంగా పాక్‌ను హెచ్చరించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్(1974, 1998 అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతం)ను రాజ్‌నాథ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘భారత్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చాలన్న అటల్‌బిహారీ వాజ్‌పేయి దృఢసంకల్పానికి ఈ ప్రాంతం ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. అణ్వస్త్రాలను ఇతరులపై మొదటగా ప్రయోగించరాదన్న సిద్ధాంతానికి భారత్ ఇప్పటికీ గట్టిగా కట్టుబడింది. కానీ భవిష్యత్‌లో ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఇది మారొచ్చు’అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వాజ్‌పేయి వర్థంతి సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు నివాళులు అర్పించారు. ‘భారత్ బాధ్యతాయుతమైన అణ్వస్త్రశక్తిగా మారడం ప్రజలందరికీ గర్వకారణమే. ఇందుకు భారత్ అటల్జీకి రుణపడి ఉంటుంది’అని ట్వీట్ చేశారు. మరోవైపు రాజ్‌నాథ్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. అణ్వాయుధాల ప్రయోగంపై కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను బయటపెట్టాలనీ, ఈ అస్పష్టతకు తెరదించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం వెనుక దేశమంతా నిలబడుతుందనీ, అయితే ముందుగా మన అణు విధానంపై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరింది. -
ఔను! ఆ అణుబాంబే ఇలా మారిపోయాడు!
నిన్నమొన్నటివరకు ఇస్లామాబాద్‌లో ఓ మారుమూల చాయ్ అమ్ముకున్న నీలి కళ్ల కుర్రాడు.. ఇప్పుడు పాకిస్థాన్ టాప్ మోడల్‌గా హల్చల్ చేస్తున్నాడు. నీలికళ్ల 'చాయ్‌వాలా' అర్షద్ ఖాన్ సోషల్ మీడియా దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. నిన్న ట్రెండింగ్ అయిన అతడు.. నేడు ట్రెండీగా సరికొత్త అవతారంలో మోడల్స్‌తో కలిసి ర్యాంప్‌వాక్ చేస్తున్నాడు. తాజాగా అర్షద్ ఖాన్ పాకిస్థాన్‌లోనే పాపులర్ టాక్ షో ’గుడ్‌మార్నింగ్ పాకిస్థాన్’ లో కనిపించాడు. ఏఆర్వై చానెల్లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో సరికొత్త మేకోవర్‌తో మోస్ట్ స్టైలిష్ లుక్‌తో అదరగొట్టాడు. అతని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇస్లామాబాద్‌లోని ఇత్వార్ బజార్లో చాయ్ అమ్ముతూ జీవనం సాగించిన అర్షద్ ఖాన్ అదృష్టం కొన్నిరోజుల కిందట అనూహ్యంగా మారిపోయిన సంగతి తెలిసిందే. నీలికళ్ల ఓరచూపుతో చాయ్ కాస్తున్న అతని ఫొటో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో అతను ఒక్కసారిగా ట్విట్టర్లో ట్రెండ్ అయ్యాడు. భారత్ చేసిన సర్జికల్ దాడులకు పాకిస్థాన్ సమాధానం ఇదిగో అంటూ దాయాది దేశపు నెటిజన్లు అతని ఫొటోను విపరీతంగా షేర్ చేసుకున్నారు. భారత్‌పై పాకిస్థాన్ ‘అణుబాంబ్’ ఇతనేనంటూ.. ఈ నీలికళ్ల కుర్రాడు భారతీయ అమ్మాయిలపై సర్జికల్ దాడులు చేస్తాడని వ్యాఖ్యానించారు. దీంతో అర్షద్ ఖాన్ దశ తిరిగిపోయి.. ఫిటిఇన్.పీకే ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్‌కు మోడలింగ్ చేసే అవకాశం అతన్ని వరించింది. -
భారత్‌పై పాక్ 'అణుబాంబు' అతడేనట!
న్యూఢిల్లీ: ఇస్లామాబాద్‌కు చెందిన ఓ చాయ్‌వాలా అన్యూహంగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాడు. నీలికళ్లతో ఉన్న అతన్ని పాకిస్థాన్ అణ్వాయుధమని ఆ దేశ నెటిజన్లు నెత్తికెక్కించుకుంటున్నారు. పాకిస్థాన్‌లో భారత్ సర్జికల్ దాడులకు ప్రతీకారంగా ఈ నీలికళ్ల కుర్రాడు భారతీయ అమ్మాయిలపై సర్జికల్ దాడులు చేస్తాడని, దెబ్బకు ఇరుదేశాల మధ్య సమీకరణాలు సమానం అయిపోతాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. చాయ్ అమ్ముతున్న ఈ నీలికళ్ల వ్యక్తి ఫొటోను జావేరియా లేదా జియా అలీ అనే ఫొటోగ్రాఫర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. ఈ ఫొటో వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. రెండు నెలల కిందట జరిగిన ఫొటోవాక్‌లో భాగంగా ఇస్లామాబాద్‌లోని ఇత్వార్ బజార్ ప్రాంతంలో ఈ ఫొటో తీశానని, దానిని ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అనూహ్యమైన స్పందన వస్తున్నదని జియా అలీ మీడియాతో ఆనందం వ్యక్తం చేసింది. చాయ్‌వాలా (#ChaiWala) హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఫొటో ట్విట్టర్ పాకిస్థాన్ ట్రెండింగ్‌లో టాప్ స్థానంలో నిలిచింది. ఇండియన్ కాఫీ వాలా (కరణ్ జోహార్) కంటే పాక్ చాయ్‌వాలా బెటర్ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇన్నాళ్లు ఇరుదేశాల మధ్య ఉన్న ఘర్షణలే సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అంశాలుగా ఉండగా.. అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన ఈ పాక్ అణుబాంబు చాయ్‌వాలా.. ఒక్కసారిగా వాతావరణాన్ని సరదాగా మార్చేశాడు. ఈ ఫొటోపై భారతీయ నెటిజన్లు కూడా సరదా వ్యాఖ్యలతో హోరెత్తిస్తున్నారు. -
అణ్వాయుధ పరీక్షలను ఇట్టే పట్టేస్తుంది!
వాషింగ్టన్: ఇటీవల ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అంతర్జాతీయంగా భూప్రకంపనలను కొలిచే సమగ్ర అణ్వాయుధ పరీక్షల నిరోధ ఒప్పంద సంస్థ (సీటీబీటీవో) కొరియా దుందుడుకు చర్యను అందరికంటే ముందే ప్రపంచానికి వెల్లడించింది. అప్పటివరకు ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించినట్టు ప్రపంచానికి తెలియలేదు. అయితే, సీటీబీటీవో పెద్ద ఎత్తున జరిగే అణు పరీక్షలను మాత్రమే గుర్తించగలదు. మరీ ఉగ్రవాదులు, ప్రభుత్వేతర శక్తులు చిన్నస్థాయిలో చేపట్టే అణ్వాయుధ పరీక్షలను గుర్తించేది ఎలా? అంటే.. అందుకు సమాధానంగా తాజాగా శాస్త్రవేత్తలు ఓ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. ఉగ్రవాదులు, ప్రభుత్వేతర శక్తులు అక్రమంగా నిర్వహించే చిన్నపాటి అణ్వాయుధ పరీక్షలను సైతం ఈ సాఫ్ట్ వేర్ గుర్తిస్తుంది. ఏ అణ్వాయుధ పరీక్ష కూడా ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా జరుగకూడదన్న సీటీబీటీవో పిలుపునకు అనుగుణంగా అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎరిక్ సడర్త్ ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారు. వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ సీస్ మిక్ అనలసిస్ (విసా) పేరిట రూపొందించిన ఈ సాఫ్ట్ వేర్ గుర్తించడానికి వీలులేకుండా చిన్నస్థాయిలో జరిగే అణ్వాయుధ పరీక్షలను సైతం గుర్తిస్తుంది. -
ఐదో అణ్వాయుధ శక్తిగా పాక్!
వాషింగ్టన్: శరవేగంగా అణ్వాయుధ సంపదను పోగుచేసుకుంటున్న పొరుగుదేశం పాకిస్థాన్.. 2025నాటికి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద అణ్వాయుధ శక్తిగా మారనుంది. భారత్ దాడులను ఎదుర్కొనేందుకే తాము స్వల్పశ్రేణి అణ్వాయుధాలు అభివృద్ధి చేసినట్టు పాకిస్థాన్ బుధవారం ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అత్యున్నత మేధోసంస్థ ఒకటి ఈ విషయాన్ని తెలియజేసింది. 'పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం 110 నుంచి 130 వరకు అణ్వాయుధాలు నిల్వ ఉన్నాయి. 2011లో ఆ దేశం వద్దనున్న అణ్వాయుధాలు సంఖ్య 90 కాగా, ప్రస్తుతం 110కి చేరింది. పస్తుతం మరికొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి. ప్లుటోనియంను ఉత్పత్తి చేసే నాలుగు రియాకర్లు, యూరేనియం కర్మాగారాలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న పదేండ్లలో పాకిస్థాన్ అణ్వాయుధ నిల్వ గణనీయంగా పెరుగనుంది. అయితే, ఈ పెరుగదల ఏ స్థాయిలో ఉంటుందనేది చాలావాటిపై ఆధారపడి ఉంది' అని ఆ సంస్థ పేర్కొంది. 'పాకిస్థాన్ న్యూక్లియర్ ఫోర్సెస్ 2015' పేరిట హాన్స్ ఎం క్రిస్టన్సన్, రాబర్ట్ ఎస్ నొరిస్ ఈ నివేదిక రూపొందించారు. పాకిస్థాన్ పది స్వల్పశ్రేణి వ్యూహాత్మక అణ్వాయుధాలను అభివృద్ధి చేసిందని నివేదిక పేర్కొంది. భారత్ భూమార్గం ద్వారా యుద్ధానికి పాల్పడితే ఈ అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పాకిస్థాన్ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఈ అణ్వాయుధాలలో ఒకదాని స్థాయి కేవలం 60 కిలోమీటర్లు మాత్రమే. ఈ అణ్వాయుధం ఉద్దేశం భారత్‌లోని నగరాలను, మిలిటరీ స్థావరాలను బెదిరించడానికే కాదు.. ఇది యుద్ధంలో వినియోగించడానికి ఉద్దేశించినది. పాక్‌పై భారత్ దాడిని ఎదుర్కొనేందుకు అది దీనిని ఉపయోగించవచ్చు' అని ఎం క్రిస్టన్సన్ మీడియాకు తెలిపారు.