'మేం కూడా భారత్తోపాటే.. దాడి కరెక్టే' | Germany backs India's strikes | Sakshi
Sakshi News home page

'మేం కూడా భారత్తోపాటే.. దాడి కరెక్టే'

Published Thu, Oct 6 2016 9:06 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

'మేం కూడా భారత్తోపాటే.. దాడి కరెక్టే'

'మేం కూడా భారత్తోపాటే.. దాడి కరెక్టే'

భారత్ నిర్వహించిన సర్జికల్ దాడులను మరో దేశం జర్మనీ కూడా సమర్థించింది. ప్రతి దేశానికి ఉగ్రవాదం నుంచి తన భూభాగాన్ని రక్షించుకునే హక్కు ఉందని పేర్కొంది.

న్యూఢిల్లీ: భారత్ నిర్వహించిన సర్జికల్ దాడులను మరో దేశం జర్మనీ కూడా సమర్థించింది. ప్రతి దేశానికి ఉగ్రవాదం నుంచి తన భూభాగాన్ని రక్షించుకునే హక్కు ఉందని పేర్కొంది. అది ఎలాంటి ఉగ్రవాదం అయినా, స్థానికమైనదైనా, అంతర్జాతయంగా ఉన్న ఉగ్రవాదమైన తన భూభాగానికి హాని కలిగిస్తే అడ్డుకునే హక్కు, దాడి చేసే హక్కు భారత్కు ఉందని స్పష్టం చేసింది. పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి భారత్ సర్జికల్ దాడులు నిర్వహించడంపై మీ అభిప్రాయం ఏమిటని జర్మనీ రాయబారి మార్టిన్ నేను ప్రశ్నించగా 'సరిహద్దు పరిధిలో ఉగ్రవాదం గురించి నేను రెండు విషయాలను స్పష్టంగా చెప్పొచ్చు.

ఏదేశమైనా తమ భూభాగం నుంచి మరో దేశంలోకి ఉగ్రవాదాన్ని ప్రవేశించనివ్వబోమని కచ్చితంగా హామీ ఇవ్వడం మొదటి అంశమైతే.. ఎలాంటి ఉగ్రవాదమైనా తమకు హానీ తలపెట్టినప్పుడు దానిని నుంచి తన మాతృభూమిని రక్షించుకునే హక్కు ఆ దేశానికి ఉంది' అని స్పష్టం చేశారు. ఈ రెండు కేవలం నోటి మాటలు కావని, అంతర్జాతీయ న్యాయ సమాజం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందని అన్నారు. ఉగ్రవాదం విషయంలో భారత్ తో తమకు వ్యూహాత్మక ఒప్పందం ఉందని, దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, తమ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ సంతకాలు కూడా చేశారని అన్నారు. భారత్ ఉన్న సంబంధం కేవలం మాటల్లోది కాదని, చాలా దృఢమైన సంబంధమని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తాము కూడా భారత్ తో కదులుతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement