
సాక్షి, హైదరాబాద్ : అప్పుల బాధ తాళలేక ప్రాణాలు తీసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో ఓ వ్యాపారి చెప్పాడు. ఎవరెవరికి ఎంత బాకీ చెల్లించాల్సి ఉందో చీటిలో రాసిపెట్టానని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారి రాయపాటి నరసింహన్ తెలిపారు. నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొందరు వ్యక్తుల మోసం వల్లే తీవ్రంగా నష్టపోయినట్టు వెల్లడించాడు. లిస్టులో ఉన్నవారందరికీ ఇప్పటికే రెండింతల వడ్డీలు కట్టానని తెలిపాడు. ఇంటికొస్తున్నానని చెప్పి మోసం చేసినందుకు క్షమించాలని కోరాడు. ఇంటికి తిరిగి రావాలని అనుకున్నా.. తనవల్ల కావడం లేదని పేర్కొన్నాడు. ఇక ఆలస్యం చేయడం తనవల్ల కావడం లేదని, తనకు చావే శరణ్యమని రోదించాడు. కాగా, తన భర్త ఐదు రోజులుగా కనిపించడం లేదని నరసింహన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని సెల్ఫీ వీడియో బయటకు రావడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment