షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ యోగి తనను చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని షార్ట్‌ఫిల్మ్ నటి హారిక చెప్పింది. తప్పు చేసిన వ్యక్తిని ఓ డీసీపీ బూటుతో తంతే తప్పేముందని, పోలీసులముందే తనను యోగి బూతు మాటలు అంటుంటే తన్నారని అన్నారు. అదే దుబాయ్‌లో అయితే కాలో చేయో తీస్తారని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదంటూ యోగి పోలీసులకు కొన్ని వాట్సాప్ మెసేజ్‌లను పంపించడంపై ఆమె స్పందిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తాజాగా మీడియాకు పంపించింది.