ప్రస్తుతం యువతలో సెల్ఫీ పిచ్చి పీక్ స్టేజ్‌కి వెళ్లిపోతోంది. సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం అత్యంత ప్రమాదకరమైనరీతిలో సెల్ఫీలు తీసుకోవడానికి యువత వెనుకాడటం లేదు. ఎత్తైన ప్రదేశాలు, వేగంగా వస్తున్న రైళ్ల ముందు సైతం సెల్ఫీలు దిగుతున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు విడుస్తున్నారు. సెల్ఫీ మరణాలు ఎన్ని చోటుచేసుకున్నా.. యువతలో అప్రమత్తత రావడం లేదు. అవగాహన పెరగడం లేదు.