
సాక్షి,నిజామాబాద్ జిల్లా: రైలు కిందపడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ మధ్య రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
మృతులు పోతంగల్ మండలం హెగ్డోలి వాసులు అనిల్ (28), శైలజ (24)గా పోలీసులు గుర్తించారు. బంధువుల దుష్ప్రచారం భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తెలిపారు. వీరికి ఏడాదిన్నర క్రితం పెళ్లయింది.
ఈ వీడియోను ఆత్మహత్యకు ముందు కోటగిరి ఎస్.ఐ సందీప్‌కి పంపారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా మిట్టాపుర్ శివారులో రైల్వే ట్రాక్‌పై దంపుతులిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్వ్యూ ఉందని ఇంట్లో చెప్పి బయటికొచ్చిన యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment