Navipet
-
బైక్‌తో రైలుకు ఎదురెళ్తుండగా..
నిజామాబాద్: కుటుంబ కలహాలు అతన్ని తీవ్ర నిర్ణయం తీసుకునేలా చేశాయి. బైకుతో సహా పట్టాలపై రైలుకు ఎదురెళ్లాడు. కాస్తుంటే అతనిప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. కానీ, అతని టైం బాగుంది. రైలు ఆగింది. ప్రాణాలతో బయటపడ్డాడు. నవీపేట మండల కేంద్రంలో రైలును ఢీకొనేందుకు ఒక యువకుడు బైక్‌పై ఎదురెళ్లిన సంఘటన కలకలం రేపింది. భీమ్‌గల్ మండల కేంద్రానికి చెందిన జగదీశ్ (34)కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. దుబాయ్ లో డ్రైవర్‌గా పనిచేసే జగదీశ్ అప్పుడప్పు డు స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నెల కిందట మకాంను నవీపేటకు మార్చాడు. ఈ వ్యవధిలో ఇద్దరి మధ్య కలహాలు పెరిగాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన జగదీశ్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. సాయినగర్ షిరిడీ–తిరుపతికి వెళ్లే వీక్లీ రైలును ఢీకొనాలని నిర్ణయించుకుని.. మండల కేంద్రంలోని రైలు పట్టాలపై బైక్‌పై ఎదురుగా వెళ్లాడు. ఇది గమనించిన గేట్‌మన్ కొద్ది దూరంలో ఉన్న మరో గేట్మన్కు సమాచారమివ్వగా గేట్ వేయలేదు. ఇది గమనించిన రైల్వే కో పైలట్ చాకచక్యంగా రైలును ఆపేశాడు. దీంతో జగదీశ్ ప్రాణాలతో బయటపడ్డాడు. జగదీశ్‌పై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
విషాదం: రైలు కిందపడి యువదంపతుల ఆత్మహత్య
సాక్షి,నిజామాబాద్ జిల్లా: రైలు కిందపడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ మధ్య రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పోతంగల్ మండలం హెగ్డోలి వాసులు అనిల్ (28), శైలజ (24)గా పోలీసులు గుర్తించారు. బంధువుల దుష్ప్రచారం భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తెలిపారు. వీరికి ఏడాదిన్నర క్రితం పెళ్లయింది.ఈ వీడియోను ఆత్మహత్యకు ముందు కోటగిరి ఎస్.ఐ సందీప్‌కి పంపారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా మిట్టాపుర్ శివారులో రైల్వే ట్రాక్‌పై దంపుతులిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్వ్యూ ఉందని ఇంట్లో చెప్పి బయటికొచ్చిన యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
45 ఏళ్ల వరుడు..13 ఏళ్ల వధువు.. బాలికను తీసుకుని పరార్
సాక్షి, నవీపేట (నిజామాబాద్ జిల్లా): జిల్లాలోని నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన అబ్బాపూర్ (బి) తండాలో ఓ తండ్రి రూ.60 వేలకు ఆశపడి 13 ఏళ్ల తన కూతురుకు బాల్య వివాహం జరిపించేశాడు. గ్రామానికి చెందిన కొంతమంది యువకులు బాలిక తండ్రిని నిలదీయడంతో అప్పటికే పెళ్లికొడుకు బాలికతో కలిసి పరారయ్యాడు. ఫకీరాబాద్ గ్రామానికి చెందిన మలావాత్ సాయెబ్‌రావ్ (45)కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అబ్బాపూర్ (బి) తండాకు చెందిన ఓ వ్యక్తి తన కూతుర్ని సాయెబ్రావ్కు ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకుగాను సాయెబ్‌రావ్ వద్ద నుంచి రూ.60 వేలను బాలిక తండ్రి తీసుకున్నాడు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఇరువురు బంధువుల సమక్షంలో బాలికకు పెళ్లి జరిపించేశారు. అయితే బాల్యవివాహం గురించి తెలుసుకున్న గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వెళ్లి బాలిక తండ్రిని, పెళ్లిపెద్దలను నిలదీయగా వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో ఆ యువకులు హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులకు, ఐసీడీఎస్‌కు సమాచారం ఇచ్చారు. ఈలోగా సాయెబ్‌రావ్ బాలికను తీసుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న డీసీపీవో చైతన్యకుమార్, చైల్డ్‌హెల్ప్‌లైన్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ జ్యోత్స్నదేవి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి గ్రామానికి వెళ్లి విచారించారు. బాలిక తండ్రి అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయెబ్రావ్తో పాటు పెళ్లికి సహకరించిన పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై జీపీ కార్యదర్శి షేక్ అహ్మద్ పాషా ఫిర్యాదు చేశారు. -
మహిళా దొంగల ముఠా హల్చల్
సాక్షి, బోధన్: నవీపేట బస్టాండ్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం మహిళా దొంగల ముఠా హల్చల్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పది మంది మహిళల ముఠా వీధుల్లో పూసలు అమ్ముతున్నట్లు నమ్మించి, బస్టాండ్‌లో తోటి ప్రయాణికులతో మాట కలిపారు. బస్టాండ్‌లోకి వచ్చి పోమే ప్రయాణికులను గమనిస్తూనే చుట్టు పక్కల ప్రయాణికులతో మాటామంతి చేశారు. నవీపేటకు చెందిన ఓ మహిళ రూ.3 లక్షల చీటీ డబ్బులను బ్యాగులో వేసుకుని నిజామాబాద్ బస్సు ఎక్కింది. గమనించిన ముఠా సభ్యులు బస్సులో ఎక్కే ప్రయత్నం చేస్తూనే బ్యాగును పట్టుకున్నారు. గమనించిన సదురు మహిళ అప్రమత్తం కావడంతో తోటి ప్రయాణికులు ముఠాను మందలించారు. బస్సులోంచి దింపేశారు. సంతృప్తి చెందని ముఠా సభ్యులు ఎలాగైన పని కానించాలని మళ్లీ బస్టాండ్‌కు వచ్చారు. అంతలోనే హోల్‌సేల్ బట్టల దుకాణంలో మునీమ్‌గా పని చేసే నారాయణ నవీపేటలో రూ.48 వేల కలెక్షన్ చేసుకుని తిరుగు ప్రయాణానికి బస్టాండ్‌కు వెళ్లాడు. ఇతనిని గమనించిన ముఠా సభ్యులు చాకచాక్యంగా రూ.48 వేల బ్యాగును కొట్టేశారు. ఆ బ్యాగుతో ఇద్దరు మహిళలు ఆటోలో నిజామాబాద్ వైపు వెళ్లిపోయారు. గమనించిన బాధితుడు కేకలు వేస్తూ పరుగులు తీయగా రూ.10 వేలను కొద్ది దూరంలో పారేసి ఆటోలో వెళ్లిపోయారు. దీంతో స్థానికులు అనుమానాస్పదంగా ఉన్న మరో ఎనిమిది మంది మహిళలను నిలదీశారు. వారిని పోలీసులకు అప్పగించారు. బాధితుడు నారాయణ ఫిర్యాదు మేరకు అనుమానిత మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. -
దొరల రాజ్యం ఒక కట్టుకథ: సీపీ కార్తికేయ
సాక్షి, నిజామాబాద్ : దళితులను అవమానించిన కేసులో బీజేపీ మాజీ నాయకుడు భరత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. విలేకరులతో నిజామాబాద్ సీపీ కార్తికేయ మాట్లాడుతూ.. దొరల రాజ్యం సినిమా ఒక కట్టుకథ అని తేల్చారు. అక్రమంగా మొరం తరలిస్తున్నందుకే అభంగపట్నం దళితులు లక్ష్మణ్, రాజేశ్వర్లను భరత్ రెడ్డి అవమానించాడని పేర్కొన్నారు. విషయం బయటకు పొక్కేసరికి సినిమా షూటింగ్ అని కొత్త నాటకానికి తెరలేపాడని వెల్లడించారు. పోలీసులకు దొరక్కుండా హైదరాబాద్, జోగులాంబ, హంపి, కడప ప్రాంతాల్లో బాధితులను వెంట వేసుకొని తిప్పాడని వివరించారు. భరత్ రెడ్డిని కోర్టులో ప్రవేశ పెడతామని, మరింత విచారణ కోసం కస్టడీ కోరతామని తెలిపారు. అభంగపట్నంలో పికెటింగ్ కొనసాగిస్తామని, అవసరం అయితే మరింత పెంచుతామని సీపీ వెల్లడించారు. -
మేకల సంతలో రూ. కోటిన్నరకు పైగా క్రయవిక్రయాలు
నవీపేట : ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన నవీపేట మండల కేంద్రంలోని మేకల సంతలో శనివారం రూ. కోటిన్నరకు పైగా క్రయవిక్రయాలు జరిగాయి. నిజామాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించే ఊర పండగ, వివిధ గ్రామాలలో వన భోజనాల నేపథ్యంలో ఒక్కసారిగా మేకల కొనుగోళ్లకు గిరాకీ పెరిగింది. నిజామాబాద్‌తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో సరిహద్దు గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని జాల్నా, ముద్ఖేడ్, నాందేడ్, ధర్మాబాద్, పర్భణీ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఒక రోజు ముందురాత్రి వాహనాలలో మేకలను తీసుకువచ్చి బేరసారాలు ప్రారంభించారు. వచ్చే నెలలో శ్రావణ మాసం ఉండడంతో ఇంట్లో జరిగే శుభకార్యాల (మాంసాహార విందు)ను ఈ వారంలో నిర్వహించనున్నారు. దూర ప్రాంతాలకు మేకలను తీసుకుని వెళ్లే వారు ఆటోట్రాలీ వాలాలు అడిగినంత ఇచ్చుకోకతప్పలేదు. సంత ఆవరణలో స్థలం సరిపోక బస్టాండ్, ప్రభుత్వ పాఠశాలల ముందు మేకలను తీసుకుని వచ్చిన వాహనాలను నిలిపారు. ఆలస్యంగా వచ్చిన వ్యాపారులు రోడ్లపైనే క్రయవిక్రయాలు జరిపారు.దీంతో బాసర రోడ్డుపై ఉదయం కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. -
భోజనం వికటించి 50 మంది విద్యార్థినులకు అస్వస్థత
నవిపేట (నిజామాబాద్ జిల్లా) : నవిపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల్లో మధ్యాహ్న భోజనం వికటించడంతో 50 మంది విద్యార్థినులు గురువారం అస్వస్థతకు గురయ్యాయ్యారు. కలుషిత ఆహారం తినడంతో వాంతులు,విరేచనాలయ్యాయి. వీరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్య
నవీపేట (నిజామాబాద్) : కలిసి బతకాలనుకున్నారు.. పరిస్థితులు అనుకూలించలేదు. దాంతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు ఓ ప్రేమ జంట. చావులోనూ ఒకరి చేయి మరొకరు విడవద్దనుకున్నారేమో.. చున్నీతో ఇద్దరూ చేతులు కట్టుకొని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా సమీపంలోని గోదావరి నది వద్ద చోటుచేసుకుంది. శనివారం నదిలో రెండు మృతదేహాలు తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతుని(27) ఒంటిపై బ్లాక్ కలర్ టీషర్ట్, జీన్స్ ప్యాంట్ ఉంది. మృతురాలు(21) ఆరెంజ్ కలర్ చుడీదార్ వేసుకొని ఉంది. ఇద్దరి చేతులు చున్నీతో కట్టేసినట్లు ఉన్నాయి. ఈ సంఘటన జరిగి దాదాపు మూడు రోజులు కావస్తుండటంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు నచ్చకపోవడంతోనే ఈ ఆత్మహత్యలు జరిగి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణ రాష్ట్రం ఖాయం మంత్రి సుదర్శన్‌రెడ్డి
గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం వినూత్న పథకాలను రూపొందిస్తోందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంతో పాటు పొతంగల్, మిట్టాపూర్, నందిగామ, తడగామ గ్రామాలలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీపేటలోని రఘుపతిరెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనుకునే నిశ్చయంతోనే రుణ సదుపాయాన్ని పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధకారంలోకి వచ్చాక రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. సంఘాలలోని మహిళలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే మరిన్ని సేవలను పొందవచ్చన్నారు. మహిళలను సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సహించాలనే దృక్పథంతోనే రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. స్త్రీనిధి, బంగారుతల్లి పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులు తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మండలానికి రూ. 20 నుంచి రూ.30 లక్షలు ఇస్తామనే హామీ ఇచ్చారన్నారు. నిధులతో ఎంపిక చేసిన గ్రామాలలో భవనాలను నిర్మించుకోవాలన్నారు. స్త్రీనిధి సంక్షేమానికి వచ్చిన చెక్‌లను ఆయన మహిళా సంఘాల అధ్యక్షులకు ఆయన అందజేశారు. 18న బోధన్‌లో కృతజ్ఞత సభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక ఆగదని మంత్రి సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈనెల 18న బోధన్‌లో సభను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా జరిగే సభకు అన్నివర్గాల వారు హాజరు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కల్లు, మద్య పానాన్ని వీడి యువకులు ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని సాధించేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారీ, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, ఐకేపీ పీడీ వెంకటేశ్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉషారాణి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.