45 ఏళ్ల వరుడు..13 ఏళ్ల వధువు.. బాలికను తీసుకుని పరార్‌ | Child Marriage At Navipet: 43 Years old Man Marries Teen Girl | Sakshi
Sakshi News home page

45 ఏళ్ల వరుడు..13 ఏళ్ల వధువు.. గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి బాల్య వివాహం

Published Sun, Jul 9 2023 7:40 AM | Last Updated on Sun, Jul 9 2023 7:49 AM

Child Marriage At Navipet: 43 Years old Man Marries Teen Girl - Sakshi

సాక్షి, నవీపేట (నిజామాబాద్‌ జిల్లా): జిల్లా­లోని నవీపేట మండలం ఫకీరాబాద్‌ గ్రామానికి చెందిన అబ్బాపూర్‌ (బి) తండాలో ఓ తండ్రి రూ.60 వేలకు ఆశపడి 13 ఏళ్ల తన కూతురుకు బాల్య వివాహం జరిపించేశాడు. గ్రామా­నికి చెందిన కొంతమంది యువకులు బాలి­క తండ్రిని నిలదీయడంతో అప్పటికే పెళ్లికొ­డుకు బాలికతో కలిసి పరార­య్యాడు.  ఫకీరాబాద్‌ గ్రా­మా­నికి చెందిన మలావాత్‌ సాయెబ్‌­రావ్‌ (45)కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అబ్బా­పూర్‌ (బి) తండా­కు చెందిన ఓ వ్యక్తి తన కూతుర్ని సాయెబ్‌­రావ్‌కు ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు.

అందుకుగాను సాయెబ్‌రావ్‌ వద్ద నుంచి రూ.60 వేలను బాలిక తండ్రి తీసుకు­న్నాడు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఇరువురు బంధువుల సమక్షంలో బాలికకు పెళ్లి జరిపించేశారు. అయితే బాల్యవివాహం గురించి తెలుసుకున్న గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వెళ్లి బాలిక తండ్రిని, పెళ్లిపెద్దలను నిల­దీయగా వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో ఆ యువకులు హెల్ప్‌లైన్‌ ద్వారా పోలీసులకు, ఐసీడీఎస్‌కు సమాచారం ఇచ్చారు.

ఈలోగా సాయెబ్‌రావ్‌ బాలికను తీసుకుని పారిపో­యాడు. సమాచారం అందుకున్న డీసీపీవో చైతన్యకుమార్, చైల్డ్‌హెల్ప్‌­లైన్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ జ్యోత్స్నదేవి, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ భాగ్యలక్ష్మి గ్రామానికి వెళ్లి విచారించారు. బాలిక తండ్రి అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశా­రు. సాయెబ్‌రావ్‌తో పాటు పెళ్లికి సహకరించిన పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై జీపీ కార్యదర్శి షేక్‌ అహ్మద్‌ పాషా ఫిర్యాదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement