
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. తేజావత్ రామ్ సింగ్ తండాకు చెందిన బోడ సునీల్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. అదే క్రమంలో ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని.. తనకు ఉద్యోగం రాకపోవడంతో పురుగుల మందు తాగినట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు.
మార్చి 27న వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం వద్ద సునీల్ పురుగుల మందుతాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా... వెంటనే అతన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మార్చి 28 వ తేదీన నిమ్స్ కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ సునీల్ శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో సునీల్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment