un employee
-
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి..
ఖానాపూర్: ఓ నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి మోసం చేసిన ముగ్గురు యువకులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ శ్రీదర్‌గౌడ్ తెలిపారు. స్థానిక పోలీస్ ష్టేష న్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. జల్సాలకు అ లవాటు పడిన ముగ్గురు యువకులు మోసాలు చేసి డబ్బులు సంపాదించడం పనిగా పెట్టుకున్నారు. మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో ఆర్ఎంపీగా ప్రాక్టిస్ చేసే కొంపెల్లి నరేందర్, మరో వ్యక్తి కొంపెల్లి రవిలు మస్కాపూర్ గ్రామానికి చెందిన షారుఖ్ ఖాన్ అనే నిరుద్యోగికి మస్కా కొట్టి మూడు లక్షలు కాజేశారు. సాంఘిక సంక్షేమ శాఖలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి షారుఖ్ ఖాన్ వద్ద 2019లో రూ. 3 లక్షలు వసూలు చేశారు. ఇరువురూ చెరో లక్ష తీసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో జాయినింగ్ కోసం ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ తయారు చేసి ఇచ్చిన ఉట్నూర్‌కు చెందిన మరో యువకుడు జాడి మహెందర్‌కు మరో లక్ష ఇచ్చారు. రెండేళ్లుగా రేపు, మాపు అంటూ ఉద్యోగం పేరుతో కాలం వెల్లదీశారు. నిందితులు ఇచ్చిన జాయినింగ్ లెటర్ ఫేక్ అని కొద్ది నెలల క్రితం తేలడంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని షారుక్ ఇరువురిని కోరాడు. వారి నుండి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి ఈ నెల 18న పోలీస్ ష్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి ఉద్యోగం పేరుతో నిరుద్యోగిని మోసం చేశారు. ఇరువురి నుంచి పోలీసులు రూ. 40 వేలు రికవరీ చేశారు. శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. కేసు విచారణను త్వరగా ఛేదించి నిందితులను అనతి కాలంలోనే అరెస్టు చేసిన ఎస్ఐ రామునాయక్‌తో పాటు కానిస్టేబుళ్ళు, హోంగార్డును సీఐ అభినందించారు. -
కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి బోడ్ సునీల్ మృతి
-
'నాకు ఉద్యోగం రాలేదు.. అందుకే చనిపోతున్నా'
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. తేజావత్ రామ్ సింగ్ తండాకు చెందిన బోడ సునీల్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. అదే క్రమంలో ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని.. తనకు ఉద్యోగం రాకపోవడంతో పురుగుల మందు తాగినట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. మార్చి 27న వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం వద్ద సునీల్ పురుగుల మందుతాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా... వెంటనే అతన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మార్చి 28 వ తేదీన నిమ్స్ కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ సునీల్ శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో సునీల్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. -
ప్రభుత్వాల దిమ్మ తిరగాలి
(విజయవాడ) గాంధీనగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిమ్మ తిరిగేలా దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. 12 డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 2న చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెను బలపరుస్తూ కార్మిక సంఘాల జిల్లా సదస్సు తీర్మానం చేసింది. శుక్రవారం విజయవాడ స్థానిక హనుమంతరాయ గ్రంథాలయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న జరపతలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల సన్నాహక సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ కార్మికుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నాయని, కనీస వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సదస్సులో పాల్గొన్న వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సును దెబ్బతీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. కార్మికులు సమ్మె చేస్తే వారికి రూ. 6లక్షల వరకు జరిమానా విధించేలా చట్టాలను సవరించడం దుర్మార్గమన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 18వేలు కావాలని డిమాండ్ చేస్తే పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల నిజస్వరూపం బట్టబయలైందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు రెండేళ్లుగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. పైగా నిరుద్యోగులు వ్యవసాయం చేసుకుందామనుకుంటే భూములు లేకుండా గుంజుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల ఎకరాల భూమిని లాక్కø్కవడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. కార్మికులు, నిరుద్యోగులు చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకోవాలన్నారు. కార్మికుల సెస్సుతో సొంత ప్రచారమా..? ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు చలసాని రామారావు మాట్లాడుతూ భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి వసూలు చేస్తున్న సెస్సును చంద్రన్నబీమా పేరుతో సొంత ప్రచారానికి విచ్చలవిడిగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఆగస్టు 9న జిల్లా కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. ఈ సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, కె రామారావు (ఇఫ్టూ), మాదు శివరామకృష్ణ (వైఎస్సార్‌టీయూ) గర్రె వరప్రసాద్ (ఐఎన్టీయూసీ), పి ప్రసాద్ (ఇప్టూ), మీర్‌హుస్సేన్ (హెఎంఎస్), వెంకటసుబ్బయ్య, నరసింహారావు, ఎన్సీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చంద్రబాబును నమ్మి మోసపోయా
► తిరుపతిలో యువ న్యాయవాది ఆత్మహత్యాయత్నం తిరుపతి : ‘‘జాబు కావాలంటే బాబు రావాలి. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా. ఇంటికొక ఉద్యోగమిస్తా. ఉద్యోగం వచ్చేవరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తా’’ అని గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి మోసపోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. బాబు వచ్చాడు.. జాబు వస్తుందన్న ఆశతో రెండేళ్లుగా ఎదురుచూసి.. చూసి.. విసిగి వేసారిపోయిన తిరుపతికి చెందిన యువ న్యాయవాది పోతులూరి మాసుమయ్య అలియాస్ మాసుం ఇండియా(30) గురువారం మరుగుదొడ్లను శుభ్రం చేసే ‘హార్పిక్ ’ యాసిడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సందర్భంగా రాసిన సూసైడ్ నోట్లో బాబును నమ్మినందుకు తమ కుటుంబం పూర్తిగా నష్టపోయిందని పేర్కొన్నాడు. తమ కుటుంబంలో ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదని వాపోయాడు. ఒకపక్క చదువులకోసం అప్పులు చేసి, ఉద్యోగాలు రాక.. మరొకపక్క చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఏమీ చెయ్యలేని పరిస్థితిలో చనిపోతున్నానని పేర్కొన్నాడు. పూర్వాపరాలివీ... తిరుపతిలోని బాలాజీ కాలనీ, ఆంధ్రాబ్యాంక్ వద్ద నివాసముంటున్న పోతులూరి మాసుమయ్య అలియాస్ మాసుం ఇండియా(30) భార్య శ్రావణితోపాటు చెల్లెళ్లు రెడ్డిలక్ష్మి, సునీత, తమ్ముళ్లు సిద్ధయ్య, వెంకటరమణయ్య, చిన్నాన్న కుమార్తె రాధ, బావమరిది వెంకటేష్‌తో కలసి నివాసముంటున్నాడు. తమ కుటుంబసభ్యుల చదువులకోసం వడ్డీ వ్యాపారుల వద్ద రెండేళ్లక్రితం అప్పు చేశాడు. ఉద్యోగం వస్తే అప్పు తీర్చివేయవచ్చని భావించాడు. బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచారం నేపథ్యంలో ఉద్యోగంపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బాబు సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాల ఊసే లేకపోవడం.. నిరుద్యోగ భృతి కింద రూ.రెండువేలు ఇస్తామన్న హామీని సైతం తుంగంలో తొక్కేయడంతో మాసుమయ్య ఖిన్నుడయ్యాడు. అదే సమయంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడం, అవి చెల్లించలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి తీవ్రమవడంతో మనస్థాపానికి గురైన మాసుమయ్య గురువారం ఓ సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్యకు యత్నించాడు. ‘హార్పిక్ ’ యాసిడ్‌ను తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు మాసుమయ్యను రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు. బాబు మోసం చేశారు.. అధికారంలోకి వస్తే ఉద్యోగాలిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల్ని నిలువునా ముంచారంటూ బాధితుడు రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ‘‘బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి మోసం చేశారు. ఎక్కడా నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు. ఒకపక్క రైతుల ఆత్మహత్యలు, మరోపక్క నిరుద్యోగులు ఉన్నత చదువులు చదువుకొని ఏమిచేయాలో తెలియక దొంగలుగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ ఆకలికి అలమటిస్తూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దీన్ని చూసి నేనొక న్యాయవాదిగా తట్టుకోలేకపోతున్నాను. మా కుటుంబంలో సుమారు పదిమంది బీటెక్, బీఎస్సీ, బీఈడీ, బీఎస్సీ నర్సింగ్, ఎంబీఏ, ఎంఏ, ఎల్ఎల్బీ లాంటి ఉన్నత చదువులు చదువుకున్నారు. కానీ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ప్రైవేటు, కాంట్రాక్టు ఉద్యోగాల్లో సరైన జీతాల్లేవు. కనీసం పదివేల రూపాయలు కూడా ఇవ్వట్లేదు. ప్రభుత్వోద్యోగం ఉంటేనే ఏదైనా లోను ఇస్తామని బ్యాంక్‌వారు అంటున్నారు. చంద్రబాబును నమ్మినందుకు మా కుటుంబం పూర్తిగా నష్టపోయింది. ఒకపక్క చదువులకు అప్పులు చేసి ఉద్యోగాలు రాక, మరోపక్క వడ్డీలు కట్టలేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో చనిపోతున్నాను’’ అని మాసుమయ్య అందు లో తెలిపాడు. తాను గతంలో పలు ఉద్యమాలు చేశానని, రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు ప్రయత్నం కూడా చేశానని నోట్లో ఆయన గుర్తు చేశాడు. ‘జగనన్నా.. మీరైనా ఈ దేశాన్ని కాపాడండి. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు నివారించండి. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయించండి. ఉద్యోగ భద్రత కల్పించండి’ అని నోట్లో మాసుమయ్య విజ్ఞప్తి చేశాడు. -
నిరుద్యోగులకు రూ. వెయ్యి ఉద్యోగ భృతి