
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సుధాకర్
తీసిన వీడియోను వాట్సాప్ స్టేటస్‌లో అప్‌లోడ్ చేశాడు. గమనించిన స్నేహితులు ఎస్‌ఐ ధరణిబాబుకు సమాచారం అందించారు. వెంటనే కొండపైకి చేరుకున్న ఎస్‌ఐ.. అపస్మారక స్థితిలోని సుధాకర్‌ను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
ఉరవకొండ: ‘‘కులం చూడకుండా ఎవరూ ప్రేమించవద్దు.. అలాంటి ప్రేమను పెద్దలు ఒప్పుకోరు..’’ అంటూ వీడియో తీసుకుంటూ క్రిమిసంహారక మందు తాగి ఓ యువకుడు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విడపనకల్లుకు చెందిన బెస్త సుధాకర్ గత ఐదేళ్లుగా కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే ఓ అమ్మాయితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.
అయితే ప్రేమ విఫలమైందో, పెద్దలు అంగీకరించలేదో కానీ.. మంగళవారం ఉరవకొండ సమీపంలోని బూదగవి కొండపైకి క్రిమిసంహారక డబ్బాతో వెళ్లాడు. అక్కడ తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకుంటూ ‘‘కులం చూడకుండా ఎవరూ ప్రేమించొద్దు. పెద్దలు అలాంటి ప్రేమను ఒప్పుకోరు. బైబై ఫ్రెండ్స్..’’ అంటూ పురుగుల మందు తాగేశాడు. తీసిన వీడియోను వాట్సాప్ స్టేటస్‌లో అప్‌లోడ్ చేశాడు. గమనించిన స్నేహితులు ఎస్‌ఐ ధరణిబాబుకు సమాచారం అందించారు. వెంటనే కొండపైకి చేరుకున్న ఎస్‌ఐ.. అపస్మారక స్థితిలోని సుధాకర్‌ను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురానికి తరలించారు.
చదవండి:
వీడియో వైరల్: రాస్కెల్.. నన్నే కొడతావా?
వివాహేతర సంబంధం: ప్రియుడిని దూరం పెట్టడంతో