
నేను ఇక్కడే ఉన్నాను, ఆయుధాలు వదిలి పారిపోలేదు.
Ukraine President Selfie Video: ఉక్రెయిన్ దళాలు శనివారం తమ రాజధాని కైవ్‌లో రష్యా దాడిని తిప్పి కొట్టాం అని ప్రకటించిన కొద్ది నిమిషాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో జెలెన్స్కీ "నేను ఇక్కడే ఉన్నాను, ఆయుధాలు వదిలి పారిపోలేదు. మా ఆయుధాతో రష్యా దాడిని తిప్పి కొట్టి మా దేశాన్ని రక్షించుకుంటాం. ఇదే సత్యం. అలాగే ఇంటర్‌నెట్‌లో నేను ఆయుధాలు వదిలేసి దేశం నుంచి పారిపోయానంటూ వదంతులు వస్తున్నాయి.
అది నిజం కాదు. ఇది మా భూమి మా దేశాన్ని, మా పౌరులను రక్షిస్తాం. మా ఉక్రెయిన్ కీర్తిని కాపాడుకుంటాం. ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాది. అని అన్నారు. జెలెన్స్కీ ఆ వీడియోలో ఆలివ్ ఆకుపచ్చ మిలిటరీ తరహా దుస్తులు ధరించి నిర్విరామ యుద్ధంతో అలిసి పోయినప్పటికీ ఏ మాత్రం బెదరకుండా తమ అజేయమైన ధైర్యసాహసాల్ని ప్రదర్శించటం విశేషం. అంతేకాదు ఆ వీడియోలో రాజధాని కైవ్ చుట్టు రష్యా దళాలు భూ, వాయు, జల మార్గాలలో వేస్తున్న బాంబుల మోత వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Не вірте фейкам. pic.twitter.com/wiLqmCuz1p
— Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022
(చదవండి: అమ్మ నాన్న ఐ లవ్ యూ !..వైరల్ అవుతున్న ఉక్రెయిన్ సైనికుడి చివరి వీడియో!)