సూర్యపేట జిల్లా తమ్మారం గ్రామానికి చెందిన కల్పనకు మూడేళ్ళ క్రితం రఘునాథపాలెంకు చెందిన వీరారెడ్డితో వివాహం జరిగింది. కల్పన తల్లిదండ్రులు కట్నంగా మూడేకరాల పొలం ఇచ్చారు. ఏడాది పాటు సాఫీగా సాగిన వీరి జీవితంలో అదనపు కట్నం చిచ్చు పెట్టింది. అదనంగా కట్నం తీసుకు రావాలంటూ కల్పనకు టార్చర్ పెట్టారు అత్తింటి వారు. విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా కొద్ది రోజులుగా కాలం వెళ్లదీస్తూ వచ్చింది కల్పన.